k
కరివేపాకు… ఇది తెలియని వారంటూ ఎవరూ ఉండరూ. ఎందుకంటే మనం భోజనం చేసేటప్పుడు మొట్ట మొదటిగా తీసి పక్కన పెట్టేది కరివేపాకే. కరివేపాకు లేని తాలింపు ఉండదు. కరివేపాకు తాజా సువాసన, కమ్మని రుచిని అందిస్తుంది. అందుకే,మన ఇళ్లల్లో కరివేపాకు లేనిదే వంట పూర్తికాదు. ఉప్మాలో, పులిహోరలో, కూరలలో, సాంబార్ లో, రసంలో దేనిలోనైనా కరివేపాకు వేస్తే వచ్చే రుచే వేరు. ఎందుకంటే కరివేపాకు వేయడం వల్ల వంటకు రుచి, సువాసన బాగా ఉంటుంది. కూరకి రుచి అంటగానే చక్కగా ఆకులని కాస్తా ఏరిపారేస్తారు. సాధారణంగా సరదాగా మాట్లాడుకునేటప్పుడు “కూరలో కరివేపాకులా తీసిపడేశారు” అని అంటూ ఉంటారు. చాలా మంది కరివేపాకే కదా అని చిన్న చూపు చూస్తారు. కరివేపాకు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీని వల్ల మన ఆరోగ్యనికి మేలు అంతా ఇంతా కాదు. అవేంటో తెలుసుకుందాం…
పోషకాలతో కూడిన చవకైన ఆకు k
కరివేపాకు మనకు లభించడం మన అదృష్టంగా భావించాలి.కరివేపాకు మంచిదని అందరికీ తెలుసు కానీ ఇష్టం లేకనో లేక అలవాటులేకనో కరివేపాకుని తినడానికి కొందరు ఎక్కువగా ఇష్టపడరు. కరివేపాకును తినని వారికి కరివేపాకులోని ప్రయోజనాలను కోల్పోకుండా పొడిలా చేసి అల్పహారంలో కాని, ఆహారంలో కాని తీసుకోవడం వల్ల చాలా మంచిది. కరివేపాకు పొడిలో, నెయ్యి కలిపి అన్నం తినిపిస్తే పిల్లల్లో ఆకలి పెరుగుతుంది.కరివేపాకులో శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లూ,విటమిన్-A, విటమిన్-B, విటమిన్-C,విటమిన్-E,కెరోటిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి.
తాజా కరివేపాకులో ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్ధాలు, పీచు పదార్ధాలు, ఖనిజ లవణాలు, క్యాలరీలు అధికంగా ఉంటాయి. కరివేపాకుని ఎక్కువగా మనదేశంలోనే పండిస్తారు. చైనా, ఆస్ట్రేలియా, సిలోన్, నైజీరియాల్లో కూడా కరివేపాకు మొక్కలను పెంచుతారు. కరివేపాకులోఉండే యాంటీ ఆక్సిడెంట్స్ లో ఎన్నో రకాల ఔషద గుణాలు ఉంటాయి. అందువలన కరివేపాకుని వంటల్లోనే కాకుండా వివిధ రకాల ఔషధాల్లో కూడా ఉపయోగిస్తారు.కరివేపాకులో యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్, హిప్టో ప్రొటెక్టివ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన కాలేయానికి రక్షణ కల్పిస్తాయి.
శరీరంలో అన్ని భాగాలకూ ఉపయోగమే!
కరివేపాకు జుట్టు సమస్యలను నివారించడమే కాకుండా జుట్టు మూలాలను బలపరుస్తుంది.అంతేకాదు జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. శరీరంలోని బ్యాడ్ కొలెస్ర్టాల్, ఫ్యాట్ ను కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది. ఆమ్లశ్రావం, జీర్ణపూతలు, ఎముకల అరుగుదల, డయాబెటిస్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ వంటి సమస్యలను నియంత్రిస్తుంది. కరివేపాకు చర్మం సంరక్షణకు బాగా సహాయపడుతుంది. కరివేపాకు ఆకులను రసం లేదా పేస్ట్ గా చేసి శరీరానికి రాయడం వల్ల మచ్చలకు, గాయాలకు, చర్మం దురదలు వంటి సమస్యలు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది.
కరివేపాకు తో ఎన్ని లాభాలో… k
కరివేపాకు జీర్ణశక్తిని మెరుగుపరిచి అజీర్తి, యాసిడ్స్ ఎక్కువ ఉత్పత్తి కాకుండా సమతుల్యం చేస్తుంది. కరివేపాకు యూరిన్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. లూకేమియా, ప్రొస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ల నివారణకు కరివేపాకు మంచి ఔషధం లా పనిచేస్తుంది. కరివేపాకులో ఉండే విటమిన్-A కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఎముకల బలహీనతకు మరియు పాము కాటు వంటి సమస్యలకు కరివేపాకు వేర్లు మంచిగా పని చేస్తాయి. కరివేపాకు తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే పదార్ధాలు కరివేపాకులో అధికంగా ఉంటాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారికి కరివేపాకు చాలా మేలు చేస్తుంది. కరివేపాకును రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తహీనతను దూరం చేస్తుంది. ఇటువంటి ఏన్నోలాభాలు కరివేపాకులో పుష్కలంగా ఉంటాయి.