భారీ వర్షాలు పొరుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. భారత్ లోనే కాదు పొరుగున ఉన్న చైనాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఒక పాఠశాల లో ఉన్న జిమ్ పై కప్పు కూలి పదకొండు మంది మృతి చెందారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో మరో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
భారీ వర్షాలకు…
ఈశాన్య చైనాలోని హీలాంగ్ జియాంగ్ ప్రావిన్స్ లోని క్వికిహార్ లో ఉన్న మిడిల్ స్కూల్ లో ఈ ఘటన జరిగింది. ఈరోజు ఉదయం స్కూలులో ఉన్న జిమ్ కూలిపోవడంతో పదకొండు మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. పథ్నాలుగు మందిని శిధిలాలను తొలగించి సహాయక సిబ్బంది కాపాడగలిగారు. గాయపడిన వారిని చికిత్స అందించే ప్రయత్నం చేయగా అందులో ఆరుగురు మరణించారని తెలిపారు. జిమ్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.