Mega
పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ మెగా వారింట సందడి పెరుగుతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్లి మరికొద్ది రోజుల్లోనే గ్రాండ్ గా జరగబోతోంది. రెండు రోజుల క్రితం ఈ జంట వెకేషన్ ను పూర్తి చేసుకొని మొన్న రాత్రి తిరిగి హైదరాబాద్ కు వచ్చారట. ఇప్పుడు పెళ్లి వేడుకలలో భాగంగా మెగా ఫ్యామిలీ గ్రాండ్ గా పార్టీ ని ఎరేంజ్ చేశారు. నిన్న రాత్రి చిరంజీవి ఇంట్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీకి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, కొందరు ప్రముఖులు హజరయ్యారు. ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలను మెగా ఫ్యామిలి వారు తమ ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీని, అల్లు ఫ్యామిలీని ఒకే చోట చూసిన ఫ్యాన్స్ పుల్ ఖుష్ అవుతున్నారు. ఇక మెగా ఫ్యామిలీలో పెళ్లి బజాలు మోగుతుబోతున్నాయని కామెంట్స్ పెడుతున్నారు. పెళ్లి హంగామా మొదలవుతోంది.
మరో మూడు రోజుల్లోఇటలీకీ Mega
ప్రీ వెడ్డింగ్ పార్టీ ని బాగా ఎంజాయ్ చేసిన మెగా ఫ్యామిలీ మరో మూడు రోజుల్లో ఇటలీ బయలుదేరుతారట. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- బ్యూటి క్వీన్ లావణ్య త్రిపాఠి వివాహ డేట్ ను ప్రకటించారు. అక్టోబర్ 17న మెగా ఇంట పెళ్లి బజాలు మెగనున్నాయట. ఇటలీలో అంగరంగ వైభవంగా వరుణ్-లావణ్య పెళ్లి జరగనుంది. రాజకీయల్లో బిజీగా ఉన్న పవన్ కూడా వీరి పెళ్లి వేడుకలలో భాగం కానున్నాడట. దానికి సంబంధించిన టైమ్ షెడ్యూల్ కూడా చేసుకున్నారనే టాక్ వినిపిస్తుంది.
Mega కుటుంబ సభ్యులతో ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్
చిరంజీవి-సురేఖ దంపతులు, నాగబాబు-పద్మజ దంపతులు, రామ్ చరణ్-ఉపాసన దంపతులు, సుస్మిత, శ్రీజ, నిహారిక, చిరంజీవి తల్లి అంజనదేవి, చిరంజీవి ఇద్దరు చెల్లెళ్లు వారి భర్తలు పిల్లలు, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, ఇతర సభ్యులు ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు.
కాబోయే కోడలితో చవితి పూజలు
గతంలో మెగా హీరో వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ హైదరాబాద్ మణికొండలోని నాగబాబు నివాసంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్ధ వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు, చిరంజీవి, అల్లు అరవింద్ సహా కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే పాల్గొన్నారు. వీరి నిశ్చితార్ధం తరువాత వచ్చిన వినాయక చవితికి నాడు నాగబాబు ఇంట్లో వరుణ్-లావణ్య కలిసి పూజలు చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక అప్పుడే కాబోయే కోడలు అత్తారింట్లో సందడి చేస్తోంది అంటూ కామెంట్స్ పెట్టారు ఫ్యాన్స్.
ఇటలీయే ఫేవరెట్ స్పాట్
వరుణ్- లావణ్య కాంబినేషన్ లో మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించారు. అంతరిక్షం సినిమా షూటింగ్ టైమ్ లో ఒకరినొకరు ఇష్టపడ్డారు. రీల్ లో నటించిన ఈ జోడి రియల్ లైఫ్ లో పీట లెక్కుతున్నారు. వీరి ప్రేమ ప్రయాణం ఇటలీలో జరగటంతో వారికి ఆ లోకేషన్ ఫేవరెట్ స్పాట్ అయింది. అందుకే ఇటలీలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. Mega