అతిచిన్న వయసులోనే పుష్పతో జాతీయ అవార్డు సాధించిన అల్లు అర్జున్ (Bunny) పుష్ప-2 మూవీకోసం మరింత కష్టపడుతున్నాడు. అవార్డు వచ్చిన నేపధ్యంలో అర్జున్ మంచి జోష్ మీదున్నాడు. ఈమధ్య కాలంలో ఫ్యాన్స్ ను అలరించడానికి టాప్ మోస్ట్ హీరోలంతా స్పెషల్ వీడియోలను షేర్ చేయడం మొదలుపెట్టారు. అలాగే సాధారణంగా బన్నీకి సంబంధించిన అప్డేట్స్ అనేసరికి ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు.
తన ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అల్లూ అర్జున్ తన డైలీరొటీన్ ను ఓ వీడియో రూపంలో షేర్ చేసుకున్నాడు.దీనికి సంబంధించిన క్లూ ఆగస్టు 29 సాయంత్రమే ఇన్ స్టా లో ఓ చిన్న క్లూ వదిలాడు. ఇంకేముంది బన్నీ ఫ్యాన్స్ అందరూ టెన్షన్ ఆపుకోలేకపోయారు. చివరికి ఇవాళ ఉదయమే తన సర్ ప్త్రెజ్ రీలిజ్ చేశాడు.
తన దినచర్య ఎలా ప్రారంభమవుతుందో తెలపడం తో పాటు పుష్ప-2 సంబంధించిన మేకింగ్ వీడియోను తన ఇన్ స్టా అభిమానులతో షేర్ చేశాడు. పుష్ప-2 సెట్ లో ఏం జరుగుతుందో సుకుమార్ తో కలిసి ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. ఆ వీడియో అభిమానులను ఎంతగానో ఉత్సహాపరిచింది. పుష్ప-2కి సంబంధించిన అఫ్ డేట్ ఇవ్వడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ దిల్ ఖుషీ చేశాడు. పార్టీ లేదా పుష్ప అని అడిగేవారికి ఈ వీడియో తో ఫిధా చేశాడు.
ఫుల్ మీల్స్ లాంటి వీడియో: (Bunny)
రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోన్న పుష్ప-2 సెట్స్ ను చూపించి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ తినిపించాడు.
ఇలా ఇస్టా గ్రామ్ లో ఒక భారతీయ నటుడి తో కొలాబరేట్ అయి తన జీవితంలో అతను లేచింది మొదలు పెట్టి, షూటింగ్ కి వెళ్లి, ప్యాక్ అప్ చెప్పేంత వరకూ ఏమి చేస్తాడు అనేది ఒక వీడియో రూపంలో చూపించటం ఇదే మొదటిసారి.
అభిమానులు ఆ పండగ వాతావరణం నుంచి బయటకి రాకముందే పుష్ప -2 సెట్స్ తో అభిమానులకు గ్యాప్ ఇవ్వకుండా సందడి చేస్తున్నాడు ఈ ఐకాన్ స్టార్.
ఇతర దేశాల్లో అభిమానులకు భారత అభిమానులకు చాలా తేడా ఉంటుంది.
మన అభిమానుల ప్రేమ నన్ను సరిహద్దులు అధిగమించేలా చేస్తోందన్నాడు ఐకాన్ స్టార్.పుష్ప-2 షూటింగ్ ను క్షణ క్షణం ఎంజాయ్ చేస్తున్నట్లు బన్నీ కామెంట్లను బట్టి తెలుస్తోంది.
పుష్ప-2 రిలీజ్ డేట్:
విషయానికి వస్తే వచ్చే ఏడాది మార్చి 22న సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. పుష్ప-1 విజయంతో ఫ్యాన్స్ నన్ను చూసి గర్వపడేలా చేసినందుకు నాకు ఎంతగానో ఆనందం కలిగించింది. పుష్ప-2 నా 20వ సినిమాగా తెరకెక్కుతోంది.
ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్ర నాకు ఎంతగానో నచ్చిన పాత్ర. పుష్ప షూటింగ్ ను ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నానన్నాడు బన్నీ. పుష్ప మొదటి పార్ట్ కు పుష్ప ది రైజ్ అని పెడితే ఇప్పుడు రెండోపార్ల్ మూవీకి పుష్ప ది రూల్ అని పెట్టారు.
https://www.instagram.com/p/CwjcwvwSlxO/?hl=en