జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ చంద్రబాబుకు వాలంటీర్ గా పనిచేస్తున్నాడని ఫైర్ అయ్యారు. వెంకటగిరి సభలో ఆయన మాట్లాడారు. ఒకటో తేదీకల్లా ఇంటింటికి వెళ్లి పింఛను ఇస్తున్నారన్నారు. వారి గురించి సంస్కారం లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. మళ్లీ మళ్లీ పెళ్లి ఇదే పవన్ క్యారెక్టర్ అంటూ ధ్వజమెత్తారు. వాలంటీర్లు అంటే మన పక్కింటి పిల్లలే అని జగన్ అన్నారు. ఎవరి క్యారెక్టర్ ఎలాంటిదో కోట్ల మందికి తెలుసునని జగన్ అన్నారు.
వాలంటీర్ల వ్యవస్థను…
ప్రజలకు మంచి చేసే వ్యవస్థను అనుమానించవద్దని జగన్ సభనుంచి కోరారు. నిర్మాత చంద్రబాబు అయితే నటన,మాటలు దత్తపుత్రుడివి అంటూ జగన్అన్నారు. సేవాభావంతో పనిచేసే వారిపై తప్పుడు ప్రచారం చేయడం తగదని సూచించారు. పవన్ పార్టీ ఒక డ్రామా కంపెనీ అని అన్నారు. వారికి, మనకు తేడా గమనించాలని కోరారు. తనకు మీడియా మద్దతు లేదని, ప్రజల దీవెనలు, దేవుడి ఆశీర్వదం ఉన్నాయని జగన్ అన్నారు. మీ ఇంటికి మంచి జరిగితేనే తనకు మద్దతు ఇవ్వండి ఆయన వెంకటగిరి సభలో కోరారు. వాలంటీర్ల గురించి ఈరోజు ఏ విధంగా దుష్ప్రచారం చే్స్తున్నారో, రాబోయే రోజుల్లో ప్రభుత్వం గురించి తప్పుడు ప్రచారం చేస్తారని, వాటిని నమ్మవద్దని జగన్ కోరారు.