Chay-Sam
సామ్ , చే జంట మళ్లీ కలుస్తుందా? ఇప్పటికి వందల సార్లు ఇలాంటి రూమర్లు పుట్టినా ఆ జంట మాత్రం విడి విడిగానే తమ జీవితాలు కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ లో హిట్ పెయిర్, అందమైన జంట ఏదైనా ఉందీ అంటే అది చైతు,సామ్ ల జంటే.. మంచి కెమిస్ట్రీతో స్ర్కీన్ పై రొమాన్స్ పండించే ఈ జంట నిజ జీవితంలో విడిపోవడం మాత్రం విషాదం. తాజాగా సామ్ గురించి చైతూ చేసిన ఓ కామెంట్ మళ్లీ వాళ్ళిద్దరూ కలుస్తారంటూ రూమర్లు వ్యాపించేందుకు కారణమైంది.
వెబ్ సీరీస్ లో చైతూ
వెండి తెరపై భారీ సక్సెస్ లు చవిచూడకపోయినా, యావరేజ్ హీరోగా పేరు తెచ్చుకున్న చైతూకి సామ్ ను పెళ్లి చేసుకోవడంతో మరింత క్రేజ్ పెరిగింది. అలాంటి చైతూ ఇప్పుడు వెబ్ సీరీస్ లపై ఆసక్తి చూపిస్తున్నాడు. చూపించడం కాదు..ఏకంగా దూత అనే వెబ్ సీరీస్ లో నటించాడు కూడా. ఇప్పుడా ఎపిసోడ్స్ రిలీజ్ అవుతుండటంతో ఒక్కసారిగా మళ్లీ హైప్ క్రియేట్ అయ్యింది. నిజానికి చైతూ కన్నా సామ్ వెబ్ సీరీస్ లో ముందు నటించింది.
ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సీరీస్ సమంతకు వెండి తెరకన్నా మంచి పేరు తెచ్చింది. ఈ సీరీస్ లో సామ్ బోల్డ్ సీన్లలో కూడా ధైర్యంగా నటించిందని పేరు వచ్చింది. అయితే అదే సీరీస్ పలు విమర్శలకు కూడా కారణమైంది. ఫ్యామిలీ మ్యాన్ లో సామ్ నటించిన కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని అవే చైతూ, సామ్ మధ్యవిభేదాలకు కారణమయ్యాయని అప్పట్లో పుకార్లు వచ్చాయి. అయితే అటు చైతూ, కానీ సామ్ కానీ తమ విడాకులకు కారణం ఏంటన్న దానిపై బయటకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
చే ఎందుకలా అన్నాడు? Chay-Sam
అయితే రీసెంట్ గా దూత వెబ్ సీరీస్ విడుదల సందర్భంగా చైతూ చేసిన ఓ కామెంట్ వాళ్లిద్దరి మధ్య మళ్లీ సఖ్యత కుదురుతుందేమోననే ఆశకు తావిస్తోంది. వెబ్ సీరీస్ లలో తనకు అత్యంత ఇష్టమైనది ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ అని చైతన్య ప్రకటించాడు. అంతేకాదు అందులో సామ్ నటన తనకు బాగా నచ్చిందని అన్నాడు. సామ్ లో మంచి నటనా సామర్ధ్యం ఉందని అది తనకు చాలా నచ్చుతుందని చే అన్నాడు. దాంతో ఇంకేం.. చైతూ బంగారం.. మనసు చాలా మంచిది.. వీరిద్దరూ మళ్లీ కలుస్తున్నారహో అంటూ టాలీవుడ్ లో గాసిప్స్ జోరందుకున్నాయి. ఈ జంట వీరాభిమానులయితే వీరు మళ్లీ కలవాలంటూ శతకోటి దేవుళ్లకు మొక్కుతున్నారు.