(TM)
వాకింగ్ చేయడం అనేది నిజంగా చాలా సులభమైన ఎక్సర్ సైజ్ . ఏ వయస్సు వారైనా సరే ఎప్పుడైనా సరే ఈజీగా వాకింగ్ చేయవచ్చు. కానీ ముఖ్యంగా వర్షాకాలంలో బయట వాకింగ్ చేయలేరు. డైలీ వాకర్స్ కి ఇలా ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. కానీ అలాంటి వారి కోసమే ట్రెడ్ మిల్. దీని పై ఈజీగా వాకింగ్ చేయవచ్చు. అలాగే దీనిపై రన్నింగ్ కూడా చేయవచ్చు. బరువు తగ్గాలని భావించేవారు ఎక్సర్సైజులు చేసేందుకు జిమ్‌కు వెళ్తుంటారు. మొదట్లో కష్టంగా ఉంటుంది కాబట్టి నెమ్మదిగా చేయాలి. ట్రెడ్ మిల్ పై వాకింగ్ మొదట్లో చాలా స్లో గా చేయాలి. ఇలా ప్రతి రోజూ కనీసం 20-30 నిమిషాల పాటు చేసిన చాలా ప్రయోజనాలను పొందవచ్చు అన్నది వైద్య నిపుణుల మాట. ట్రెడ్మిల్ ఇండోర్‌లో ఉుంటుంది కాబట్టి ఎప్పుడైనా మన సౌకర్యాన్ని బట్టి ట్రెడ్ మిల్ చేసుకోవచ్చు.
అసలెందుకు చేయాలి?
ట్రెడ్ మిల్ పై నడక మిమ్మల్ని గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది. మీ శరీరం చురుగ్గా ఉంటుంది. రక్తపోటును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని , కేలరీలు రెండూ తగ్గుతాయి. ప్రతి రోజు ట్రెడ్ మిల్ పై రన్నింగ్ చేయడం వల్ల గుండెకు చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా శరీరంలో రక్త సరఫర బాగా మెరుగు పడుతుంది. హైబీపీ కూడా తగ్గుతుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ట్రెడ్ మిల్ ని ఉపయోగించడం వల్ల ఫ్యాట్ కూడా సులభంగా కరిగిపోతుంది. అందుకే జిమ్ చేసే వాళ్లందరూ వీటికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వలి. జిమ్‌లో ట్రెడ్ మిల్ పై వ్యాయామం చేయాలంటే దానిపై అవగాహన ఉండి తీరాలి. ఏ మాత్రం తెలియకుండా ప్రయోగాలు చేయకూడదు. ఒక వేళ చేస్తే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ట్రెడ్ మిల్ లో ఆల్రెడీ లోడ్ అయి ఉన్న ప్రోగ్రామ్‌ల గురించి ముందు తెలుసు కోవాలి. నడక కోసం, రన్నింగ్ కోసం, గుండె ఆరోగ్యం కోసం సెట్టింగ్స్ ప్రోగ్రామ్ చేయబడి ఉంటాయి. ట్రెడ్మిల్ పై వర్కవుట్ చేస్తున్నపుడు, మీ గుండె స్పందనల రేటుని చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకోవడానికి ట్రెడ్మిల్ కు సంబంధించిన వాచీ ధరించాల్సి ఉంటుంది. ట్రెడ్ మిల్ ను వాడేవారు రన్నింగ్ కోసం ఉపయోగించే షూస్ ని వాడాలి.
ట్రెడ్ మిల్ (TM) ని ఎలా ఉపయోగించాలి?
ప్రతి ట్రెడ్ మిల్ కొన్ని ప్రీ స్ట్రక్చర్డ్ వర్కౌట్స్ ని అందిస్తుంది. ఈ వర్కౌట్స్ లో ఇంటర్వెల్ ట్రెయినింగ్, ఫ్యాట్ బర్న్, కార్డియో హెల్త్, క్రాస్ ట్రెయినింగ్ వంటివి ఉంటాయి. ఎందుకంటే స్పీడ్, టెర్రెయిన్ వంటివన్నీ మనం ఎంచుకున్న ప్రోగ్రాం ఆటోమ్యాటిక్ గా సెట్ చేసేస్తుంది.ట్రెడ్ మిల్ మీద వర్కౌట్ చేస్తున్నప్పుడు ఊపిరి బిగబట్టి చేయకూడదు. మన రన్నింగ్ ఇంటెన్సిటీకి సూట్ అయ్యే రిథమ్ లోనే శ్వాస తీసుకోవాలి. ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్నప్పుడు, హ్యాండ్రైల్ పట్టుకోవడం వల్ల తక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. ఎందుకంటే కాళ్లలోని కండరాలను క్వాడ్రిసిప్స్తోపాటు హమ్స్ట్రింగ్స్ కండరాలను బలంగా చేస్తుంది. ఇది వెన్నెముక, మోకాలు, ఇతర ఎముకలు నొప్పులు ఉన్నవారికి సెట్‌కాదు. ట్రెడ్‌మిల్‌పై పరిగెడితే వీరికి మరింత ప్రమాదకరంగా ఉంటుంది. దీంతో ఫ్రాక్చర్ అయే ప్రమాదం ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
ఒంట్లో బాగుండకపోయినా, అప్పుడే భోజనం చేసి ఉన్నా, చాలా సేపటి నుండీ ఏమీ తినకపోయి ఉన్నా, రన్నింగ్ ఎవాయిడ్ చేయాలి.. అలాగే డీహైడ్రేట్ అయి ఉన్నా కూడా ట్రెడ్ మిల్ యూజ్ చేయకూడదు. ట్రెడ్ మిల్ ఎక్సర్ సైజ్ యొక్క ఇంటెన్సిటీని ఒక్కరోజే పెంచకూడదు. ఇది గ్రాడ్యువల్ గా కొన్ని వారాల్లో పెంచుకుంటూ వెళ్లాలి.
ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల శరీరానికి అనుకోని ఒత్తిడి ఏర్పడకుండా ఉంటుంది. ఫలితం గా ఎక్సర్ సైజ్ చేస్తున్నప్పుడు కొలాప్స్ అయ్యే పరిస్థితిని ఎవాయిడ్ చేయవచ్చు.
ఎవరెవరు చేయకూడదు? (TM)
ఎవరికైనా హార్ట్ ప్రోబ్లమ్ ఉన్నా, డయాబెటీస్, స్మోకింగ్, హైబీపీ వంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా, ఇంకేదైనా గుండెకి సంబంధించిన సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాట్రెడ్ మిల్ రొటీన్ మొదలు పెట్టేముందు డాక్టర్ ని కన్సల్ట్ చేసి వారి సూచనల ప్రకారమే చేయాలి. ముప్ఫై ఏళ్ళు దాటిన వారూ, ఇంత వరకూ ఎలాంటి వ్యాయామం అలవాటు లేని వారూ కూడా ముందు డాక్టర్ ని సంప్రదించడేమ మంచిది. కార్డియాక్ పేషెంట్స్ హార్డ్ ఎక్సర్సైజెస్ చేయకుండా ఉండడమే మంచిది, ఎందుకంటే ట్రెడ్ మిల్ వర్కవుట్స్ పల్స్ రేట్ నీ హార్ట్ బీట్ నీ పెంచుతాయి. సో తగిన జాగ్రత్తలతో మాత్రమే ట్రెడ్ మిల్(TM) చేయాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి.