ఈరోజు మనం ఒక మంచి ఆరోగ్య సూత్రాన్ని వైద్యుడు(Doctor) దగ్గరికి వెళ్ళవలసినటువంటి పని లేనటువంటి సూత్రాన్ని తెలుస్కుందాం . దినాంతం అంటే పగలు అయిపోయిన తర్వాత రాత్రి పాలు తాగుతూ నిశాంతి రాత్రి అయిపోయిన తర్వాత అంటే సూర్యోదయం లేవడానికి ముందు రాత్రి పూర్తయ్యాక తెల్లవారుజామున నీళ్లు తాగుతూ భోజనం పూర్తయిన తర్వాత మజ్జిగ తాగుతూ ఉండేవాడికి వైద్యుడు అవసరం లేదట.
చాలామందికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం అయితే ఈ పెరుగన్నంతో పాటు మజ్జిగ(Butter Milk) కూడా చాలా మంచిది. మజ్జిగలో కూడా ఎన్నో పోషక విలువలు ఉన్నాయని చెపుతారు వైద్య నిపుణులు . లాక్టిక్ ఆమ్లం లేదా లాక్టిక్ యాసిడ్(LacticAcid) ఏదైతే ఉందో ఇది మన బాడీకి మంచి పోషక విలువల్ని అందిస్తుంది .రెగ్యులర్ గా మన డైట్ లో మాజీగా ని భాగం చేస్కుంటే మనం ఆరోగ్యవంతంగా ఉంటాం . ముఖ్యంగా మజ్జిగ తాగే వాళ్లలో ఎసిడిటీ సమస్య అనేది చాలా తక్కువగా ఉంటుంది అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు.
అంతే కాకుండా మజ్జిగలో కనుక కాస్త కరివేపాకు పొడి లేదా , మన రుచి కి తగ్గట్టుగా కాస్త ఉప్పు నిమ్మ రసం లాంటివి కనుక దాంట్లో కలిపి రెగ్యులర్గా తాగుతూ ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు . చాలా మంది నైట్ టైమ్స్ లో తాగుతూ ఉంటారు ఇలా చేస్తే కనుక మన జుట్టు కుదురులకు కూడా చక్కటి బలం వచ్చి మన జుట్టు కూడా చక్కగా నిగనిగ లాడుతూ ఉంటుంది. మజ్జికే కదా అనుకోకుండా మజ్జిగలో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి అనుకుని మజ్జిగని మన డైట్ లో భాగం చేసుకుంటే ఎన్నో పోషక విలువల్ని మ మన సొంతం చేసుకోవచ్చు . ఇక ఇవన్నీ మనం ఆరోగ్యపరంగా మాట్లాడుకున్నాం కదా అందానికి కూడా మజ్జిగ చాలా ముఖ్యం అనే చెప్పుకోవచ్చు.
మజ్జిగలో కాస్త అంటే ఒక కాటన్ బాల్ తీసుకుని దాంట్లో గనక మనం ఈ కాటన్ బాల్ ని మజ్జిగలో ముంచి చక్కగా ముంచి ఆ మజ్జిగని మన ఫేస్ మీద అంటే చిన్నగా మసాజ్ చేసుకుంటూ ఉంటే చర్మం కూడా నిగనిగలాడుతూ ఉంటుందట .ఆ తర్వాత చల్లటి నీటితో మొహం కడుక్కొని మన ఫేస్ గనక చూసుకుంటే ఆ డిఫరెన్స్ ని మనం గుర్తించవచ్చు. కాబట్టి మజ్జిగని మనం చులకన చేయకుండా మన డైట్ లో అలాగే ఈ టిప్స్ లో కూడా ఫాలో కావచ్చు. మజ్జిగతో కేవలం మనం అందానికి ,ఆరోగ్యానికి మాత్రమే అనుకుంటే పొరపాటే .
ఇది ఇన్స్టెంట్ (Instant)ఫుడ్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అది ఎలాగంటే మజ్జిగ ఒక్కోసారి పుల్లగా అయిపోతుంటుంది ఆలా పుల్లగా అయింది అంటే బాధ పడాల్సిన అవసరం లేకుండా దానితో చక్కగా అటుకులు తో కలిపి ఆ తర్వాత వాటికి సరిపడా మోతాదు లో బియ్యం పిండి ని కూడా కలిపి మనం మినపట్లు ఎలాగైతే వేసుకుంటామో అదే రీతిలో ఈ అటుకులతో కనుక మజ్జిగలో నానబెట్టుకుంటే చక్కటి దోశలు కూడా చేసుకోవచ్చు.