తెలుగు సినీ ప్రేమికులకు యువ నటుడు శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత ఈ నటుడు సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాల్లో హీరోగా నటించిన శ్రీ విష్ణు అందులో భాగంగా మెంటల్ మదిలో … బ్రోచేవారెవరురా … రాజ రాజ చోరా వంటి మూవీ లతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
అర్జున ఫల్గుణ’ ‘భళా తందనాన’ ‘అల్లూరి’ వంటి వరుస ప్లాపులు తర్వాత శ్రీవిష్ణు నుండి వచ్చిన చిత్రం ‘సామజవరగమన’ . ‘వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జూన్ 29న రిలీజ్ అయ్యింది. మొదటి సినిమాతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించింది.
ఇప్పటికే అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టిన ఈ సినిమా ఈ రోజుతో బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని లాభాలను అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ తో శ్రీ విష్ణు మరో విజయాన్ని అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి మరో సూపర్ డూపర్ రివార్డ్ ఒకటి ఆడ్ అయింది అదిమరేదో కాదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా చూసి ఎంతగానో మెచ్చుకున్నాడు.
ఈ సినిమా చాలా కాలం తర్వాత తెలుగులో వచ్చిన ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అల్లు అర్జున్ రాసుకొచ్చాడు. ఈ సినిమాని చివరి వరకు ఎంజాయ్ చేసాను. దర్శకుడు రామ్ అబ్బరాజు చక్కగా వ్రాసి, చక్కగా సినిమాను తెరకెక్కించారు, ఇక శ్రీవిష్ణు ఈ సినిమాను బాగా ముందుకు తీసుకు వెళ్లారు. అతనికి హిట్ పడడం నాకు నిజంగా సంతోషం. నటుడు నరేష్, వెన్నెల కిషోర్, నా మలయాళీ రెబా మోనికా జాన్ మరియు ఇతర నటీనటులకు నా రెస్పెక్ట్ అని ఆయన ట్వీట్ చేశారు. ఇక సాంకేతిక నిపుణులు, నిర్మాతకు చాలా గౌరవం అని ఆయన పేర్కొంటూనే ఈ సినిమా 100% తెలుగు వినోదం అందిస్తుందని రాసుకొచ్చారు.
Follow Us On : YouTube , Google News