కేన్సర్ (CA-125)
మారుతున్న కాలం మన జీవన శైలిలో మార్పులు కేన్సర్ వ్యాధి రాడానికి కారణాలంటున్నారు వైద్య నిపుణులు. కేన్సర్ పై చేసిన అధ్యయనాల్లో 50 ఏళ్ల లోపు వారిలో 79 శాతం మందిని కేన్సర్ వేధిస్తోందని బయటపడింది. ముందుగానే మేల్కొని జీవన శైలిని మార్చుకోకపోతే ఈ మొండి వ్యాధి బారిన పడక తప్పదంటున్నారు రిసెర్చర్లు…
క్యాన్సర్ అంటే ఎమిటి… (CA-125)
శరీరం మొత్తం కణజాలంతో నిండి ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే, శరీరంలో ఎక్కడైనా కణజాలం అడ్డు అదుపు లేకుండా విపరీతంగా పెరిగి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే వ్యాధి క్యాన్సర్. డీఎన్ఏ వల్ల మన తల్లిదండ్రుల్లో ఉండే లక్షణాలే మనకు కూడా వస్తాయనే విషయం తెలిసిందే. అలాగే క్యాన్సర్ కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. అంతేగాక ఆహారపు అలవాట్లు, రేడియేషన్, స్మోకింగ్, ఊబకాయం కారణాల వల్ల కూడా డీఎన్ఏలో మార్పులు వస్తాయి. దీని వల్ల కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. ఫలితంగా శరీరానికి అవసరమైన కణాలు కంటే ఎక్కువ వృద్ధి చెందుతాయి. అవన్నీ కలిసి ట్యూమర్ కణితిగా ఏర్పడతాయి. దాన్నే క్యాన్సర్ అని అంటారు.మన దేశంలో అనేక రకాల క్యాన్సర్ లు ఉన్నాయి. అందులో నివారించ గలిగినవి 70%గా వున్నాయి.
కేన్సర్ లోరకాలెన్నో… (CA-125)
బ్రెస్ట్ కేన్సర్ , నోటి కేన్సర్ , స్కిన్ కేన్సర్ , లంగ్ కేన్సర్ , ప్రోస్టేట్ కేన్సర్ , కిడ్నీ కేన్సర్ , కాలేయ కేన్సర్, ఊపిరితిత్తుల కేన్సర్, మెలనోమా కేన్సర్ , ప్రోస్టేట్ కేన్సర్, ధైరాయిడ్ కేన్సర్, బ్లడ్ కేన్సర్ , ఇలా 200 కంటే ఎక్కువ రకాలు వున్నాయి. వీటిలో ఒక్కోదానికి ఒక్కో రకమైన లక్షణాలు ఉంటాయి. భారతదేశంలో ఎక్కువగా వచ్చే వాటిలో బ్రెస్ట్ కేన్సర్, నోటి కేన్సర్ వున్నాయి.
బ్రెస్ట్ కేన్సర్ ఇది సాధారణంగా 40 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలకు ఎక్కువ వస్తుంది. అందుకే ఒక వయసు వచ్చాక మామోగ్రఫి స్కీృనింగ్ క్రమం తప్పకుండా చేయించుకోవాలని నిపుణులు అంటున్నారు. మహిళలందరూ కచ్చితంగా 20 ఏళ్ల తర్వాత నుంచి క్రమం తప్పకుండా సెల్ప్ బ్రెస్ట్ ఎగ్జామినెషన్ చేసుకొవాలి. అదే విధంగా నోటి కేన్సర్ కూడా వస్తుంది. పెదవులు, చిగుళ్ళు, నాలుక, బుగ్గ లోపలి పొరలో, నోటి పైభాగం లేదా కింది భాగం ఇలా ఎక్కడనా కేన్సర్ రావొచ్చు. ఈ లక్షణాలతో పాటు మరికొన్ని ముఖ్య లక్షణాలు ఉన్నాయి.
కేన్సర్ లో నాలుగు దశలు
తొలి రెండు దశల్లోనూ గుర్తించగలిగితే పూర్తిగా ఈ వ్యాధినుంచి కోలుకుని బయటపడొచ్చు..మూడో దశ కొంత క్లిష్టంగా ఉన్నా కోలుకునే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాల పోరాటం చేయక తప్పదు. అదే నాల్గవ దశ అయితే ఇక చివరి స్టేజి కింద చెప్పొచ్చు. ఎందుకంటే ఈ దశ చివరికి మరణానికి దారి తీస్తుంది. రెండు దశలు దాటాక ఉండే కేన్సర్ నుంచి కోలుకోడానికి కీమో ధెరపీ, రేడియోధెరపీ, ఇస్తారు.
