ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కేసులో నిన్న TDP అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా సామూహిక నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లాల్లో టిడిపి శ్రేణులు నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. అనేక చోట్ల కార్యకర్తలు రోడ్లపైకి చేరి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిరసనలపై ఉక్కుపాదం మోపిన పోలీసులు ఎక్కడికక్కడే గృహనిర్బంధాలు, అరెస్టులు చేశారు.
ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పరాకాష్టే చంద్రబాబు అరెస్టు అని జనసేనాని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. నిన్న అరెస్టు వార్త తెలిసిన వెంటనే హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేందుకు పవన్ ప్రయత్నించారు.అ యితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందన్న ఉద్దేశంతో పోలీసులు ఆయన్ను మార్గ మధ్యంలోనే ఆపేశారు. జనసేన కార్యకర్తలకు పోలీసులకు మధ్య అనేక మార్లు తీవ్ర వాగ్వివాదాలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చివరకు పవన్‌ను, నాదెండ్ల మనోహర్ ను మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి తరలించారు.
సీఐడి జగన్ ప్రైవేటు సైన్యమా?
కక్ష సాధింపు రాజకీయాలకు ఏపీ వేదికగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభవృద్ధి కంటే.. ప్రతీకార చర్యలు ఎకువ అయ్యాయి అన్ని రామకృష్ట తీవ్రంగా విమర్శలు చేశారు. జగన్ ప్రైవేట్ సైన్యంగా సీఐడీకి నామకరణం చేయాలని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా పోలీసులు, సీఐడీ అధికారులు వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు. లోకేశ్ సహా టీడీపీ నేతలను నిర్బంధించటం దుర్మార్గమని రామకృష్ణ అన్నారు.
అరెస్టు దారుణం : పురందరేశ్వరి
చంద్రబాబు అరెస్ట్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీదేవి ఖండించారు. సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్లో పేరు పెట్టకుండా అరెస్టు చేయడం దారుణమన్నారు. వివరణ తీసుకోకుండా, విధానాలు అనుసరించకుండా అరెస్టు సరికాదని పురందేశ్వరి అన్నారు.గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబు అరెస్ట్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీదేవి ఖండించారు. సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్లో పేరు పెట్టకుండా అరెస్టు చేయడం దారుణమన్నారు.
ఇది చట్టవిరుద్ధమైన అరెస్ట DP
TDP అధినేత చంద్రబాబు అరెస్టు అక్రమం, చట్ట విరుద్ధమని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు ఆరోపించారు. ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అర్దరాత్రి అరెస్ట్ చేసే విధానాలను ఆంధ్రప్రదేశ్‌లో అవలంభిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో విశాఖపట్నంలో జనసేన పట్ల పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో అందరూ చూశారు. అని జనసేనా పార్టీ నాదెండ్ల మనోహర్ అన్నారు పాపం ఏ తప్పు చేయని జనసేన నాయకులను హత్యాయత్నం కేసులు పెట్టి జైళ్లలో పెట్టారు. చంద్రబాబు మీద నంద్యాలలో జరిగిన సంఘట కూడా అలాంటిదే. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడాన్ని సంపూర్ణంగా జనసేన ఖండిస్తోంది అన్నారు నాదెండ్ల మనోహర్
మాజీ ముఖ్యమంత్రికి అవమానం
14 ఏళ్లు ఏపీ ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబును అర్ధరాత్రి అరెస్టు చేయటం అప్రజాస్వామికమని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ అన్నారు. ఖమ్మం గిరిప్రసాద్ భవన్లో జన సేవాదళ్ శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుమతి లేకుండా చంద్రబాబు అరెస్టుకు అవకాశం లేదని స్పష్టం చేశారు.
ప్రజలు నమ్మరు TDP
చంద్రబాబు రాజకీయజీవితమంతా తెరచిన పుస్తకమని, ఆయనపై తప్పుడు కేసులు పెడితే జనం నమ్మే స్థితిలో లేరని TDP అధ్యక్షుడు అచ్చెం నాయుడు అన్నారు. బాబు అరెస్టు అక్రమమని ఆందోళన బాట పట్టిన TDP నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబుకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలను నేతలు ప్రారంభించారు.
ముందు జాగ్రత్త గా అరెస్టులు TDP
టీడీపీ నేతల సామూహిక నిరాహార దీక్షల నేపధ్యంలో పోలీసులు
భద్రతను ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ నేతలను గృహ నిర్బంధం చేసేశారు. కర్నూలు జిల్లా ఆలూరులో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ నిరాహార దీక్షకు పూనుకున్నారు. మచ్చలేని రాజకీయ జీవితం చంద్రబాబు సొంతమని జగన్ ప్రభుత్వం తెలిసో తెలీకో తప్పు చేసిందని ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకుని బాబుపై అన్ని కేసులు కొట్టేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న రోజుల్లో మరిన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదని సుజాతమ్మ అన్నారు.