300
మనం ఎటువంటి ఆహారం తీసుకున్నా అది మన ఆరోగ్యం కోసమే.. ఆరోగ్యం కోసం మనం ఎంత ఖర్చు పెట్టడానికి అయినా ముందు వెనుక ఆలోచించము. అయితే మనం కొని తెచ్చుకున్న కూరగాయలు, ఆకుకూరలు , పండ్లులో ఉండే పోషకాల కంటే ఎక్కువ పోషకాలు మునగ ఆకులో ఉన్నాయి. మునక్కాయ గురించి అందరికీ తెలిసిందే. మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. సాంబారులో మునక్కాయ ముక్కలు కనిపిస్తే వాటిని తినని వారు ఎవరైనా వుంటారా? ఆ టేష్టే వేరు. మునక్కాయలను వాడినంతగా మునగాకును ఎవరు వాడరు. అయితే మునక్కాయ కంటే మునగాకే చాలా మంచిదని మనం తెలుసుకోవాలి. మునక్కాయలలో రుచి మాత్రమే ఉంటుంది.
ఔషధాల గని మునగ 300
మునగాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మునగాకు ను మానవుల పాలిట సంజీవనిగా భావించాలి. ఎందుకంటే దీనిలో 300 లకు పైగా రోగా లను నయం చేసే శక్తి ఉంటుంది అని చాల రకాల పరిశోధనలలో తేలింది. మునగాకును వంటలలో వాడుతారని చాల మందికి తెలియదు. మునక్కాయలను వాడినంతగా మునగాకును ఎవరు వాడరు. మునగాకుతో వండిన కూరలు ఇష్టంగా తినేంత రుచిగా వుండకపోవచ్చు. కానీ అది అందించే ఆరోగ్యం మాత్రం ఎక్కువే. మనం తీసుకునే అన్ని కూరకాయలలో కంటే మునగాకులో ఎక్కువ పోషకాలు, ఖనిజ లవణాలు ఉంటాయి. మునగాకులో ముఖ్యంగా విటమిన్ `ఏ`, విటమిన్ `సి`, కాలిషియం, పాస్పరస్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుది. పాలలో కంటే 17 రేట్లు ఎక్కువగా కాల్షియమ్, పెరుగులో ఉండే ప్రోటీన్ల కంటే 8 రేట్లు అధికంగా, అరటి పండ్ల కంటే 15 రేట్లు పొటాషియం ఎండిన మునగాకు పొడిలో మనకు లభిస్తుంది. మునగ చెట్టు ఆకులు, పువ్వులు, కాయలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
కీళ్ల నొప్పలకు మునగాకు దివ్య ఔషదం. మోకాళ్ల నొప్పలు ఉన్న వారు మునగాకును నూరి కట్టుకడితే వెంటనే ఉపశమనం ఉంటుంది. మునగాకు రసాన్ని త్రాగాడం వల్ల కంటిచూపు, రేచికటి వంటి సమస్యలు తగ్గిపొతాయి. మచ్చలు, దురదలు మరియు ఇతర చర్మరోగాలకు మునగాకుని నూరి చర్మంపై రాయడం వల్ల చర్మ వ్యాధులు నివారిస్తాయి. మునగాకు రసాన్ని ప్రతి రోజు తీసుకోవడం వల్ల గుండె, కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. మునగాకు రసం రక్తహీనతని కూడా నివారిస్తుంది. మునగాకు రసాన్ని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా, ధృడంగా తయారవుతాయి.
బాలింతలకి వరం మునగాకు
గర్భిణులకు, బాలింతలకు మునగాకు రసం అమృతంతో సమానం. మునగాకు రసంలో బాలింతలకు అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతో పాటుగా, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా వుంటారు. పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి. మునగాకులను నీటిలో వేసి ఐదు నిమిషాలు కాచి చల్లారనివ్వాలి.
ఆ నీటిలో ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి. మునగాకు రసాన్ని కొబ్బరినీళ్ళలో ఒక చెమ్చ్ కలిపి త్రాగితే విరోచనాలు తగ్గిపొతాయి. ఈ రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటివి తగ్గిపోతాయి. మునగాకు థైరాయిడ్ ని నియంత్రిస్తుంది మరియు షూగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. సంతాన సమస్యకు కూడా మునగాకును ఔషధంగా పనిచేస్తుంది.
అమీనో ఆమ్లాలు పుష్కలం 300
మానవ శరీరంలో ఉత్పత్తి చేయలేని ఎనిమిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు మాంసాహార ఆహారాలలో మాత్రమే కనిపిస్తాయి. ఈ యాసిడ్లను మొత్తం ఎనిమిది కలిగి ఉన్న ఏకైక శాకాహారం మునగాకు మాత్రమే. మునగాకుని మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు చాలా రెట్లు పెరుగుతాయి. మనం మునగాకు లేదా మునగకాయలను ఆహారంలో ఎక్కువగా తీసుకుంటే జీవితాంతం ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉండదు అని వైధ్య నిపుణులు చెబుతున్నారు.