యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా,కొరటాల శివ దర్శకత్వం లో రానున్న సినిమా దేవర. ఈ సినిమాకు డీవోపీ రత్నవేలు సినిమాటోగ్రాఫర్ పనిచేస్తున్నాడు. గతంలో సముద్రంలో ఓ భారీ షార్క్ తో తారక్ ఫైట్ చేయబోతున్నట్లు ప్లాన్ కూడా చేశారు మేకర్స్. అంతటి భారీ యాక్షన్ తో, ఫైట్ లతో ఈ సినిమా రానుంది. ప్రస్తుతం ఈ మూవీ నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ను రిలీజ్ చేశాడు రత్నవేలు. ఈ చిత్రంలో బిగ్గెస్ట్ యాక్షన్ ఎపిసోడ్ ని పూర్తిచేశాం అంటూ రత్నవేలు ట్రీట్ చేశాడు. తాను ఇచ్చిన అప్డేట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ ట్వీట్ లో సముద్ర గర్భంలో, ఉపరితలం పై అండర్ వాటర్ యాక్షన్ ఎపిసోడ్ పూర్తి చేశామని తెలిపాడు. ఈ ఎపిసోడ్ లో సముద్రంలో రాత్రి పూట జరిగే భారీ యాక్షన్, ఫైట్ సీన్ లు పూర్తి చేశారు. సముద్రంలో ఉన్న ఫైట్ సీన్ లకు సోలమాన్ నేతృత్వం వహించాడు. తారక్ సముద్రంలో శత్రువులని చీల్చి చెండాడే యాక్షన్ సీన్ లను చూస్తే గూస్ బంప్స్ తెప్పిస్తుందట.
సముద్ర మధ్యమంలో సాగే యాక్షన్ సీన్ లు చిత్రికరించడం కోసం వంద అడుగుల లోతైన వాటర్ సెట్ నిర్మించారట మేకర్స్. ఈ వాటర్ సెట్ శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పటు చేశారు. ఎన్టీఆర్ ఆ సెట్ లోనే సముద్రానికి సంబంధించిన సన్నివేశాలు పూర్తి చేసినట్లు సమాచారం. టైటానిక్ ని తలపించే భారీ ఓడ సెట్ కూడా నిర్మించారట. ఈ సినిమాలో సముద్ర సన్నివేశాలను ఎంతో అద్భతంగా చిత్రకరించారట చిత్ర బృందం. ఊహకి అందని విధంగా సీన్ లు ఉండటం వల్లన ప్రతి ఒక్కరికి మూవీ మీద అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి చిన్న అప్డేట్ సినిమా పాన్ ఇండియా లెవల్ లోఉంటుందని అంచనాలు వేస్తున్నారు ప్రేక్షకులు.
అనిరుధ్ పాట… తారక్ ఆట RRR
సౌత్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరక్టర్ గా అనిరుధ్ రవిచంద్రన్ తన హవా నడిపిస్తున్నాడు. సినిమా పాటలతో పిచ్చెక్కిస్తూనే… బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు అనిరుధ్. ప్రస్తుతం దేవర మూవీ కొసం అనిరుధ్ రెండు పాటలను రెడీ చేశాడట. చిత్రయూనిట్ వాటిని ఒకే కూడా చేశారట. అందులో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందట. ఆ పాట కోసం ఓ స్టార్ హీరోయిన్ కు పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట. ఇక అనిరుధ్ పాటలకి తారక్ డ్యాన్స్.. థియేటర్స్ లో విజిల్, కేకలు మోత మాములుగా ఉండదు.
దేవర మూవీ రిలీజ్ డెట్:
దేవర సినిమా లో ప్రీ ప్రొడక్షన్ పనులు భారీగా ఉంటాయని సమాచారం. అందుకే సినిమా థియేటర్స్ లో రిలీజ్ కి ఆలస్యమవుతోందని చెబుతున్నారు మేకర్స్. సినిమా మొదలైన దగ్గరనుంచి శరవేగంగా షూటింగ్ పనులు చేస్తున్నారు.అనుకున్నట్లే వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా స్థాయిలో భారీగా ఈ సినిమా రీలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
మూవీలో నటించే ప్రముఖులు: RRR
ఎన్టీఆర్ కి జతగా జాన్వీ కపూర్ నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్, కలిసి దేవర సినిమాను నిర్మిస్తున్నాయి.