paracetamol
జ్వరం వచ్చిందంటే చాలు పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు అందరూ మొదట వేసుకునే టాబ్లెట్ పారాసిటమాల్. పైగా ప్రస్తుతం కరోనా వైరస్ రావడంతో దాదాపు అందరి ఇళ్లల్లోనూ ఏం ఉన్నా లేకపోయినా పారాసిటమాల్. టాబ్లెట్ షీట్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటున్నాయి. జ్వరానికే కాకుండా దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలకు సైతం పారాసిటమాల్ టాబ్లెట్లను బాగా వాడేస్తున్నారు. వైద్యుల సలహా తీసుకోకుండానే మెడికల్ షాప్ కు వెళ్లి తెచ్చుకుంటారు. అయితే పారాసెటమాల్ టాబ్లెట్లను ఎక్కవ వేసుకోవడం ఏ మాత్రం మంచిది కాదని డాక్టర్స్ అంటున్నారు.
పారాసిటమాల్ ఎప్పుడు తీసుకోవాలి?
సాధారణంగా జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకుంటారు. అయితే పారాసెటమాల్ వేసుకున్న తర్వాత జ్వరం తగ్గకుంటే వెంటనే మరో ట్యాబ్లెట్ వేసుకొవద్దని చెబుతున్నారు. జ్వరం వచ్చిన 4 నుంచి 6 గంటల తర్వాత వేసుకోవాలి. పెద్దలకైతే 650 ఎంజీ, 12 ఏళ్లకంటే తక్కువ వయస్సున్న వారికి 15 ఎంజీ పారాసెటమాల్ తీసుకోవచ్చు. ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత అర గంట నుంచి దాని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. అయితే చాలా మంది ఇష్టమొచ్చినట్లు ట్యాబ్లెట్లు వాడుతున్నారు దానీ కారణంగా దీర్ఘకాలిక జబ్బులు వస్తాయి. పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు, కాలేయ వ్యాధిగ్రస్తులు, మద్యం తాగేవారు రోజుకు 2 గ్రాములకు మించి తీసుకోకూడదు.
పారాసిటమాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల … paracetamol
ఈ టాబ్లెట్లను పరిమితికి మించి తీసుకోవడం వల్ల అధిక చెమటలు, మోషన్స్, కళ్లు తిరగడం, వాంతులు, చర్మ సంబంధిత సమస్యలు, ఆకలి తగ్గిపోవడం, కడుపు నొప్పి, అలర్జీలు వంటి సమస్యలు వస్తాయని డాక్టర్స్ చెబుతున్నారు. పారాసిటమాల్ లాంటి టాబ్లెట్లలో స్టెరాయిడ్స్ ఉంటాయని వీటిని ఎక్కువగా తీసుకుంటే మూత్ర పిండాలు, కాలేయం వంటి అవయవాలపై ప్రభావం చూపుతాయట. మూత్ర పిండాలు, కాలేయం సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న వారైతే వైద్యులను సంప్రదించకుండా పారాసిటమాల్ డోలో, క్రోసిన్ వంటి టాబ్లెట్లను వాడొద్దని చెబుతున్నారు. చాలా మంది త్వరగా జ్వరం తగ్గాలని యాంటీ బయోటిక్స్ వాడతారు. యాంటీ బయెటిక్స్ ఎక్కువగా తీసుకుంటే దీర్ఘకాలంలో సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. బాక్టిరియా, వైరస్ యాంటీ బయెటిక్స్ కి అలవాటుపడి అవి మొండిగా మారుతాయని హెచ్చరిస్తున్నారు. అందుకే ఎక్కువగా యాంటీ బయోటిక్స్ వాడొద్దని చెబుతున్నారు. వైద్యులను సంప్రదించిన తర్వాతే మందులు వాడాలని సూచిస్తున్నారు.
పారాసిటమాల్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
దీనిని వైద్యుడు సూచించిన విధంగా ఉపయోగించబడాలి. మీకు ఔషధం లేదా ఔషధంలో ఉన్న ఏదైనా పదార్ధానికి అలెర్జీ ఉంటే వైద్యుడికి తెలియజేయండి. మీరు కాలేయ వ్యాధిని కలిగి ఉంటే లేదా రోజూ మద్యం సేవిస్తే, అప్పుడు మందులకు కూడా దూరంగా ఉండాలి. మందులు తీసుకునే ముందు తప్పనిసరిగా డాక్టర్ప్ ని కలవాలి. కాలేయ వ్యాధులు, కిడ్నీ డిజార్డర్, మిస్టేనియా గ్రావిస్, హృదయ స్పందన రుగ్మత, రక్తంలో పొటాషియం తక్కువ స్థాయిలు వున్న వారు డాక్టర్ ని సంప్రదించాలి.
ఇతర మందులతో పారాసిటమాల్ తీసుకోవచ్చా… paracetamol
పారాసిటమాల్ తీసుకునేటప్పుడు అలాంటి జాగ్రత్తలు లేవు. ఇది ఇతర మందులతో కూడా తీసుకోవచ్చు. కానీ పారాసిటమాల్ కొన్ని అలెర్జీ ప్రతి చర్యలకు దారి తీసిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల, వైద్యుడిని సంప్రదించి, మీరు గతంలో తీసుకున్న అన్ని మందుల గురించి చర్చించడం ఉత్తమం. మీ పూర్తి వైద్య చరిత్రను తెలుసుకున్న తర్వాత, డాక్టర్ మీకు సూచించిన మోతాదులో ఔషధం మరియు అవసరమైతే ప్రత్యామ్నాయాలను అందిస్తారు. పారాసిటమాల్ తీసుకున్నాక అప్పటికి తగ్గకపోతే వీలైనంత త్వరగా డాక్టర్ ని కలవాలి. paracetamol