అలనాటి సీనియర్ నటుడు చంద్ర మోహన్ మూవీ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలను అందుకున్నాడు. నటనకి నిర్వచనం చంద్రమోహన్. ఏ క్యారెక్టర్ అయిన సులువుగా నటించాడు పాత్రలో జీవిస్తుంటాడు చంద్రమోహన్. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ ఇలా ఏ పాత్రలో అయినా అలవోకగా నటించి అందరిని మెప్పించాడు. 1999లో రంగులరాట్నం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇప్పటి తరానికి ఈమన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే తెలుసు కానీ ఒక్కప్పుడు 175 సినిమాల్లో హీరోగా నటించాడు. సినియర్ నాగేశ్వరరావుతో కలిసి దాదాపుగా 40 సినిమాలు చేశారు. 55 ఏళ్లు సినీ కెరీర్ లో 932 సినిమాల్లో నటించాడు. తొలి సినిమాకే నంది అవార్డును దక్కించున్న ఘనత ఈయనకు మాత్రమే దక్కింది.
టాలీవుడ్ కి ఎంట్రీ:
చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. 1942 మే23న కృష్ణ జిల్లా పమిడిముక్కలలో జన్మించారు. బాపట్లలో అగ్రికల్చర్ బీఎస్సీ చదివాడు. చదువుకి తగ్గ జాబ్ చేయకుండా చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశాడు. మద్రాసు వెళ్లి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు. ఆకంభంలోనే బీఎస్ రెడ్డి వంటి మేటి దర్శకుని కంట పడ్డాడు. ఆయనే చంద్రమోహన్ అని నామకరణం చేశాడు. బీఎన్ రెడ్డి తెరకెక్కించిన రంగులరాట్నం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
సిని పరిశ్రమలో లక్కీ హీరో:
అలనాటి హీరోయిన్లకు లక్కీ హీరోగా పేరు సంపాదించాడు చంద్రమోహన్. ఆయన సినిమాతోనే శ్రీదేవి, జయప్రద, జయసుధ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. హీరోయిన్లను స్టార్ గా మార్చిన ఘనత ఈయనకే దక్కింది. తొలి సినిమాకు గాను నంది అవార్డు ను దక్కించుకున్నాడు….ఎవరికి దక్కని ఘనత ఈయనకు దక్కింది. టాలీవుడ్ లో తండ్రి పాత్రలకు ఒక కొత్త మలుపు తీసుకు వచ్చాడు. తన నటనతో ఎందరినో మెప్పించాడు.
అన్న సినిమాల్లో నటిగా ఎన్నో సినిమాలు
కె విశ్వనాథ్ దర్శకత్వంలో చంద్రమోహన్ కాంబినేషన్ లో నటించిన సినిమాలు ఇవే…. సీతామాలక్ష్మి, సిరిసిరిమువ్వ, శంకరాభరణం, శుభోదయం, ఇంటింటి రామాయణం, పదహారేళ్ళ వయసు, తాయారమ్మ-బంగారమ్మ, కోరికలే గుర్రాలయితే, సత్యభామ, పక్కింటి అమ్మాయి, గోనాలరావు గారి అమ్మాయి, పెళ్లి చూపులు, రాధా కళ్యాణం, మూడుముళ్లు సినిమాల్లో హీరోగా నటించారు. సినిమాలు ఎక్కువగా హిట్ నే సొంతం చేసుకున్నాడు. ఇలా సిని ప్రయాణం మొదలు పెట్టి హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ కళామ్మ తల్లి ఒడిలో ఒదిగాడు. ఈ తరంలో అన్నగా, బావగా, మామగా, తండ్రిగా, నటించి కనిపించారు. చివరగా ఆయన నటించిన సినిమా ఆక్సిజన్.
ఆరు నంది, రెండు ఫిలింపేర్ అవార్డులు దక్కించుకున్న ఘనత:
1966లో రంగుల రాట్నం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయారు. 1982 చందమామ రావే సినిమాకు ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు, 2005లో అతనొక్కడే సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా రెండు నంది అవార్డులు, పదహారేళ్ల వయసు సిరి సిరి మువ్వ సినిమాల్లో నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును దక్కించుకున్నాడు. ఇప్పటి వరుకు రెండు ఫిలింపేర్, ఆరు నంది అవార్డులు అందుకున్నారు. చంద్రమోహన్ ఒక్కరే ఉత్తమ సహాయకుడిగా నంది అవార్డును అందుకున్నాడు.
ఒకే ఏడాది ఒకే కుటుంబ సభ్యులను కోలిపోయాం:
ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ కు చంద్రమోహన్ కు అన్న వరుస అవుతాడు. 25 ఏళ్లు పక్కపక్కన ఇళ్లల్లో ఉంటూ గడిపారట చంద్రమోహన్- కె విశ్వనాథ్. ఓకే ఏడాది వీరిద్దరిని కోలుపోవడం చాలా బాధకరం. వీరి సహచరులు ఇప్పటి నటులకు చాలా బాధకరం. వీరిద్దరి కాంబినేషన్ లో సిరిసిరిమువ్వ, సీతామహలక్షి, శంకరాభరణం, సీతకథ చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాలు హిట్ ను సొంతం చేసుకున్నాయి. చంద్రమోహన్ కి ఎస్పీబాలసుబ్రమణ్యంతో బంధుత్వం ఉంది. చంద్రమోహన్ బావమరిది చెల్లిని బాలసుబ్రమణ్యం అన్నయ్య పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరిది కూడా అన్నదమ్ముల అనుబంధం. ఇలా ఒకే కుటుంబ సభ్యులను ఒకే ఏడాది కోలుపోవడం సినీ పరిశ్రమలో విషాధ చాయలు నెలకోన్నాయి.
కుటుంబం
చంద్రమోహన్ భార్య జలంధర. ఆయన భార్య ప్రముఖ రచయిత్రి. వీరిద్దరకు ఇద్దరు కుమారైలు. పెద్దామ్మాయి మీనాక్షి సైకాలజిస్ట్.అమెరికాలో స్థిరపడింది.రెండో కుమారై మాధవి.ఆమె డాక్టర్.ప్రస్తుతం చెన్నైలోనే ఉంటుంది. వీరికి ఇంత సిని బ్యాగ్ రైండ్ ఉన్నా కానీ కూతుర్లు మాత్రం సిని ప్రయాణం మొదలు పెట్టలేదు. ఒకరు సైకాలజిస్ట్ గా, డాక్టర్ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు.