మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాల లో లివర్ కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో చాలా మంది లివర్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ లివర్ సమస్యలకు ప్రధాన కారణం మన జీవనశైలి , మన ఆహారపు అలవాట్లే .మనం ఏ ఆహారం తీసుకున్న ఏమి తాగినా , ఏమి తిన్న అది నేరుగా లివర్ పైనే ప్రభావం చూపుతుంది. లివర్ కనుక పాడవుతే ప్రాణాలకే ప్రమాదం అవుతుంది కాబట్టి కొన్ని పదార్థాలు ఆహారంగా తీసుకోకపోవడమే మన లివర్ కు సేఫ్ ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి
1.మద్యం
మొదటిది మద్యం, మద్యం అనేది లివర్‌ను ఎక్కువగా పాడు చేస్తుంది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ క్రమక్రమంగా దెబ్బతింటూ వస్తుంది కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ధూమపానానికి మద్యపానానికి దూరంగా ఉండాలి
2. చక్కెర
రెండవది చక్కెర , చక్కెరను మితిమీరిన మోతాదులో తీసుకోవడం వలన ఆరోగ్యానికే కాదు లివర్‌కు కూడా హానికరం. ఎందుకంటే ఈ చక్కెర లివర్‌లో ఎక్కువ కొవ్వును తయారు చేస్తుంది ఇది చాలా కాలం పాటు కొనసాగితే లివర్ దెబ్బతిని ఆరోగ్యం పాడవుతుంది. అందుకే శాస్త్రవేత్తలు చక్కెరని వైట్ పాయిజన్ అని కూడా అంటారు. ఇది ఒక డయాబెటిస్ ఉన్నవారికి మాత్రమే ప్రమాదకరం కాదు డయాబెటిస్ లేని వారికి కూడా పరిమితికి మించిన చక్కెర తీసుకుంటే అది లివర్ పై ప్రభావం చూపి లివర్ని క్రమక్రమంగా దెబ్బతీస్తుంది
ఇవే కాక ఇప్పుడు చాలామంది అనిమల్ లివర్ అంటే చికెన్ లివర్,మటన్ లివర్ మంచిదని అందులో చాలా విటమిన్లు , ప్రోటీన్లు ఉంటాయని అది థైరాయిడ్ కి కూడా మంచిదని వాటిని అధికంగా తింటున్నారు .ఏ జీవి కి అయిన ఆరోగ్య సమస్య ఉంది అంటే ముందు గా హెచ్చరించేది లివరే అలాంటిది ఆ జీవి కి ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే అది లివర్ మీద ప్రభావం చూపే ఉంటుంది అలాంటి లివర్ మనం తినటం ఎంత వరకు కరెక్ట్ అంటారు?? అలాగని ఇవి పూర్తిగా చెడు ప్రభావం చూపుతాయా అంటే కాదనే చెప్పుకోవచ్చు , వీటిని పరిమితికి మించి తీసుకోవద్దని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే మితిమీరినది ఏదైనా మన ఆరోగ్యానికి విషమే.