(pain)
ఆరోగ్యంగా ఉంటే అన్ని ఉన్నట్లే. జీవితంలో ఎదైనా సాధించాలన్నా లేదా సాధించినదాన్ని మనస్ఫూర్తిగా అనుభవించాలన్నా ముందు అందరం ఆరోగ్యంగా ఉండాలి. దీనిబట్టి మనిషి జీవితంలో ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యత తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న కాలంలో అధిక బరువు, కొలెస్ట్రాల్ వంటివి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతిస్తున్నాయి. అధిక బరువు లేదా బాడీ ఫ్యాట్ బట్టి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను అంచనా వేస్తుంటారు. అయితే కాళ్లతో పాటు శరీరంలోని ఇతర భాగాలలో ఏర్పడే కొన్ని సంకేతాలను బట్టి కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగాయని గుర్తించాలి. అయితే కొలెస్ట్రాల్ అడ్డంకులు ఎర్పడితే కొన్ని లక్షణాలు మనకు తెలుస్తాయి. సామాన్యుల పరిభాషలో కీళ్ళు అరిగిపోయాయి అని చెప్పుకునే ఆస్టియో ఆర్థ రైటిస్ 40 ఏళ్ళు దాటిన వారిలో ముఖ్యంగా మహిళలలో పెరుగుతున్నది. సరిగ్గా నడవలేని పరిస్ధితులో ఒకసారి ఆస్టియో ఆర్థ రైటిస్ వస్తే ఇక తగ్గదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. నిజానికి సకాలంలో గుర్తించి వైద్యం చేయించుకోకపోతే అది ఇక తగ్గే స్టేజి దాటిపోయిందని అర్ధం చేసుకోవాలి.
కాళ్ల పరీక్షలు ఎలా చేస్తారు?
కాలు నొప్పి(pain) అనేది ఒక వ్యాధి కాదు కానీ రక్త ప్రసరణ సమస్యలు, కండరాల గాయాలు, ఎముక పగుళ్ళు లేదా నరాల సమస్యలతో తలెత్తుతుంది. కాలు నొప్పి యొక్క ఖచ్చితమైన కారణం తెలుసుకొవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ రోగనిర్ధారణకు రక్త పరీక్షలు మరియు కంప్యూటింగ్ టొమోగ్రఫీ స్కాన్, ఎక్స్ రేలు వంటి ఇమేజింగ్ పరీక్షలు ఉన్నాయి. ఇక చికిత్స విషయానికొస్తే కాలు నొప్పి కి కారణం కనుగొని, తగినంత విశ్రాంతి తీసుకోవడం మొదటి మెట్టు. ఆపై మందులు, సర్జరీ, ఫిజియోథెరపీలాంటి చికిత్సలుంటాయి. కానీ తిమ్మిరి వంటి పరిస్థితులకు కారణమైన కాలుని రెస్ట్ లో ఉంచడం, హీటింగ్ ప్యాడ్ లు, ఐస్ ప్యాక్ లు ఉపయోగించుట ద్వారా చికిత్స చేయవచ్చు అని డాక్టర్స్ చెబుతున్నారు. జీవన విధానాలను మార్చుకోవడం లేక మందుల ద్వారా పీఏడీని దూరం చేసుకోవచ్చు. ధూమపానానికి,మద్య పానానికి దూరంగా ఉండడం మంచిది. ధూమపానం చేయని వారికంటే చేస్తున్న వారిలోనే కాళ్ల జబ్బులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాళ్ల నొప్పులు ఉన్న వారు బీపీలో హెచ్చుతగ్గులు లేకుండా చూసుకోవాలి. వ్యాయాయం ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. వారంలో ఐదు రోజులు 45 నిముషాల పాటు వ్యాయామం చేయాలి. కొవ్వు శాతం తక్కువగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
కాలు నొప్పి అంటే ఎమిటి? (pain)
కాలు నొప్పి అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ప్రతీ వ్యక్తీ ఎదో ఒక సమయంలో దీనిని అనుభవించే ఉంటారు. ఇది ఒక గాయం వల్ల ఏర్పడి ఉండవచ్చు. ఒక రోజులో తగ్గకపోతే ఇది అరుదుగా ఒక తీవ్రమైన సమస్యగా మారుతుంది. కాళ్లలో నొక్కినచోట గుంటలా ఏర్పడి అది మెల్లగా సర్ధుకోవడాన్ని సాధారణంగా పిట్టింగ్ అంటారు. ఈ సమస్యను ఎడిమా అంటారు. ఈ సమస్య సాధారణంగా పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువగా ఉంటుంది.
