IRAQ
పెళ్ళి అనగానే అందరు ఎవరి పనులో వారు బిజి బిజిగా ఉంటారు. అంగరంగ వైభవంగా జరిగే ఆ వేడుకలో ఎన్నో ఈవెంట్లు ఉంటాయి. అలాంటి ఆ శుభ ముహూర్తంలో అతిపెద్ద అగ్ని ప్రమాదం ఏకంగా వంద మంది మరణానికి కారణమైంది. ఉత్తర ఇరాక్‌లోని అల్-హమ్దానియా పట్టణంలోని ఒక ఈవెంట్ హాల్లో వివాహం జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగడంతో 100 మంది మరణించారు. ఈ ప్రమాదం మంగళవారం రాత్రి సుమారు 10:45 గంటలకు జరిగినట్లు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదంలో మరో 150 మందికి పైగా గాయపడినట్లు ఇరాక్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ఎగసిపడిన అగ్నికి గాయపడిన 150 మందిని హమ్దానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈవెంట్ హాల్లో మంటలు చెలరేగడానికి ఈ వేడుకలో ఉపయోగించిన బాణాసంచా కారణమని ప్రాథమికంగా ఇరాక్ పౌర రక్షణ విభాగం తెలిపింది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయన్నారు అధికారులు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
భారీ బాణా సంచాయే కొంపముంచింది IRAQ
ఇరాక్ చరిత్రలోనే అతిపెద్ద అగ్ని ప్రమాదమని అధికారులంటున్నారు. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. హమ్దానియాలోని ప్రధాన హాస్పిటల్ ముందు వందలాది మంది రక్తదానం చేసేందుకు వేచి చూస్తున్నారు. బాణాసంచా కాల్చడం సహా నిబంధనలకు విరుద్ధంగా ఈవెంట్ హాల్లో అత్యంత మండే స్వభావం గల వస్తువులను ఎక్కువగా ఉంచడమే భారీ ప్రమాదానికి దారి తీసిందని అనుమానిస్తున్నారు. మంటల ధాటికి ఈవెంట్ హాల్ సీలింగ్ కూడా కూలిపోయింది. చాలా నాసిరకం మెటీరియల్‌తో భవనం నిర్మించినట్లు గుర్తించారు.
క్రైస్తవుల పెళ్లిలోనే ఘటన IRAQ
ఉత్తర ఇరాక్‌లో క్రైస్తవ వివాహానికి ఆతిథ్యం ఇస్తున్న హాలులో ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రాజధాని బాగ్దాద్‌కు వాయువ్యంగా 335 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోసుల్ నగరానికి వెలుపల క్రైస్తవులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగడంతో పెళ్లి మండపంపై మంటలు బారిగా ఎగసిపడాయి. ఎగసిపడిన మంటల్లో ఈవెంట్ హాలు పూర్తిగా కాలిపోయింది. ఇరాక్ సెమీ అటానమస్ కుర్దిస్తాన్ ప్రాంతంలోని ఫెడరల్ ఇరాకీ అధికారులు అంబులెన్సులు, వైద్య సిబ్బందిని సంఘటన స్థలానికి పంపించారు. సంఘటన స్థలంలో ఎటు చూసినా సజీవ దహనమైన మృతదేహాలు కనిపించాయి. గాయపడిని వారిని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కాపాడి వారిని అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు.
సహాయ చర్యలు ముమ్మరం
ఈ అగ్ని ప్రమాదంలో ప్రభావితమైన వారికి సహాయం అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి సైఫ్ అల్-బదర్ చెప్పారు. ప్రధాన మంత్రి మహమ్మద్ షియా అల్-సుడానీ అగ్నిప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. గాయపడిన వారిలో కొందరిని ప్రాంతీయ ఆసుపత్రులకు తరలించినట్లు నినెవే ప్రావిన్షియల్ గవర్నర్ నజిమ్ అల్-జుబౌరీ తెలిపారు.
మంటలు చెలరేగడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వేడుకలో 1000 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వేడుకలో భారీ బాణా సంచాను కాల్చడం దాని మంటలు రూఫ్ పై నున్న షాండిలియర్ కు తాకడం వల్లనే ఈ మంటలు పెద్దవయ్యాయని తెలుస్తోంది. ఘటన జరిగే సమయానికి పెళ్లికుమార్తె, పెళ్లికొడుకు ఇద్దరూ స్టేజిపై డ్యాన్సులో మునిగి తేలుతున్నారు. వారికి కూడా తీవ్రంగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. IRAQ