ఇవేకాక మరిన్ని థెరపీలు కూడా అందుబాటులో ఉన్నాయి అవే హార్మోన్ ధెరపీ, హైపర్ థెర్మియా, ఇమ్యునో ధెరపీ, ఫోటోడైనమిక్ ధెరపీ, టార్గెటెడ్ ధెరపీ, అవసరాన్ని బట్టి సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది.
శరీరానికి కేన్సర్ సోకిన భాగాన్ని బట్టి వారు ఏదశలో ఉన్నారో తెలుసుకుని అందుకు సంబంధించిన చికిత్స చేస్తారు. కానీ చాలా మందికి రెండు, అంతకంటే ఎక్కువ రకాల ట్రీట్ మెంట్స్ అవసరం అవుతాయి. కీమోధెరపీ, రేడియేషన్ ధెరపీతో పాటు కొందరికి సర్జరీ కూడా అవసరం అవుతుంది.
కీమో థెరపీ, రేడియో థెరపీ వల్ల రోగి శరీరంపై దీర్ఘకాలిక ప్రభావాలు పడతాయి. ఈస్థితిలో రోగి బలహీనపడతాడు. తలపై జుట్టు తుట్టలు తుట్టలుగా రాలిపోతుంది. అందుకే చాలా మంది సెలబ్రిటీలు కేన్సర్ సోకితే గుండు చేయించేసుకుంటారు. ఆ తర్వాత చికిత్స పూర్తయ్యాక కొంత కాలానికి మళ్లీ యధాప్రకారం జుట్టు వస్తుంది.
కీమోధెరపీ చికిత్సలో కేన్సర్ కణాలతో పోరాడే ఔషధాలను శరీరానికి అందించడం. ఆరోగ్యకరమైన కణాలను కాపాడడం జరుగుతుంది. ఈ థెరపీని దీన్ని సైకిల్స్ రూపంలో కొన్ని రోజులకు ఇస్తారు. జుట్టు రాలిపోవడం, వాంతులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. రేడియోధెరపి ద్వారా కేన్సర్ కణాలను హతమార్చే పద్దతి ఇదీ. ఈ మధ్య కాలంలో ఆరోగ్యంగా ఉన్న కణాలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి, ఎన్నో ఆధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.
మూడు, నాలుగు చికిత్సలు ఒకేసారి
కొన్ని రకాల కేన్సర్లకు, తీవ్రతను బట్టి, ఈ మూడు చికత్స విధానాలను కలిపి కూడా అందించే అవకాశం ఉంది. చికత్స పూర్తి అయిన తరవాత కూడా మళ్ళీ కొద్ది రోజులకు, క్యాన్సర్ లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మధ్య మధ్యలో పరీక్షలు చేసుకుంటూ ఉండాలి. ఇతర దేశాలతో పోలిస్తే, మన దేశంలో కేన్సర్ తక్కువ ఉన్నప్నటికీ, తొలి స్టేజ్ లో గుర్తించలేక పోవడంతో కేన్సర్ మరణాలు ఎక్కువ అవుతున్నాయి.
బయె మార్కర్ టెస్టింగ్
బయోమార్కర్ టెస్టింగ్ అనేది కేన్సర్ గురించి సమాచారం అందించే జన్యువులు, ప్రోటీన్లు, వెతకడానికి ఒక మార్గం. ఇప్పుడు కొత్తగా ఇమ్యునోధెరపీ వచ్చింది. ఇది వ్యాధికి వ్యతిరేకంగా పోరాడటానికి శరీరం యొక్క రోగనిరోధక శక్తిని ఉపయోగిస్తుంది. అనేక రకాల కేన్సర్లకు చికిత్స చేయడానికి ఇమ్యునోధెరపీని ఉపయోగించవచ్చు. అయితే క్యాన్సర్ కి సంభందించిన చికిత్సకయ్యే ఖర్చు భరించే స్తోమత లేక నిరుపేదలు ఎన్నో అవస్ధలు పడుతుంటారు. ప్రెవ్తేటు హాస్పిటల్ లో మరింత ఎక్కువగా వుండే అవకాశం ఉంటుంది.