పీఏడీ(PAD) సమస్య అంటే ఏంటి? ఎవరికి వస్తుంది?
పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ పీఏడీ(PAD) మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కాళ్ల కదలికలో తేడాలు వస్తాయి. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి కనిపిస్తుంది. కాలు ఈడ్చుకుంటూ నడవాల్సి వస్తుంది. అలసట, భారం ఎక్కువగా ఉంటాయి. దీన్నే ‘ఇంటర్మింటెంట్ క్లాడికేషన్’అంటారు. ఒక్కోసారి అకస్మాత్తుగా బీపీ పెరగడంతోపాటు కిడ్నీలోనూ కదలికలు తగ్గిపోతాయి. పెరిగిన అధిక బీపీ తగ్గడానికి మందులు వేసుకున్నా అది తగ్గుతుందని చెప్పలేం. కిడ్నీకి సంబంధించిన రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల అది పూర్తి పని చేయకపోవచ్చు.ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం ద్వారా పెరిఫెరల్ ఆర్టిరీ డిసీజ్‌ను గుర్తించవచ్చు. ఇందుకు సంబంధించి చేసే పరీక్షలను ఏబీఐ యాంకిల్ బ్రాకియల్ ఇండెక్స్ అంటారు. వైద్యులు దీనితోపాటు ఇతర పరీక్షలూ చేస్తారు.డాప్లర్ అండ్ డూప్లెక్స్ అల్ట్రాసౌండ్ ఇమేజింగ్. మాగ్నిటిక్ రిజనన్స్, యాంజియోగ్రామ్ ఎంఆర్ఏ సీటీ యాంజియోగ్రామ్. రెగ్యులర్ యాంజియోగ్రామ్ లాంటి పరీక్షలతో నొప్పికి మూలకారణాన్ని కనుగొనవచ్చు.
కాళ్ల చర్మం రంగు మారడం…
పోషకాలు, ఆక్సిజన్‌ను మోసుకెళ్లే రక్త ప్రవాహం తగ్గడం వల్ల కణాలకు సరైన పోషణ లభించకపోవడం వల్ల కాళ్ల రంగు మారుతుండొచ్చు. కాళ్లను పైకి లేపడానికి ప్రయత్నించడం వల్ల చర్మం లేతగా కనిపించవచ్చు. చర్మం ఊదారంగు లేదా నీలం రంగులో ఉన్నట్లు అనిపిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ కారణంగా పాదాలు లేదా కాళ్లు వేసవిలో కూడా చల్లగా అనిపించేలా చేస్తాయి. ఈ సంకేతం పెరిఫెరల్ వాస్క్యూలర్ వ్యాధి కిందకి వస్తుంది. ఇలా ఉన్నవాళ్లు వెంటనే డాక్టర్ ని సంప్రదిస్తే మంచిది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వారిలో నిద్రపోతున్నప్పుడు కాలు తీవ్రమైన తిమ్మిర్లకు గురవుతుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు పరిస్థితి మరింత దిగజారుతుంది.
పాదాలపై పుండ్లు,నొప్పి (pain)
కాళ్లు ముడుచుకున్నప్పుడు ఆక్సిజన్‌తో కూడిన రక్తం తగినంత మొత్తంలో శరీర భాగానికి చేరదు. దీంతో కాలు బరువుగా అనిపిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ లెవల్స్ ఉన్న వారు అవయవాలలో మంట, నొప్పి గుర్తించి డాక్టర్‌ను సంప్రదిస్తుంటారు. ఒకటి లేదా రెండు కాళ్లలో ఉండవచ్చు కాలు లేదా పాదాల వద్ద పుండ్లు నయం కాని పరిస్థితి ఉంటుంది. ఇది రక్త ప్రసరణ లోపాల వల్ల ఏర్పడుతుంది. PAD ఉన్న వ్యక్తులు అలసట, నొప్పి కారణంగా వేగంగా నడవలేరు. ముందుగానే గుర్తించి చికిత్స పొందినట్లయితే, కాళ్ళ అల్సర్లు లాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడవచ్చు.