అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ ప్రపంచ కప్ (WC G1) 2023 క్రికెట్ మహా సమరానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. పది జట్లతో జరగనున్న ఈ మెగా సమరంతో.. క్రికెట్ ఫ్యాన్స్ కు దాదాపు నెలన్నర రోజులు పండగే పండగ.పసందైన షాట్లు.. అదిరిపోయే సిక్స్ లు, బౌండరీ లైన్ దాటే బంతులు, అద్భుతమైన క్యాచ్ లు, క్లీన్ బౌల్డ్, డకౌట్ లు, సెంచరీలు ఇలా ఒకటేమిటి చూసినోళ్లకు చూసినంత. ఇలా ఒక్కటేమిటి.. చెప్పుకుంటూ పోతే… నవంబరు మధ్య నెల వరకూ క్రికెట్ ఫ్యాన్స్ కు ఫెస్టివల్ అని చెప్పాలి. రేపే ప్రపంచ కప్ సమరం.. అసలు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…
పటిష్టంగా ఆస్ట్రేలియా జట్టు (WC G1)
ఆస్ట్రేలియా… ప్రపంచ క్రికెట్ ను కొన్ని దశాబ్దాల పాటుగా శాసించింది. అప్పట్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే.. ప్రత్యర్థి జట్లకు ఓటమి ఖాయం అన్న చందంగా తయ్యారు అయ్యింది పరిస్థితి. అందుకు తగ్గట్లుగానే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సార్లు వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా కంగారూల టీమ్ ఘనత వహించింది. అయితే ప్రస్తుతం ఆసీస్ కు కష్టాలు మెుదలైయ్యాయనే చెప్పాలి. జట్టు బలంగా ఉన్నా నిలకడలేని ఆటతో పాట్ సేన సతమతమౌతున్నారు.
ఇంగ్లాండ్ జట్టకు గాయాల బెడద
ఒకప్పుడు ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే ఏ జట్లైనా భయపడేవి. ఆ జట్టు ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం ఆ స్థాయిలో ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని ఇంగ్లాండ్ ఆక్రమించింది అంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఆస్ట్రేలియా స్థానాన్ని ఇంగ్లాండ్ ఆక్రమించింది. తన ఎదురులేని ఆట తీరుతోనే 2019లో విజేతగా నిలిచి ప్రపంచ కప్ కలను నెరవేర్చుకుంది. భారత్ లో ఈసారి వరల్డ్ కప్ నిర్వహిస్తున్న నేపథ్యంలో భారీ అంచనాలతో ఇంగ్లాండ్ రంగంలోకి దిగింది. అయితే గాయాల బెడద ఆ జట్టును తీవ్ర ఇబ్బంది పెడుతోంది.
కివీస్ కప్పు గెలుస్తుందా?
2019 ప్రపంచకప్ ఫైనల్‌ను క్రికెట్ అభిమానులు అంత సులువుగా మర్చిపోలేరు. అలాగే కివీస్ గుండె పగలడం కూడా మర్చిపోలేరు. కప్పు గెలిచి తొలి ముద్దు పెట్టేలా కనిపించినా.. కివీస్‌ను దురదృష్టం వెంటాడింది. ఇంగ్లాండ్‌తో ఫైనల్లో మ్యాచ్ టై.. సూపర్ ఓవర్ టై.. కానీ బౌండరీల తేడాతో కివీస్ ఓటమి. అప్పుడా జట్టును చూసి జాలి పడని వారు లేరు. ఇప్పుడా కన్నీళ్లను దాటి కప్పుతో స్వదేశం వెళ్లాలనే లక్ష్యంతో కివీస్ భారత్‌కు వచ్చింది. అత్యుత్తమ ప్రదర్శనతో సాగుతున్నా.. కప్పు మాత్రం అందని ద్రాక్షగానే ఊరిస్తోంది.
పట్టు మీదున్న పసికూన
బంగ్లాదేశ్.. ఒకప్పుడు ఈ క్రికెట్ జట్టును అందరూ పసికూనగా చూశారు. ప్రస్తుతం ఈ జట్టును ఎవరూ తేలికగా తీసుకోవడం లేదు. ఏ జట్టునైనా ఓడించగల శక్తి బంగ్లా జట్టుకు ఉంది. వన్డే ప్రపంచకప్‌ను ఒక్కసారికూడా ముద్దాడని ఈ జట్టు..ప్రస్తుతం అన్ని విధాలుగా బలంగా ఉంది. మరోవైపు షకిబ్ సైన్యాన్ని గాయాల బెడద వెంటాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో షకీబ్ అల్ హసన్ సారథ్యంలోని ఈ జట్టు అద్భుతాలు చేయగలదా?
బిగ్ టీమ్ లతో సై అంటున్న ఆప్ఘన్ టీమ్ (WC G1)
ప్రపంచం మొత్తం వరల్డ్ కప్ మ్యాచ్ ల కోసం వెయిట్ చేస్తోంది. ఈ సమరంలో ఆఫ్ఘనిస్తాన్ బిగ్ టీమ్ లకు గట్టి పోటీదారేమీ కాదు. అయితే ఈ జట్టును పసికూనగా అని తేలికగా తీసుకుంటే మాత్రం నూకలు చెల్లించాల్సిందే. ఈ జట్టు ఛాంపియన్‌గా మారలేకపోవచ్చు కానీ.. తనదైన రోజున ఎలాంటి జట్లనైనా ఓడిస్తుంది అనండంలో సందేహం లేదు. పసికూన అని కొట్టిపడేసిన జట్టులకే చుక్కలు చూపించింది.
మరి ఈసారి కప్పును గెలిచే టీమ్ ఏది.. ఎందుకంత తొందర.. లెటజ్ వాచ్ ఫ్రం టు మారో ది ఎగ్జైటెడ్ సీరీస్ అంటున్నారు నిర్వాహకులు. (WC G1)