ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే 2023 సేల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. జులై 15, 16 తేదీల్లో జరగనున్న ఈ సేల్ లో వివిధ రకాల ప్రొడక్ట్స్ పై భారీ తగ్గింపులు, డిస్కౌంట్స్ ఉంటాయని తెలిపింది . అయితే ఈ సేల్ లో iPhone 14 మీద కూడా డిస్కౌంట్ ఉంటుంది అని వారి అమెజాన్ app లో తెలిపారు. ఐఫోన్ కి ఉన్నంత క్రేజ్ ఇంకా ఏ ఫోన్ కు ఉండదు అనే చెప్పుకోవచ్చు అలాంటిది అదే ఫోన్భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు అంటే కొనుగోలుదారులకు పండగే ..!
బేస్ వేరియంట్ 128GB మెమరీ స్టోరేజ్ ధర రూ. 79,900. కాగా, ఈ సేల్ లో రూ.13 వేల తగ్గింపుతో iPhone 14 ను రూ.66,499 కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా SBI క్రెడిట్ కార్డ్, ICICI డెబిట్/క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం తగ్గింపు కూడా ఉంటుంది.ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేను కలిగి ఉంది. దీనిలో 12MP వైడ్- యాంగిల్ లెన్స్, 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, ముందు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. A15 బయోనిక్ చిప్ సెట్’ను అందించారు. ఇది డాల్బీ విజన్ సపోర్ట్, డిస్ప్లేకు సిరామిక్ షీల్డ్ ప్రొటక్షన్ ను కలిగి ఉంది. దీని బ్యాటరీ 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ ను అందించగలదని Apple పేర్కొంది.
This #AmazonPrimeDay, enjoy IPhone 14 at ₹66,499 and Avial other attractive offers. Join Prime now, Start your 30-day Free Trial. #DiscoverJoy pic.twitter.com/hMwSnMyt7a
— Amazon India (@amazonIN) July 10, 2023