(Choco)
చాక్లెట్స్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. పిల్లలు,యువత, పెద్దవాళ్లు, ముసలివాళ్లతో సహా చాక్లెట్స్ నచ్చనివారు ఉండరు. చాక్లెట్స్ పేరు చెప్పగానే అందరికి నోరూరుతుంది. చాక్లెట్స్…శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రియంగా ఇష్టపడే ట్రీట్. చాక్లెట్స్ తింటే అదో తృప్తి. ఈ మధ్య కాలంలో చాలా రకాల చాక్లెట్స్ వెలుగులోకి వచ్చాయి. అవి డైరి మిల్క్, డార్క్ చాక్లెట్స్, మిల్క్ చాక్లెట్స్, డ్రైఫూట్ చాక్లెట్స్ ఇలా ఎన్నో ఉన్నాయి.
డార్క్ చాక్లెట్స్ తో ముప్పుందా? (Choco)
చిన్నపిల్లలు అయితే చాక్లెట్స్ ని చాలా ఇష్టంగా తింటారు. చిన్న పిల్లల దగ్గరకు వెళ్లే అపుడు వారికి ఎమైనా తీసుకెళ్లాలి అనుకుంటే ముందుగా చాక్లెట్స్ నే తిసుకుంటాం. పిల్లల ముందు చాక్లెట్స్ లేదా ఎదైనా విలువైన వస్తువు పెడితే పిల్లలు ముందుగా చాక్లెట్స్ నే తిసుకుంటారు. అంతలా పిల్లల్ని అట్రాక్ట్ చేస్తాయి. పిల్లలు అనే కాదు పెద్దవారు కూడా చాక్లెట్స్ ను ఇష్టంగా తింటారు.కానీ చాక్లెట్స్ తినడం వల్ల కూడా చాలా ఉపయోగాలున్నాయి. దానిలో కూడా డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. వైద్య నిపుణులు కూడా డార్క్ చాక్లెట్స్ తినడం మంచిదేనని చేబుతున్నారు.ఇవి తినడం వల్ల కేవలం నోటికి రుచి మాత్రమే కాకుండా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఎంటో తెలుసుకుందాం…
చాక్లెట్స్ వల్ల ఉపయోగాలు: (Choco)
చాక్లెట్స్ తినడం అంత మంచిది కాదు అని చాలా మంది అంటూ ఉంటారు.చాక్లెట్స్ లో కూడా డార్క్ చాక్లెట్స్ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.చాక్లెట్స్ తినడం అనేక రకాల ప్రమాదాలనుండి దూరం చేస్తుంది. మన శరీరానికి చాక్లెట్ ఎంతో మేలు చేస్తుంది. అందువలన రోజు మనం తిసుకునే ఆహరంలో తింటే మంచిది అని వైద్య నిపుణులు అంటున్నారు.డార్క్ చాక్లెట్స్ మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని కరిగించి మంచి కోలెస్ట్రాల్ ని పెంచడంలో ఇవి బాగా ఉపయోగపడుతాయి. మంచి కోలెస్ట్రాల్ శరీరంలోని హృదయ సంబంధిత వ్యాధులను, హార్ట్ స్ట్రోక్ వంటి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహయపడుతుంది. ఇంకా గుండె పని తీరుని కూడా మెరుగుపరుస్తుంది.
బీపీ తగ్గే ఛాన్స్…
డార్క్ చాక్లెట్స్ని తినడం వల్ల దీనిలో ఉన్న మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో మెరుగ్గా పనిచేస్తుంది. చాక్లెట్స్ ని తింటే మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ పెరుగుతాయి. దీని వల్ల రక్తపోటు సమస్యలు తగ్గుతాయి. చాక్లెట్స్ తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. డార్క్ చాక్లెట్స్ ను తీనడం వల్ల మెదడులో రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది. దీని వల్ల మెదడు మెరుగ్గా పనిచేస్తుంది.చాక్లెట్స్ తినడం ద్వారా జ్ఞాపకశక్తి దాదాపు 30శాతం పెరుగుతుందని పరిషోధనల్లో తేలింది. చాక్లెట్స్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల మన శరీరంలోని కాలుష్య కారకాలను తొలగించి, ముడతలను తగ్గిస్తాయి. చర్మం కూడా కాంతి వంతంగా తయారవుతుంది.
చాక్లెట్స్ వల్ల దుష్ఫలితాలు:
తినాలి కానీ… అతిగా తింటే మాత్రం ఎక్కువ సమస్యలు తప్పవని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాక్లెట్స్ ని అతిగా తినడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, మలబద్దకం, కడుపులో తిమ్మిర్లు వంటి సమస్యలు వస్తాయి. చాక్లెట్స్ ఎక్కువ మొత్తంలో కొవ్వులు, చక్కెర, కెఫిన్ లను కలిగి ఉంటాయి. అందువల్ల షూగర్ ఓవర్ లోడ్ అయే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల అలసట, చిరాకు, మానసిక కల్లోలం, బరువు పెరగడం, అధిక రక్తపోటు, షూగర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. చాక్లెట్స్ లో కెఫిన్ ఉంటుంది. ఎక్కువగా చాక్లెట్స్ ని తీసుకోవడం ఆందోళన, గుండె దడకు కారణమౌతుంది. దీనిలో క్యాలరీలు, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల అధికంగా బరువు పెరుగుతారు. ఎక్కువగా చాక్లెట్స్ తినడం వల్ల దద్దుర్లు, వాపు,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువలన చాక్లెట్స్ ని మితంగా తీసుకోవాలి. (Choco)