ఖుషీ సినిమాతో హిట్ సొంతం చేసుకున్న విజయ్ దేవర కొండ(VD) ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ చేపడుతునాడు. తాజాగా ఓ పీరియాడిక్ స్పై థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. అదే VD 12 మూవీ. ఇందులో శ్రీలీల హీరోయిన్.అయితే శ్రీలీల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందన్నటాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ ఎవరన్నా ఉన్నారంటే అది శ్రీలీలా. ప్రతి టాప్ హీరో సరసనా నటిస్తూ వరుస హిట్లతో దూకుడు మీదుంది. దీంతో శ్రీలీలా డేట్స్ అడ్జస్ట్ అవ్వక VD12 సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. మరి శ్రీలీల తప్పుకుంట ఆప్లేస్ ను రీప్లేస్ చేసేదెవరు? విజయ్ ఫేవరెట్ హాట్ కోస్టార్ రష్మికా మందన్న నటిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమం పూర్తయి షూటింగ్ కూడా మొదలైనట్టు తెలుస్తుంది.
రష్మిక, విజయ్ జోడీపై ఫ్యాన్స్ రియాక్షన్:
విజయ్ రష్మిక వీళ్ల పెయిర్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. సినిమాలలో ఈ జంటకి చాలా క్రేజ్ ఉంది. విజయ్ మూవీలో రష్మిక నటిస్తే మాత్రం ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతారు. రష్మిక ఈ సినిమాలో నటిస్తే ముచ్చటగా మూడోసారి ఈ జంట ప్రేక్షకుల ముందుకి వచ్చినట్లవుతుంది. వీరిద్దరు కలిసి ఇప్పటికే గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించారు.డియర్ కామ్రేడ్ అట్టర్ ఫ్లాప్ అయినా గీతా గోవిందం మాత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది.. అలాగే విజయ్-రష్మిక మధ్య పుకార్లు కూడా బాగానే ఉన్నాయి.వీరు ప్రేమలో ఉన్నారని డేటింగ్ చేస్తున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ చివరికి వీరు మాత్రం క్లోజ్ ఫ్రెండ్స్ మి మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు VD12 మూవీలో రష్మిక నటిస్తుందనే న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే… చిత్ర యూనిట్ స్పందించాల్సిందే.
VD12 మూవీ స్టోరి
విజయ్ ఈ సినిమాలో పోలీస్ క్యారక్టర్ లో నటించనున్నాడు. ఇప్పటికే విజయ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో విజయ్ ఫేస్ కనిపించకుండా హైడ్ చేశారు. విజయ్ లుక్ తో ఫ్యాన్స్ కి ఈ సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి. నాగ వంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూసర్లు గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా సితార ఎంటర్ టైన్ మెంట్ , ఫార్చూన్ ఫోర్ సంస్థ ఆధ్వర్యంలో తెరకెక్కనుంది. శ్రీకార స్టూడియోస్ వాళ్లు ఈ చిత్రాన్ని సమర్పస్తున్నారు.
11సినిమాలు పూర్తయినా హిట్లు పెద్దగా లేని విజయ్
ఇప్పటికి విజయ్ 11 సినిమాల్లో నటించాడు. ఖుషి తర్వాత విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవర కొండ సినిమా రానుంది. గీతాగోవిందం దర్శకుడు పరుశురామ్ తో మరొ సినిమా చేయనున్నాడు విజయ్. అయితే అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ఖుషి, రౌడీ బేబీ సినిమాలు తప్ప విజయ్ ఖాతాలో పెద్దగా హిట్లు లేవనే చెప్పాలి. ఇటీవల సమంతతో కలిసి ఖుషి అంటూ వచ్చి పర్వాలేదనిపించాడు. మరోవైపు రష్మిక మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉంది. పుష్ప-2, D-51, యానిమల్ ,VNR ట్రియో సినిమాల్లో నటిస్తుంది…తాజాగా విజయ్ మూవీకి ఒకే చేబుతుందో లేదో చూడాలి.