బాలకృష్ణను ఏపీ AP రాజకీయాలనుంచి తెలివిగా తప్పించారా? సీన్ చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. పార్టీ కష్టాల్లో ఉండగా సేవ చేస్తానంటూ ముందుకొచ్చిన మనిషిని ఎత్తి ఏట్లో పడేసినట్లు తెలంగాణ టీడీపీ కి పనిచేయమని చెప్పడం చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. పార్టీయే సరిగా లేని తెలంగాణలో బాలకృష్ణ లాంటి హీరో ఏం నాయకత్వం వహిస్తారు? అయినా సరే బాలయ్య పార్టీ ఆదేశాలను శిరసా వహించారు.
బాలయ్య ఉత్సాహంపై నీళ్లు చల్లారు ! AP
తెలుగుదేశం అధినేత రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉండడంతో పార్టీకి కష్టకాలం వచ్చింది. సరైన దిశా నిర్దేశం చేసే నేత లేకపోవడం, లోకేష్ ఢిల్లీలోనే ఉండిపోవడంతో పార్టీ గందరగోళంలో పడిపోయింది. ఆ టైమ్ లోనే పార్టీని నడిపేందుకు రెడీయేనని, బాధ్యతలను భుజ స్కంధాలపై మోస్తానని బాలయ్య చాలా ఆవేశంలో వెళ్లి చంద్రబాబు సీట్లో కూర్చున్నారు. ఎమర్జెన్సీ మీటింగ్ కూడా నిర్వహించారు. త్వరలోనే రాష్ట్రం అంతా బస్సు యాత్ర చేసి చంద్రబాబుకు జరిగిన అన్యాయంపై ప్రజలకు వివరిస్తానని ఆవేశంగా ప్రకటించారు. అయితే బాలయ్య ఇంత సానుకూలంగా స్పందించినా టీడీపీ నేతల్లో ఉత్సాహం మాత్రం రాలేదు. సరికదా.. భయం వేసినట్లుంది. బాలకృష్ణ ఆగి ఆగి మాట్లాడతారు. సెంటెన్స్ కి సెంటెన్స్ కి చాలా గ్యాప్ తీసుకుని తడబడుతూ, తడుముకుంటూ మాట్లాడతారు. పైగా లోతైన రాజకీయ విషయాలపై ఒక నిర్ణయం తీసుకోవడం, వైఖరి తెలియచేయడం లాంటి విషయాల్లో చాలా వీక్. అది గ్రహించిన చంద్రబాబే మరో ప్రమాదం జరగకుండా జైలు నుంచే అడ్డుకట్ట వేసినట్లు కనిపిస్తోంది. లోకేష్, చంద్రబాబు ఒకవేళ జైలు పాలయితే పార్టీని బ్రహ్మణితో లేదా, పురంధరేశ్వరితో నడిపించాలని మొదట భావించినట్లున్నారు. కానీ బ్రహ్మణి పరిపక్వత లేని మాటలు, భువనేశ్వరి తెలుగు మాట్లాడటం రాక పడిన ఇబ్బందులన్నీ అందరూ చూశారు.
తెర వెనక ఏం జరిగింది?
ఇలాంటి టైమ్ లో బాలకృష్ణ మాత్రం పార్టీకోసం ఏదైనా చేయాలనే తపనతో కనిపించారు. అయితే ఆయన ప్రయత్నాలను యనమల లాంటి సీనియర్లు తెర వెనక నుంచి అడ్డుకున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. రాజమండ్రి ములాకాత్ లో యనమల చంద్రబాబుని కలిసినప్పుడు ఈ విషయంపై కాస్త చూసుకోమని చెప్పి ఉంటారని అప్పటినుంచే బ్రహ్మణి, భువనేశ్వరి మీడియా ముందుకు రావడం, హడావుడి చేయడం జరిగిందని టీడీపీ వ్యూహాలపై అంచనా ఉన్న వారు చెబుతున్న మాట.అంతేకాదు బాలకృష్ణ వల్ల పార్టీ ఇమేజ్ కి డ్యామేజ్ జరగకుండా ఉండేందుకే ఆయన్ను పార్టీ తెలంగాణ బాధ్యతలను పర్యవేక్షించమని చెప్పారని టీడీపీ వర్గాల ఇన్ సైడ్ టాక్.
ముక్కుసూటి బాలయ్య! AP
ఎవరేమనుకున్నా బాలకృష్ణ మాత్రం ఈ మార్పులను, పరిణామాలను గమనించడం లేదు.. పార్టీ చెప్పిన ఆదేశాలను, బాధ్యతలను తూచా తప్పకుండా పాటిస్తూ అడుగులేస్తున్నారు. అందుకే తెలంగాణ టీడీపీని పర్యవేక్షణ చేయమనగానే ఎందుకు? ఏమిటి అన్న ఆలోచన లేకుండా డ్యూటీలో జాయిన్ అయిపోయారు.
బాలయ్య చరిష్మా పార్టీకి ఉపయోగపడుతుందనుకున్నా.. అది ఉపయోగ పడాల్సిన చోట ఉపయోగ పడనప్పుడు అవసరంలేని చోట వాడుతున్నప్పుడు ఏం ఫలితం ఉంటుంది? తెలుగు దేశంలో తాజా పరిణామాలపై తమ్ముళ్ల ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నా వైసీపీకి మాత్రం ఈ పరిణామాలు ఉత్సాహాన్నిస్తున్నాయి. చూశారా ఎన్డీఆర్ వారసుడికి పార్టీ పగ్గాలు అప్పగించకుండా మరోసారి మోసగించారంటూ విమర్శలు గుప్పిస్తోంది జగన్ పార్టీ.. ఏపీ మంత్రి అంబటి రాంబాబు అయితే ఉచిత సలహా కూడా పడేశారు.. బాలయ్యా.. లే.. లేచి పగ్గాలందుకో.. ఆ సీట్లో కూర్చో.. ఆ పార్టీకి నువ్వే అసలు వారసుడివి అంటూ సాధ్యమైనంతగా ఎగదోశారు. ఎవరేమనుకున్నా.. పట్టించుకోకుండా అడుగు ముందుకే వేస్తున్నారు బాలయ్య. ఎంతన్నా బాలయ్య కదా.. ఒక వైపే చూస్తారు.. రెండో వైపు చూడరు.. చూస్తే బావ ఆగ్రహ జ్వాలలముందు మాడిపోతామన్నభయమేమో. AP