బాలీవుడ్ వెటరన్ నటి వహీదా రెహమాన్ ని అత్యున్నత దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు(Award) వరించింది.వహీదా నటనకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. నటించినది తక్కువ సినిమాలే అయినా మంచి పేరును ఆమె సొంతం చేసుకుంది.దాదాపు ఐదు దశాబ్దాలుగా తన సేవలందించిన లెజెండరి క్వీన్, డ్యాన్సర్ వహీదాకు 2023 సంవత్సరానికి గాను దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును దక్కడం పట్ల బాలీవుడ్ హర్షం వ్యక్తం చేసింది. ఈ అవార్డు దక్కినట్తు కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. భారతీయ చలనచిత్ర రంగానికి చేసిన కృషికి గుర్తుగా ఆమెకు ఈ అవార్డును బహుకరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. 69వ జాతీయ ఫిల్మ్ అవార్డ్ కార్యక్రమంలో వహీదాకు ఫాల్కే అవార్డును అందజేయనున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కమిటీలోని ఐదుగురు సభ్యులు వహీదాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. . 85 ఏళ్ల వహీదా రెహమాన్ కి ప్యాసా, కాగజ్ కే ఫూల్, చౌదవి కా చాంద్, సాహెబ్ బీవీ ఔర్ గులామ్, గైడ్ ఖమోషి, ఢిల్లీ లాంటి చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చాయి.
వహీదా రెహమాన్ కి అవార్డులు (Award)
తన నటనతో ఎంతో మందిని అలరించిన వహీదా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. తన ప్రతిభతో ఎందరినో ఆకట్టుకుంది. ఎన్నో ప్రశంశలు అందుకుంది.వహీదాకు ఏమేం అవార్డులు వచ్చాయంటే..
1966 పిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు
1968 పిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు
1967 బెంగాలీ జర్నలిస్టు అసోసియేషన్ అవార్డు
1971 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
1972 పద్మ శ్రీ
1994 ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు
2006 యన్టీఆర్ జాతీయ అవార్డు
2011 పద్మభూషణ
2012 ముంబయి ఫిలం ఫెస్టివల్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డు
2013 సెంటెనరీ అవార్డు
చెన్నై నుంచి ముంబై కి
వహీదా రెహ్మాన్ 1938 తమిళనాడులోని చెంగల్పట్టులో జన్మించింది. ఆమె మాతృభాష ఉర్దూ. ఆమె భరతనాట్యంలో మంచి పట్టు సంపాదించింది. తండ్రి మొహమ్మద్ అబ్దుర్ రెహమాన్ హటాత్ మరణంతో ఆమెకు నృత్యమే ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఉపయోగపడింది. డాక్టర్ కావాలని కల కానీ పరిస్థితులు అనుకూలించక యాక్టర్ గా సినీ ప్రయాణం మొదలు పెట్టింది. వహీదా రెహ్మద్ భరత నాట్యం ప్రదర్శను చూసిన బాలీవుడ్ నటుడు, చిత్ర నిర్మాత గురుదత్ ఆమెని సినిమాలలోకి తీసుకొనివచ్చాడు. అతనితో 5 సినిమాల్లో నటించింది వహీదా రెహ్మాన్. తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, మలయాళం భాషల్లో నటించిన రికార్డు వహీదా సొంతం.
తెలుగు చిత్రంతోనే సినిమాల్లోకి ఎంట్రీ
1955లో టాలీవుడ్ లోకి రోజులు మారాయి సినిమాలో డాన్స్ తో ఎంట్రీ ఇచ్చింది వహీదా. ఆమె డ్యాన్స్ చేసిన ఏరువాక సాగరో రన్నో చిన్నన్నా పాట ఆ రోజుల్లో చాలా పాపులర్ అయింది.
మంచిపేరు తెచ్చిన చిత్రాలెన్నో…
తెలుగులో రోజులు మారాయి, జయసింహ, బంగారు కలలు, సింహాసనం,చుక్కల్లో చంద్రుడు, లాంటి సినిమాలు వహీదాకు పేరు తెచ్చి పెట్టాయి. తన నటనతో ఎంతో మంది అభినందనలు, పురస్కారాలు అందుకుంది.
బాలీవుడ్ మూవీస్
సీఐడీ సినిమాతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ లో హీరోయిన్ గా వరుస సినిమాల్లో నటించింది. ప్యాసా, కాగజ్ కాపూల్, చైద్వి కా చాంద్, సాహెబ్ బీబీ ఔర్ గులామ్ లాంటి సినిమాలు వహీదా నటనకు తార్కాణంగా నిలుస్తాయి.
సహ నటుడినే పెళ్లాడి … (Award)
ఆమె షగున్ లో కమల్ జిత్ సింగ్ సరసన నటించింది.. సిని ప్రయాణం కాస్త ప్రేమ బంధంగా మారింది. 1974 ఏప్రిల్ 27 న కమల్ జిత్ సింగ్ ని వివాహం చేసుకుంది. ఆమెకు సోహైల్ అనే కొడుకు,కష్వీ అనే కుమారై ఉన్నారు.