హిందూపురం ఎమ్మెల్యే నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari). అఖండ, వీర సింహ రెడ్డి సినిమాల విజయాల తర్వాత వస్తున్నా బాలయ్య సినిమా ఇదే. తాజాగా ఈ సినిమా యొక్క విడుదల తేదీని ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది.
దసరా కి భగవంత్ కేసరి..
భగవంత్ కేసరి చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 19న విడుదల చేస్తున్నామని ఆ చిత్ర నిర్మాత ప్రకటించారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని అక్టోబర్ 19 గురువారం నాడు విడుదల చేయనున్నారు. దాదాపుగ వారం పాటు దసరా సెలవులు కావడంతో సినిమాకి కలెక్షన్ల వర్షం కురుస్తుందని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి.
ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా యువ కథానాయిక శ్రీ లీల కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో మూడో హీరోయిన్ గా పాలక్ లల్వానీకి కీలక పాత్రలో నటించే అవకాశం దక్కింది.