Chandra Mohan
విలక్షణ నటుడు చంద్రమోహన్ (80) కన్నుమూశారు. గుండెపోటుతో ఇవాళ ఆసుపత్రిలో తుది శ్వాసవిడిచారు. ప్రముఖ డైరెక్టర్,దాదా సాహెబ్ ఫాల్కెఅవార్డు గ్రహీత స్వర్గీయ కె. విశ్వనాథ్ కి ఆయన సోదరుడి వరస అవుతారు. ఆయనకు భార్య,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన భార్య జలంధర ప్రముఖ రచయిత్రి కూడా. పలు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రి లో ఉదయం 9.45 నిమిషాలకి తుది శ్వాస విడిచారు. ఆయన అంత్య క్రియలు సోమవారం హైదరాబాద్ లో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
కృష్ణా జిల్లా లో జననం (Chandra Mohan)
చంద్రమోహన్ అసలు పేరు మలంపల్లి చంద్ర శేఖర్ రావు. దాదాపు 932 సినిమాలకు పైగా నటించారు. ఆంధ్ర పరదేశ్ లోని కృష్ణా జిల్లా పమిడిముక్కల గ్రామం లో 1943, మే 23 న చంద్రమోహన్ జన్మించారు. తొలి చిత్రం రంగుల రాట్నం .1966లో తీసిన ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ నటుడిగా నంది అవార్డు ఇచ్చింది. తొలిచిత్రం తోనే ఆయన అవార్డు దక్కించుకోడం ఆయన నటన కి తార్కాణం. 1968 లో వాణిశ్రీ సోదరునిగా నటించిన సుఖ దుఖాలు సినిమాకు కూడా అవార్డుల పంట పండింది . చంద్రమోహన్ కి బాగా గుర్తింపు తెచ్చిన సినిమా పదహారేళ్ళ వయసు.సిరి సిరి మువ్వ, సీతామాలక్ష్మి, రాధా కళ్యాణం ,శంకరాభరణం ,చందమామ రావే సినిమాలు ఆయనకు బాగా గుర్తింపు తెచ్చాయి.
ఆయనలో నటుడికి రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వరించాయి .ఇక ఇతర అవార్డులకైతే లెక్కే లేదు. కారెక్టర్ నటుడిగా ఆయన మెప్పించని పాత్ర లేదు…చంద్రమోహన్ ఆదర్శ భావాలు కలవారు. ఆయన భార్య జలంధర రాసిన పున్నాగ పూలు నవల కి ఉత్తమ రచయిత్రి అవార్డు దక్కింది. పాత తరం నటులకి కొత్త తరం నటులకి ఆయన వారధి గా నిలిచారు. ఆయన మృతికి సినీ ప్రముఖులు పలువురు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపి ముఖ్యమంత్రి వై యెస్ జగన్ , మెగాస్టార్ చిరంజీవి,జూనియర్ ఎన్టిఆర్ , సాయి ధరం తేజ్ , కల్యాణ్ రామ్, మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, లోకేశ్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
అద్భుత నటన
పాత్రకి తగ్గ నాతనని ప్రదర్శించడమ్ లో చంద్రమోహన్ ని మించిన వారు లేరు. ఆమె,కలికాలం , సగటు మనిషి, లాంటి చిత్రాలు ఆయనకు యెంతో పేరు తెచ్చాయని ఆయన అంటుండేవారు. పదహారేళ్ళ వయసు ఆయన కు మంచి పేరు తెచ్చినా అది రీమేక్ కావడం తో తనకు పెద్దగా నచ్చలేదని చెప్పారు. సినీ దిగ్గజాలలో అక్కినేని తో ఆయన యెక్కువ సినిమాలు చేశారు. ఎన్టిఆర్ తోనటించే అవకాశం వచ్చినా ఆ తర్వాత అది చేజారిపోయిందని ఐతే తమిళం లో అదే సినిమా ఎంజిఆర్ తో చేసే అవకాశం దక్కిందాని చంద్రమోహన్ అంటుండేవారు.
శోభన్ బాబు సెంటిమెంట్
అందాల నటుడు శోభన్ బాబు చద్రమోహన్ దగ్గర డబ్బులు తీసుకునేవారట. చంద్రమోహన్ చేత్తో డబ్బు తీసుకుంటే తనకు కలిసొస్తుందని నమ్మేవారని ఓ ఇంటర్వ్యూ లో చంద్రమోహన్ చెప్పారు.