జామకాయ(Guava) అనేక దేశాలలో ప్రసిద్ధి చెందిన పండు. ఈ పండు ను చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వారి వరకు ఇష్టపడని వారు ఉండరు. అంతేకాకుండా దీనితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయట. ఈ జామ పండు మెక్సికో మరియు మధ్య అమెరికాకు చెందినది, అయితే ఇది ఇప్పుడు ఆసియా, ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక ఇతర ప్రాంతాలలో పండిస్తున్నారు.
జామ లో ని పోషక విలువలు
జామ (Guava) లో ఎన్నో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లతో (Anti-Oxidants) నిండి అత్యంత పోషకమైన పండు గా చెప్తుంటారు. ఒక జామపండులో రోజువారీ మనకు కావలసిన విటమిన్ సి కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు వైద్యులు, అలాగే విటమిన్ ‘ఎ’, పొటాషియం మరియు పీచు పదార్ధం(Fiber) కూడా ఇందులో పుష్కలంగా ఉండటం వలన ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. జామ కాయ లో ఫోలేట్, కాల్షియం మరియు ఐరన్లు కూడా ఉంటాయట . ఇతర పండ్లతో పోలిస్తే, జామపండు లో తక్కువ క్యాలరీల(Calories) , తక్కువ గ్లైసెమిక్(Glycemic) స్థాయిలు కలిగి ఉండటం వలన ఇది బరువును తగ్గించడం లో ను రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం లో ను కీలక పాత్రా పోషిస్తుందట.
జామకాయ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు
రోగనిరోధక శక్తి :
జామపండు (Guava) లో ని విటమిన్ ‘సి’, రోగనిరోధక శక్తిని పెంచే అద్భుతమైన ఆహారంగా పని చేస్తుందట అంతే కాకుండా విటమిన్ ‘సి’ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కాబట్టి, ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడం లోను సహాయపడుతుందట, అంటువ్వ్యాధులతో కూడా పోరాడుతుందని నిపుణులు చెబుతున్నారు.
యాంటీఆక్సిడెంట్ లక్షణాలు:
జామ కాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉనందున, ఇది ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని దెబ్బతినకుండా కాపాడుతుందట. ఫ్రీ రాడికల్స్ అస్థిర అణువులు, ఇవి మన శరీరం లో ఆక్సీకరణ ఒత్తిడిని కలిగించి క్యాన్సర్, గుండె జబ్బులు మరియు అల్జీమర్స్ వ్యాధి వంటి దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు .
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
జామపండులో పీచు పదార్థం (Fiber) అధికంగా ఉండడం వలన ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో పాటు మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుందట అంతే కాకుండా ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్లను కూడా కలిగి ఉంటుందట.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:
జామలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉండవచ్చని కొన్ని అధ్యయనాల్లో చెప్పబడింది. జామకాయలో లైకోపీన్ మరియు క్వెర్సెటిన్ వంటి సమ్మేళనాలు ఉన్నందున ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయని ఆ అధ్యయనాల్లో తెలిపారు.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది:
జామపండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (Glycemic Index) ఉంటుంది, అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచదు. మధుమేహం ఉన్న వారు కూడా ఎలాంటి భయం లేకుండా ఈ పండు ని ఆస్వాదించవచ్చు అని వైద్యులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది:
జామ పండు లో ఉండే అధిక పొటాషియం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, ఇది గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
చర్మ సంరక్షణ :
జామకాయలో విటమిన్ ‘సి’, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఉనందున ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షిస్తుందట. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండటం వలన చర్మంలో మంట మరియు ఎరుపును తగ్గించడంలో సహాయపడుతుందట .
బరువు తగ్గడానికి :
జామ తక్కువ క్యాలరీలు మరియు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే పండు కాబ్బటి బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి ఒక మంచి పండు అనే చెప్పవచ్చు . జామపండులోని ఫైబర్ కూడా కడుపు నిండుగా తిన్న భావనను కలిగిస్తుందట .
యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్:
జామకాయలోని యాంటీఆక్సిడెంట్లు(Anti-Oxidants) ముడతలు, మరియు వయస్సు మచ్చలతో సహా వృద్ధాప్యం యొక్క ప్రభావాల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయని అంతేకాకుండా . ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడి చర్మాన్ని దృఢంగా మరియు యవ్వనంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు .