Bollywood
బాలీవుడ్ బ్యూటీపుల్ కపుల్ అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. ఐశ్వర్య రాయ్ గతంలో ప్రపంచ సుందరి టైటిల్ ను గెలుచుకుంది. అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. వారిద్దరూ వాటిని ఖండిస్తూనే వచ్చారు. ఇప్పుడు ఆ రూమర్ మరోసారి ఊపందుకుంది. ఇప్పుడీ ఈ రూమర్ బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. విషయానికి వస్తే… ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా ఐశ్వర్య తన భర్తతో పాటు కూతురు ఆరాధ్య బచ్చన్ తో కలిసి వెళ్లటం…. ఫోటోలకు ఫోజులు ఇవ్వటం చేస్తుంటారు. కానీ అలా కాకుండా ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా, ఏ పార్టీకి వెళ్లినా సింగిల్ గా కెమెరా కంట పడటం, లేకపోతే కుతూరితో కనిపించడం చేస్తుంది ఐశ్వర్య. ఇక ఈ జంట కలిసి కనిపించకపోవటంతో వీరిద్దరి మధ్య విబేధాలు నెలకొన్నాయని, ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారని కథనాలు వినిపిస్తున్నాయి.
దీపావళి పార్టీలో సింగిల్ గా ఐష్… Bollywood
మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి ఐశ్వర్య మాత్రమే హజరైంది. పింక్ డ్రస్ లో అందరిని ఆకట్టుకుంది.అయితే ఐష్ వెంట భర్త కానీ కూతురు కానీ ఎవరు పార్టీకి రాలేదు. అసలు పార్టీకి బచ్చన్ ఫ్యామిలీని ఇన్ వైట్ చేయలేదా?లేక ఐశ్యర్యా ఒక్కతే వచ్చిందా అంటూ అందరికీ డౌట్లు వచ్చాయి. ఈమధ్య ఐష్ ఎక్కడికి వెళ్లినా సింగిల్ గా కనిపిస్తోంది.
నీతా అంబానీ పార్టీలోనూ అంతే
మొన్నటికి మొన్న నీతా అంబానీ ఇంట్లో జరిగిన ఈవెంట్ లో కనిపించింది ఐశ్వర్య. ఈ వెంట్ కి ఐశ్వర్య, కూతురు తో కనిపించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇక ఈ పార్టీకి అభిషేక్ బచ్చన్ రాలేదు. ఎయిర్ పోర్టులో కానీ, ముంబై ఈవెంట్స్ లో కానీ ఐష్ తన కూతురు మాత్రమే కనిపించారు. Bollywood
ఐశ్వర్య బర్త్ డే పార్టీకి అభిషేక్ బచ్చన్ డుమ్మా
నవంబర్ 2వ తేదిన ఐశ్వర్య రాయ్ తన బర్త్ డే ఘనంగా జరుపుకుంది. 50వ వసంతంలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. సియోన్ లోని జీ ఎస్ బీ సేవా మండల్ లో క్యాన్సర్ పేషెంట్లతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఆ బర్త్ డే పార్టీలో తనతో పాటు కూతురు ఆరాధ్య, తల్లి బృందా రాయ్ ఉన్నారు. బర్త్ డే పార్టీలో భర్త మాత్రం కనిపించలేదు. ఈ వార్త ఫ్యాన్స్ ను ఎంతగానో ఆశ్చర్య పరిచింది. పార్టీకి ఎలానో రాలేదు కనీసం విషెస్ కూడా సరిగా చెప్పలేదు. చాలా లేటుగా అర్ధరాత్రిగా ఆమెకు విషెస్ చెప్పడు. సింపుల్ గా హ్యపి బర్త్ డే అని క్యాప్షన్ పెట్టాడు. ఇలా అభిషేక్ ప్రవర్తించిన తీరుపై ఫ్యాన్స్ బాగా మండిపడుతున్నారు.
రూమర్స్ కి బలమైన ఆధారాలు: Bollywood
నీతా అంబానీ ఇంట్లో జరిగిన ఈవెంట్, మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీని, తన బర్త్ డే పార్టీలో సింగిల్ గా సెలబ్రేట్ చేసుకోవటం ఇలా ప్రతి ఈవెంట్ లో సింగిల్ గా కూతురితో సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది ఐష్.. ఇలా తను అటెండ్ అవ్వటంతో అభిషేక్ బచ్చన్ లేకపోవటంతో వీరు విడిపోయారంటూ ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ సైతం వీరు విడిపోయారంటూ కోడై కూస్తోంది. మరి ఈ రూమర్స్ కి వారు చెక్ పెట్టాలి. ఇద్దరిలో ఎవరో ఒక్కరు స్పందిస్తే కానీ ఈ గాసిప్ కు తెర పడదు.
Bollywood