పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు క్షీరసాగర మధనం చేసినప్పుడు ఎన్నో అబ్దుతలు బయట వచ్చాయి అందులో నుంచే శ్రీ మహా లక్ష్మి కూడా పుట్టింది కాబ్బటి లక్ష్మి దేవి ని సముద్రుడి కూతురు గాను ఆ సముద్రం లో ఉన్న గవ్వలు(Shells) లక్ష్మీదేవి చెల్లెళ్లు గాను, సముద్రం లో ని శంఖాలను లక్ష్మీదేవి సోదరులు గాను భావిస్తారు. అందువలన గవ్వలు ఎక్కడ ఉంటె లక్ష్మీదేవి అక్కడ నివాసం ఉంటుంది అని విశ్వాసం. ఈ గవ్వలు కేవలం లక్ష్మీదేవి కి మాత్రమే కాదు శివుని కి కూడా ఎంతో ప్రత్యేకమైనవట. ఈశ్వరునికి అష్టాదశ అలంకారం లోను, ఈశ్వరుని జటాజూటం లో ను,నందీశ్వరుని గవ్వలు ఉంటాయట.గవ్వలు కు ఎంత ప్రాధాన్యత ఉందొ శంఖాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఇప్పటికి కూడా కొన్ని గిరిజన ప్రాంతాల్లో డబ్బుల కి బదులు గా ఈ గవ్వల నే నాణెలు గా వినియోగిస్తున్నారట. మన పూర్వీకుల కాలం నుండే ఈ గవ్వలతో దీపావళి రోజు ఆటలు ఆడే సంప్రదాయం కూడా ఉండేదట.
గవ్వల్లో అనేకరకాల గవ్వలు ఉన్నాయి వాటన్నిటిలోకి పసుపు రంగులో మెరిసే గవ్వలన్నీ లక్ష్మి స్వరూపం గా పూజ చేస్తుంటారు.ఈ పసుపు రంగు గవ్వలు సహజంగా సముద్రం లో ఉంటాయట.గవ్వలు కొంతమంది ఇంట్లో అలంకరణ కు ఆకర్షణీయంగా ఉంటుంది ఇంట్లో పెట్టుకుంటారు. మరి కొందరు సముద్రపు వొడ్డున దొరికే గవ్వలు తెచ్చి ఇంట్లో ఆటవస్తువులు గా పెడ్తారు.కొందరు గవ్వలను తాంత్రిక విద్య లోను వాడుతుంటారట.మనం కొంతమంది జ్యోతిస్యులని చూస్తూ ఉంటాము విచారి గవ్వలను ఉపయోగించి జాతకాలు చెబుతుంటారు. అంత శక్తివంతమైనవి ఈ గవ్వలు.
అందువలన గవ్వలకి(Shells) ఆధ్యాత్మికం గా, సాంకృతికం గా, ఆర్ధికంగా సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు.కాబ్బటి గవ్వలు ఎక్కడ ఉంటాయో అక్కడ లక్ష్మి దేవి నివాసం ఉంటుందని పండితులు చెబుతున్నారు.అందుకే కొంతమంది తమ పూజ మందిరం లో లక్ష్మి దేవి ఫోటో లేదా విగ్రహం తూ పాటు గవ్వలని శంఖాన్ని కూడా పూజ లో పెట్టి పూజిస్తుంటారట. ఇందువలన వారి ఇంటి ధనధాన్యాలు,సిరిసంపదల కు కొదవుండదని వారు నమ్మకమట.గవ్వల గలగల చప్పుడు ఉన్న చోట లక్ష్మీదేవి ఉనట్లేనని పండితులు చెబుతున్నారు .
గవ్వల వలన ఉపయోగాలు
1. పసి పిల్లలకు ఎలాంటి దృష్టి దోషం తొగలిండానికి తల్లులు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకోసారి చిన్నపిల్లలు ఈ దృష్టి వలన చాల ఇబ్బంది పడుతుంటారు అలాంటప్పుడు చంటి పిల్లల మెడ లో కానీ మొలత్రాడు లో కానీ ఈ గవాళ్లను(Shells) కట్టడం తో దృష్టి దోషం నివారణ చేయవచ్చట.
2. అలాగే వాహనాలు కొత్తగా కోనప్పుడు వాహనానికి దృష్టి తగలకుండా మూడు నిమ్మకాయలను స్పటిక ను కడుతుంటారు వాటితో ఈ గవ్వలను(Shells) నల్ల త్రాడు తో ఆ వాహనానికి కట్టడం తో దృష్టి దోషం దారికి రాదట.
3. నూతన గృహ నిర్మాణ సమయం కూడదా ఈ గవ్వలను(Shells) ఏదో ఒక ప్రదేశం లో కట్టడం వలన ఆ గృహానికి దృష్టి దోషం తగలకుండా ఉంటుందట.
4. నూతన గృహ ప్రవేశం చేసేటప్పుడు కూడ ఎలాంటి అవాంతరాలు లేకుండా లక్ష్మి దేవి ని ఆహ్వానిస్తూ లక్ష్మి స్వరూపమైన గవ్వలను ఒక గుడ్డ లో కట్టి గుమ్మానికి కట్టడం మంచిది అంటున్నారు పండితులు.
5. ఇంటి పూజ గది లో ఈ గవ్వలను ఓ పసుపు గుడ్డ లో కట్టి నిత్యం లలిత సహస్ర నామం తో కుంకుమార్చన చేస్తే ఆ ఇంటికి ధనాకర్షణ పెరుగుతందని పండితులు సూచిస్తున్నారు.
6. వ్యాపారస్తులు వ్యాపారం చేసి డబ్బులు పెట్టె చోట అంతే గుళ్ళా పెట్టె దగ్గర ఈ గవ్వలను ఉంచే వారి వ్యాపారం పుంజుకొని ధనాభివృధి కలుగుదట.
7. వివాహం ఆలస్యమవుతుంది అని భాధపడేవారు గవ్వలను తమ వద్ద ఉంచుకోవడం వలన అతి శీఘ్రం గా వారికి వివాహం జరుగుతదని చెబుతున్నారు.
8.వివాహ శుభకార్యం లో అందరి దృష్టి వధూవరుల మీదనే ఉంటుంది అదే సహజం కూడా అయితే వారికీ ఎలాంటి దృష్టి తగలకుండా ఉండాలంటే వారి చేతికి గవ్వలను(Shells) కట్టాలట.
9.తంత్ర పూజలలో అంటే వశీకరణ మాత్రం పఠించేటప్పుడు ఈ గవ్వలని(Shells) చేతిలో ఉంచుకోవడం మంచిదట.