(Beetroot)
మనకు శక్తిని,ఆరోగ్యాన్ని అందించే కూరగాయలు ఎన్పో ఉన్నయి.వాటిల్లో బీట్ రూట్ కూడా ఒకటి. బీట్రూట్ రసం లో విటమిన్లు, ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ ఉన్నాయి. అయితే బీట్రూట్ ఎక్కువగా తీసుకోవడం హానికరమే అంటున్నారు హెల్త్ రిసెర్చర్లు. బీట్రూట్ వల్ల ప్రయోజాలు ఎన్ని వున్నాయో అలాగే నష్టాలు కూడా వున్నాయని వారంటున్నారు.
బీట్ రూట్ లో ఆక్సలేట్ పరిమాణం ఎక్కువ
వాస్తవానికి, బీట్రూట్ లో ఆక్సలేట్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా మూత్రపిండాల్లో రాళ్లున్న వారికి ఆ సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. ఆక్సలేట్ ఎక్కువగా ఉండే బీట్ రూట్ ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశముందంటున్నారు రిసెర్చర్లు.
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బీట్ రూట్ తినడం హనికరం. కిడ్నీలో రాళ్లు ఉండేవారు బీట్రూట్ రసానికి కొంచం దూరంగా ఉండాలి. అతిగా బీట్ రూట్ తీసుకుంటే అనాఫిలాక్సిస్ అనే ఒక రకమైన అలెర్జీ వస్తుంది. దాని ఫలితంగా గొంతు బిగిసిపోవడం, బ్రాంకోస్పాస్మ్ ఏర్పడవచ్చు. అలాగే బీట్రూట్లో నైట్రేట్లుఎక్కువ మోతాదులో ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే కడుపులో నొప్పి వచ్చే అవకాశం వుంది. అలాగే గర్భిణీ స్త్రీలు బీట్రూట్ రసాని ఎక్కువ తీసుకొకుడదు. ఎందుకంటే బీట్రూట్ లో ఉండే అధిక నైట్రేట్ల వల్ల ఒక్కోసారి శక్తి లోపించడం, తలనొప్పి, కళ్లు తిరగడం, కళ్లు, నోరు, పెదవులు, చేతులు, కాళ్ల చుట్టూ చర్మం రంగు మారడం లాంటివి అవుతాయి.
హైబీపీ వాళ్లకి బీట్ రూట్ తో మేలు (Beetroot)
రక్తపోటు(BP) ఉన్న రోగులు బీట్రూట్ తీసుకుంటే,అది మన రక్తపోటును మరింత తగ్గిస్తుంది. సో బీపీ కంట్రోల్ అవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నిజానికి, దుంపలు సహజంగా అధిక స్ధాయి నైట్రేట్ లను కలిగి ఉంటాయి. వీటిని జీర్ణవ్యవస్ధ నైట్రిక్ ఆక్సెడ్ గా మారుస్తుంది. ఇది రక్తపోటు తగ్గడానికి కారణమవుతుంది.
లో బీపీ (LOW BP) ఉంటే బీట్ రూట్ బంద్ చేయాల్సిందేనా?
లో బీపీ (LOW BP) తో బాధపడేవారు బీట్ రూట్ కు దూరంగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు బీట్ రూట్ కి దూరంగా ఉండటమే మంచిది. అందుకే హై -లో బీపీ ఉన్న వారు ఎక్కువ బీట్రూట్ ని తిసుకోకుడదు అని అంటున్నారు కార్డియాలజిస్టులు. ఎందుకంటే హై బీపీ ఉన్న రోగులకు అధిక రక్తపోటు వల్ల రక్తం చిక్కబడుతుంది. ఆ రక్తం పలుచగా మారడానికి డాక్టర్లు కొలెస్ట్రాల్ టాబ్లెట్లు ఇస్తుంటారు. తద్వారా రక్తం పలచగా మారి బీపీ తగ్గుతుంది. కానీ బీట్ రూట్ తీసుకుంటే అందులో ఉండే నైట్రేట్స్, ఐరన్ తదిరత ఇతర మూలకాల వల్ల రక్తం చిక్కబడుతుంది. దాని వల్ల మళ్లీ బీపీ సమస్యలు తలెత్తుతాయంటున్నారు తాజా పరిశోధకులు.
కాలేయానికీ ముప్పేనా?
ఆరోగ్యానికి మంచిదని, ఐరన్ పెరుగుతుందని బీట్ రూట్ ఎక్కువగా తీసుకున్నా ముప్పేనంటున్నారు పరిశోధకులు… బీట్రూట్ అధికంగా తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలు కూడా వస్తాయట. బీట్రూట్ ఎక్కువ తినడం వల్ల శరీరం లో కాల్షియం తగ్గుతుంది, ఇది ఎముకల సమస్యను పెంచుతుంది. మధుమేహ రోగులు ( డయాబెటిక్ పేషెంట్స్) బీట్ రూట్ కు దూరంగా ఉంటేనే మేలు.
బీట్రూట్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్ధాయి పెరుగుతుంది. చక్కెర స్ధాయి ఇప్పటికే ఎక్కువగా ఉన్నవారు బీట్రూట్ తినకూడదు. బీట్రూట్ లో గ్లైసెమిక్ ఇండెక్ప్ ఎక్కువ ఉంటుంది. ఈ కారణంగా, రక్తం లో అధిక చక్కెర ఉన్నవారు బీట్రూట్ వినియోగానికి దూరంగా ఉండాలి.
అలా అని బీట్ రూట్ వల్ల ఉపయోగాలే లేవా? (Beetroot)
మనకు శక్తిని,ఆరోగ్యాన్ని అందించే కూరగాయలు ఎన్పో ఉన్నయి. వాటిల్లో బీట్ రూట్ కూడా ఒకటి. బీట్రూట్ రసం లో విటమిన్లు,
బీట్ రూట్ వల్ల అన్నీ నష్టాలేనా అంటే కాదంటున్నారు పరిశోధకులు.. బీట్ రూట్ తింటే శరీరంలో ఐరన్ కంటెంట్ బాగా పెరుగుతుంది. అనీమియా ( రక్త హీనత) ఉన్న వారికి బీట్ రూట్ వర ప్రసాదం లాంటిది. అలాంటి వారు బీట్ రూట్ జ్యూస్ తాగితే ఐరన్, ఆక్సిజన్ కంటెంట్ బాగా పెరుగుతుంది. ఆక్సిజన్ పెరిగితే బ్లడ్ ఫ్లో బాగుంటుంది. వీటిలోని నైట్రేట్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. బీటా సానిన్, పోషకాలు అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్, క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి ప్రసిద్ది చెందింది. కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్షణ అందిస్తుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మెరుగు పరుస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని ఇవి నివారిస్తాయి.. ఈ రసంలోని నైట్రేట్లు ముఖ్యంగా టైప్ – 2 డయాబెటిస్ ఉన్నవారికి మాత్రం మేలు చేస్తాయి. బీట్రూట్తో కంటికి మేలే.
బీట్రూట్ రసానికి గుండె మరియు రక్త ప్రసరణ, ఊపిరితిత్తులతో దగ్గరి సంబంధం కలిగి ఉందని పరిశోధనల్లో బయటపడింది. ఈ రసం తీసుకోవడం వల్ల అథ్లెట్ల క్రీడా ఫలితాల్లో పెరుగుదల ఉంది. కాబట్టి ఆరోగ్యానికి మంచిది అని ఏదైనా అతిగా తిన్నా.. మేలు కన్నాకీడే ఎక్కువ అన్నది హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్న సూచనలు. కాబట్టి ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ పరిమితంగా బీట్ రూట్ తీసుకోవడమే మంచిది. (పై వ్యాసం పరిశోధనల ఆధారంగా రాసినది.. ఎవరికీ వైద్య సంబంధ సూచనలు చేస్తున్నట్లు కాదు.. ఆరోగ్యంపై ఒక అవగాహన కోసం ఇచ్చే సమాచారం మాత్రమే.. మీమీ హెల్త్ డాక్టర్స్ సూచనలు పాటిస్తూనే ఏదైనా తీసుకోండి..)