B
మాస్ యాక్షన్, పవర్ పుల్ డైలాగ్స్ కి పెట్టింది పేరు నట సింహ నందమూరి బాలకృష్ణ. ఆయన యాక్షన్ కి, డైలాగ్స్ లకి ఫ్యాన్స్ క్రేజ్ మామూలుగా ఉండదు….అందుకే బాలకృష్ణ సినిమాలు రిలీజ్ అంటే థియేటర్స్ లో రచ్చ రచ్చే . ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాతో మన ముందుకు రానున్నాడు బాలయ్య. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పై రీసెంట్ గా ఏకంగా మూడు అప్డేట్ లతో మన ముందుకు వచ్చారు మేకర్స్. భగవంత్ కేసరి సినిమా రెండో పాట, ట్రైలర్ రీలిజ్, థియేటర్స్ లో రీలిజ్ డేట్ లతో మన ముందుకు వచ్చారు. అంతే కాకుండా NBK109 మూవీ అప్డేట్ తో మన ముందుకు వచ్చారు మేకర్స్. వరస డేట్ లతో బాలయ్య ఫ్యాన్స్ కి పట్టరాని ఆనందాన్ని కలిగించాడు అనిల్ రావిపూడి.
ఉయ్యాలో ఉయ్యాల పాట రిలీజ్:
భగవంత్ కేసరి సినిమా నుంచి రిలీజ్ పాట ఇప్పటికి జనాల నోళ్ళల్లో నానుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా రెండో పాట “ఉయ్యాలో ఉయ్యాల” అనే గీతాన్ని విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ పాటను అక్టోబర్ 4న విడుదల చేయబోతున్నామని అధికారికంగా ప్రకటిస్తూ…ఓ పోస్టర్ ను పంచుకున్నారు మూవీ మేకర్స్. అందులో బాలకృష్ణ నడి ఒడ్డున ఓ పాపతో కూర్చొని సరదాగా గడుపుతున్నట్లు కనిపించారు. పోస్టర్ ఉన్న చిత్రం చిన్నారితో ఉన్న బంధాన్ని చెబుతుంది.
ట్రైలర్ డేట్ ఫిక్స్ : B
భగవంత్ కేసరి సినిమా టీమ్ ఈ నెల 8వ తేదిన వరంగల్ లో ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారట. అందుకోసం భారీగా పంక్షన్ ఏర్పాటు చేశారట. ఇటీవల భగవంత్ కేసరి జర్నీ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో బాలయ్య “కలిసి మాట్లాడుతా అన్నానుగా అంతలోనే మందిని పంపాలా గ్రౌండ్ ప్లోర్ బలిసిందా బే” అంటూ చెప్పిన డైలాగ్ వైరల్ అవుతుంది. దీంతో ట్రైలర్ లో ఎలాంటి పవర్ పుల్ డైలాగ్స్ ఉన్నాయో అని అతృతగా ఎదురుచుస్తున్నారు ఫ్యాన్స్.
భగవంత్ కేసరి థియేటర్స్ లో హంగామా షురు:
ఎప్పుడు రిలీజ్ అంటూ బాలయ్య ఫ్యాన్స్ ఉత్కఠంగా ఎదురుచుస్తున్న రోజు రానే వచ్చింది. ఈ సినిమాను ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానున్నదని ప్రకటించారు…. ఇక ఈ అప్డేట్ తో బాలయ్య ఫ్యాన్స్ కి ఆనందం హాద్దులు దాటాయి. బాలయ్య సినిమా రీలిజ్ డేట్ తో ఫ్యాన్స్ ధియేటర్స్ లో విజిల్స్, కేక లతో రెడీగా ఉన్నారు. విడుదల తేది దగ్గర పడుతున్న తరుణంలో థియాట్రికల్ బిజినెస్ కూడా పూర్తయింది. ప్రపంచవ్యాప్తంగా 75.కోట్లకు బిజినెస్ జరిగినట్టు సమాచారం. ఇప్పటి వరుకు రిలీజ్ అయిన బాలయ్య సినిమాలల్లో భగవంత్ కేసరి సినిమా బిజినెస్ కలక్షన్ టాప్ లో ఉంది.
కాజల్ రీ ఎంట్రీ.. బాలయ్య కుమార్తెగా శ్రీలీల
భగవంత్ కేసరి సినిమా తెలంగాణ నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ తో కొనసాగుతుంది. ఫాదర్, కూతురు మధ్య ఓ ఎమోషనల్ ట్రాక్ ఎంటర్ టైన్మెంట్ గా కొనసాగుతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో శ్రీలీల బాలయ్యకి కూతురుగా నటిస్తుంది. భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ సరసన మొదటిసారి కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అర్జున్ రాంపాల్ సరసన శ్రీలీల కీలక పాత్రలో కనిపిస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సి. రామ్ ప్రసాద్ కెమెరా మెన్ గా పనిచేస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బాలయ్య 109 మూవీ B
భగవంత్ కేసరి సినిమా రిలీజ్ కి రెడిగా ఉండగా బాలయ్య మరో సినిమాను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బాలయ్య బిజీగా ఉన్నాడు. NBK109 సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది… ప్రస్తుతం NBK109 సినిమా గురించి సూర్యదేవర నాగవంశీ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో బాలయ్య ని ఏ సినిమాలో చూడని క్యారెక్టర్ లో చూస్తారని చెప్పకొచ్చాడు. ప్రేక్షకులు ఊహించని రేంజ్ లో సినిమా ఉండ బోతోందని తెలిపాడు. సెకండ్ హాఫ్ లో 40 నిమిషాలు ఇక నెక్ట్స్ లెవెలే అంటున్నాడు నాగవంశీ. ఇదివరకే సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో “ప్రపంచానికి ఇతను తెలుసు… కానీ ఇతని ప్రపంచం ఎవరికి తెలియదు” అనే కొటేషన్ తో రిలీజ్ చేశారు. 1980లో జరిగిన ఒక స్టోరీ నేపధ్యంలో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. సినిమా షూటింగ్ లో బిజీగా ఉండాల్సిన బాలయ్య ఏపీలో రాజకీయం హీటెక్కడం వల్ల షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు.