కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ కంగనా రనౌత్(KR). తరచూ ఏదో ఒక వివాదంతో అందరి నోళ్లులో నానుతూ ఉంటుంది ఈ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్. ప్రస్తుతం పెళ్లి చేసుకుంటోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఓ బిజినెస్ మ్యాన్ ని కంగన వివాహం చేసుకుంటోందని బాలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. అసలు విషయం ఏమిటంటే కంగనా పెళ్లి పై ఒ క్రిటిక్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ అందాల భామ ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యిందని…. కెరిర్ మంచిగా ఉన్నప్పుడే పెళ్ళి చేసుకోవాలని అనుకుంటోదని తన ట్వీట్ లో రాశాడు ఆ క్రిటిక్. ప్రముఖ బిజినెస్ మ్యాన్ తో ఈ ఏడాది చివరిలో కంగనా ఎంగేజ్ మెంట్ అని వచ్చే ఏడాది ఏప్రిల్ లో పెళ్లి అని ఆ ట్వీట్ సారాంశం. ఈ వార్తల పై కంగనా ఇప్పటి వరకు స్పందించలేదు. మరి ఈ వార్త నిజమా కాదా అనేది ఆమె చెప్పాలి. నటిగా హిందీలో అద్భుతమైన సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న కంగనా.. అదే టైమ్ లో పలు గొడవల్లో చిక్కుకుంది. హృతిక్ తో రిలేషన్ అప్పట్లో సంచలనం సృష్టించింది. అలాగే ఖాన్ త్రయం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
కరణ్ జోహార్ కు కంగనా అంటే నచ్చదా?… (KR)
కంగనాతో గొడవ పడని వారు అంటూ లేరు. బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ కు ఆమెకు ఎప్పుడు ఏదో ఒక వివాదమే. కరణ్ కి కంగనా కి కొంచం కూడా పడదు కామోసు. అందుకే కరణ్ ఇప్పటి వరుకు తనకి నటించడానికి ఒక్క ఛాన్స్ ఇవ్వలేదు. గతంలో కంగనా కరణ్ జోహార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నాక కరణ్ సంగతి చెబుతానంటూ సవాలు విసిరింది. గతంలో తన గురించి కరణ్ మాట్లాడిన వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. వీడియోలో తన గురించి మాట్లాడిన తీరుకు ఫైర్ అయింది. “పనిమాలిన ప్రేలాపనలకు ధన్యవాదాలు నేను కూడా నిర్మాత, దర్శకురాలిగా ఎదిగిన తర్వాత ఇవే మాటలను మీ ముఖాన కొట్టినట్లు చెబుతా” అని ఛాలెంజ్ చేస్తు పోస్ట్ చేసింది. నటిగా తాను కెరీర్ మొదలు పెట్టిన సమయంలో కరణ్ తనని అందరి ముందు అవమానించాడని ఆరోపించింది.
కంగనా సిని కెరీర్
కంగనా(KR) బాలీవుడ్ లో 2006 కెరీర్ మొదలుపెట్టింది. తెలుగులోనూ ప్రభాస్ తో ఏక్ నిరంజన్ మూవీలో హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో మరో తెలుగు సినిమా చేయలేదు. తమిళంలో కూడా అదే పరిస్థితి. కేవలం బాలీవుడ్ లో మాత్రమే నిలదొక్కుకుంది. అయినప్పటికి ఈ మధ్య కాలంలో కంగనా కు హిట్స్ లేవు. ఈ మధ్య నటించిన చంద్రముఖి-2 ఇప్పటికే రిలీజ్ అయింది. హిందీలో నటించిన తేజస్, ఎమర్జెన్సీ అనే చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి.