భారతీయ సంస్కృతిలో తులసి మొక్క కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్క దేవుడితో సమానంగా భావిస్తారు అంతేకాదు ఎంతో పవిత్రమైనది కూడా. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఈ తులసి (Thulasi) ఆకులు తినడం ఎంతో మంచిదంటున్నారు పెద్దలు . పొద్దున్న ఖాళీ కడుపుతో తులసి ఆకులను తీసుకోవడం వల్ల అనేక శారీరక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందట . తులసి ఆకుల్లో విటమిన్ ఎ, సి, కాల్షియం, ఐరన్ మరియు జింక్ వంటి అనేక పోషకాలు కూడా ఉన్నాయట. ఇందులో ప్రొటీన్ మరియు ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. తులసి ఆకులను ఆయుర్వేదంలో వివిధ వ్యాధుల చికిత్సకు ఉపయోగితుంటారని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. తులసి ఆకులని తీసుకోవడం వలన అధిక ఒత్తిడి, ఇస్కీమియా, వ్యాయామ పరిమితి, చలి మరియు శారీరక ఒత్తిడి నుండి అవయవాలు మరియు కణజాలాలను రక్షించడంలో సహాయపడుతుందట. పరగడుపున తులసి ఆకులను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు చూద్దాం.
రోగనిరోధక శక్తి :
తులసి (Thulasi) ఆకులు మన శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుందట . ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరాన్ని వివిధ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుందట . ఇది హానికరమైన బ్యాక్టీరియా మరియు వైరస్లతో సైతం పోరాడి ఆరోగ్యకరమైన రోగనిరోధక కణాలను బలపరుస్తుందట . అందుకే ఏదైనా కషాయం తయారుచేసేటప్పుడు తులసి ఆకులను కూడా అందులో కలుపుతారట .
జీర్ణక్రియను :
ప్రతిరోజు క్రమం తప్పకుండా తులసి ఆకులను తీసుకుంటే,జీర్ణక్రియను సులభతరం చేసి ప్రేగు పనితీరును కూడా మెరుగుపరుస్తుందట. అసిడిటీ సమస్య నుండి కూడా ఉపశమనం కలిగిస్తుందట. దేనితో కడుపు pH స్థాయిలు అసమతుల్యత లేకుండా. రోజు కేవలం రెండంటే రెండు తులసి (Thulasi) ఆకులను నోట్లో వేసుకుని నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందటే అంత అద్భుతమో కదా..!
నోటి దుర్వాసన :
చాలా మంది నోటి దుర్వాసన సమస్య తో బాధపడుతున్నారు. ఎవరితోనైనా దగ్గర గ వెళ్లి మాట్లాడాలి అన్నకూడా సంకోచిస్తుంటారు. కొంతమంది ఈ సమస్య కు బయట దొరికే Mouth Fresheners ను వినియోగిస్తుంటారు. అవి కృత్రిమం గా తయారుచేస్తారు కాబ్బటి అవి మంచిది కాదట. ఈ సమస్య ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం రెండు తులసి ఆకులను నమలడం అలవాటు చేసుకుంటే ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటి దుర్వాసనను పోగొడుతుందట. ఎప్పుడు ఫ్రెష్ గా ఉల్లాసంగా ఉండటానికి కచ్చితంగా ఉదయాన్నే తులసి (Thulasi) ఆకులు తినాలంటున్నారు పెద్దలు .
ఒత్తిడిని నియంత్రిస్తుంది :
తులసి ఆకులలో అడాప్టోజెన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయట. ఇది నాడీ వ్యవస్థకు కూడా విశ్రాంతినిస్తుందట. మరియు రక్త ప్రసరణను మెరుగుపరిచి . ఇది ఇంద్రియాలను ప్రశాంతపరుస్తు ఒత్తిడిని తగ్గిస్తుందట.
చర్మాన్ని మెరుగుపరుస్తుంది :
ఖాళీ కడుపుతో తులసిని (Thulasi) తీసుకోవడం వల్ల రక్తంలోని టాక్సిన్స్ తొలగిపోతాయట . ఇది మొటిమలు మరియు వయస్సు తో పాటు వచ్చే మచ్చలను కూడా తగ్గిస్తుందట. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయట .
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది :
తులసి వినియోగం ఇన్సులిన్ స్రావాన్ని పెంచుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. తులసిలోని (Thulasi) కార్బోహైడ్రేట్లు జీవక్రియను పెంచుతాయి. బాసిల్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. దీన్ని ఉదయాన్నే తీసుకుంటే జలుబు తగ్గుతుంది.