మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘భోళా శంకర్’.మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్ కు మంచి రెస్పాన్స్ దకించుకుంది . ఇక ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి చేసుకుని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా మెగా స్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ డబ్బింగ్ కూడా పూర్తి చేశారు.
ఈ సందర్భంగా స్టూడియో నుంచి ఫోటోలు అభిమానులతో పంచుకున్నారు మెగా స్టార్. ఈ మేరకు.. “సినిమా రూపుదిద్దుకున్న తీరు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫైర్ మాస్ ఎంటర్టైనర్ ఖచ్చితంగా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది! మీ క్యాలెండర్ లను మార్క్ చేసుకోండి! థియేటర్స్లో కలుద్దాం! భోళాశంకర్ ఆగస్టు 11 న రిలీజ్ అవుతోంది’ అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్. కాగా.. మెగాస్టార్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
So it’s a wrap for #BholaaShankar dubbing!
Very pleased to see how the film has shaped up. It is a sure fire mass entertainer and will appeal to the audiences in a big way! Mark your calendars! See you at the Movies!! #BholaaShankarOnAug11 pic.twitter.com/3ufoWJAwqp— Chiranjeevi Konidela (@KChiruTweets) July 6, 2023
Follow Us On : YouTube , Google News