16
మెగా స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ఈ మెగా స్టార్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో మన ముందుకు రానున్నాడు. ఈ సినిమా అనుకున్న దానికంటే ఆలస్యమవుతున్న తరుణంలో చెర్రి మరో ప్రాజెక్ట్ కి సిద్ధంగా ఉన్నాడు. చెర్రి 16వ సినిమా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రానుంది. రోజు ఏదో ఒక మూవీ అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ ను, హీరోయిన్ ను ఒకే చేసేశారట మేకర్స్. ఈ అప్డేట్ లతో చెర్రి ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ ఫీల్ అవుతున్నారుట .
రెహ్మాన్ మ్యూజిక్
చెర్రి, బుచ్చిబాబు సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా ఏ ఆర్ రెహమాన్ ఒకే చేశారు. రెహమాన్ మ్యూజిక్ ట్యూన్స్ కి రామ్ చరణ్ డాన్స్ ఊహించుకోవడానికే పూనకాలు వస్తున్నాయి. ఈ అప్డేట్ తో చరణ్ ఫ్యాన్స్ పుల్ ఖుష్ అవుతున్నారు. RC16 సినిమా షూటింగ్ షురూ చేయకుండానే రెహమాన్ తన మ్యూజిక్ మొదలు పెట్టేశాడట. ఈ సినిమా కోసం ఆల్రెడీ ఓ సాంగ్ ని కంపోజ్ చేసేశాడట రెహమాన్. అంతేకాదు ఆ సాంగ్ ని ఒకే చేశారట. మిగతా సాంగ్స్ అండ్ మ్యూజిక్ వర్క్ కూడా చేస్తున్నాడట రెహమాన్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
RC16 మూవీలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ కూతురు:
రామ్-బుచ్చిబాబు సినిమాకు హీరోయిన్ ను ఒకే చేశారట. ఆ హీరోయిన్ ఎవరా? అనే ప్రశ్నలు సిని ఇండస్ట్రీలో బాగానే వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు స్టార్ హీరోయిన్ కూతురు హీరోయిన్ గా నటిస్తుందట. ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించనే లేదు ఏకంగా గ్లోబల్ స్టార్ సరసనా నటిస్తుందనే వార్తలు అందరిలో ఉత్ఖంట రెపుతోంది.
హీరోయిన్ గా రవీనా కుమార్తె 16
తను ఎవరో కాదు అలనాటి నటి రవీనా టాండన్ గారాల పట్టి రశా తాడాని. రామ్ చరణ్ మూవీలో హీరోయిన్ గా నటించబోతుందట. రశా ఇక సినిమాతో సిని పరిశ్రమకు పరిచయం కానుంది. కేజీఎఫ్-2 లో ప్రధాన మంత్రి పాత్రలో అదరగొట్టింది రవీనా టాండన్. ఇక రవీనా కూడా ఈ సినిమాతో తన కుతురిని సిని పరిశ్రమకు పరిచయం చేయాలని చూస్తుందట. రశా ఈ సినిమాకు సంబంధించిన ఫోటో షూట్ కూడా పూర్తయిందట. ఇక రశా యాక్టింగ్ ఎలా చేస్తుందనే విషయం తెలుసుకోవడమే తరువాయి అని సమాచారం. అందుకోసం మేకర్స్ ఓ వర్క్ షాప్ ను నిర్వహించబోతున్నారట. అందులో భాగంగా రశానే ఒకే చేశారనే సమాచారం.
ఇక ఈ సినిమాతో రామ్ చరణ్- రశా తాడాని కాంబినేషన్ ప్రేక్షకులను ఎలా అలరించబోతున్నారో చూద్దాం. బాలీవుడ్ లో కూడా ఓ అగ్ర హీరో ఫ్యామిలీకి చెందిన నటుడితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అభిషేక్ కపూర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భామ తొలి సినిమాతోనే స్టార్ హీరోల సరసనా నటించబోతుంది.విలేజ్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కబోతుందని మేకర్స్ చెబుతున్నారు. చెర్రీ డైలాగులు ఉత్తరాంధ్ర స్టయిల్ లో చెప్పబోతున్నట్లు ఇన్ సైడ్ టాక్.