Deep Fake
సినిమా తారలు, సెలబ్రిటీలపై డీప్ ఫేక్ వీడియోలు కలవరపెడుతున్నాయి. మొన్నటికి మొన్న రష్మికా మందన్న మార్ఫ్ డ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేశవ్యాప్తంగా ఇది కలకలం సృష్టించింది. ఈ ఉదంతంపై కేంద్రం కూడా స్పందించింది. సంబంధీకులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. రష్మిక కు దేశవ్యాప్తంగా మద్దతు పలికింది. ఆపై బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ పై ఇలాంటిదే మరో వీడియో ప్రత్యక్షమైంది. దీనిపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ నటి కాజోల్ దీని బారిన పడ్డారు. ఆమె ముఖంతో ఓ మార్ఫ్ డ్ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టిక్ టాక్ వీడియోతో మార్ఫింగ్ Deep Fake
కాజల్ ఓ కెమెరా ముందు బట్టలు మార్చుకుంటున్నట్లుగా ఉన్న ఆ వీడియో ఎవరో చిల్లర వేషాలు వేసే వారు డీప్ ఫేక్ చేశారని అర్ధమవుతోంది. బూమ్ లైవ్ లాంటి అనేక ఫ్యాక్ట్ చెకింగ్ వేదికల పరిశీలనలో ఈ వీడియో ఓ ఇంగ్లీష్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్దని, దానిని ఆమె గెట్ రెడీ విత్ మీ అనే ట్రెండ్ సీరీస్ లో భాగంగా టిక్ టాక్ లో అప్ లోడ్ చేసిందని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కుచ్ కుచ్ హోతాహై మూవీ హీరోయిన్ కాజల్ కెమెరా ముందు దుస్తులు మార్చుకుంటున్నట్లుగా దానిని దుండగులు మార్ఫ్ చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగించి దీనిని మార్ఫింగ్ చేశారని, వీటి ప్రకారం ఏ వ్యక్తి ముఖాన్నైనా అతుకులు లేకుండా చాలా నీట్ గా మార్ఫ్ చేయవచ్చని బూమ్ లైవ్ లాంటి వెబ్ సైట్లు చెబుతున్నాయి.
టిక్ టాక్ ఇన్ ఫ్లు యెన్సర్ రోజీ బ్రీన్ టీక్ టాక్ లో 2023 జూన్ 5న ఈ వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఆ ఒరిజినల్ వీడియోలో బ్రీన్ ముఖాన్ని కాజోల్ ముఖంతో రీప్లేస్ చేసారు. దాంతో కాజోల్ నగ్నంగా కెమెరా ముందు నిలబడి దుస్తులు మార్చుకుంటున్నట్లుగా వీడియో ఉంది. డీప్ ఫేక్ వీడియోలపైనా, మార్ఫింగ్ ఫొటోలపైనా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో కాజోల్ ఈ సోషల్ మీడియా ఉన్మాదం బారిన పడింది.
గతంలో కత్రీనా కైఫ్
కత్రీనా కైఫ్ విషయంలో ఆమె నటిస్తున్న టైగర్ -3 ప్రాజెక్ట్ లోని ఓ క్లిప్ ను తీసుకుని దానిని మరో ఒరిజినల్ వీడియోతో మార్ఫ్ చేశారు. కత్రీనా టవల్ కట్టుకుని ఉన్న అందులో స్టంట్ విమెన్ తో కొన్ని దృశ్యాలు షూట్ చేస్తున్న టైమ్ లోవి. అవికూడా ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ ఒరిజినల్ వీడియోకి కత్రీనా వీడియోను చాలా నేర్పుగా జత చేశారు. Deep Fake
అంతకుముందు రష్మికా మందన్న
ఇక రష్మిక మందన్న విషయంలో కూడా బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఓ యువతి లిఫ్ట్ లోకి ఎంటరవుతున్న దృశ్యం. ఒరిజినల్ వీడియోను రష్మిక వీడియోతో మెర్జ్ చేశారు. పూర్తిగా పోలికలు తెలియకుండా పైపైన రష్మిక ను పోలి ఉండేలా మార్ఫింగ్ చేశారు. దీనిపై బిగ్ బీ అమితాబ్ కూడా తీవ్రంగా స్పదించారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన ఢిల్లీ పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి బీహార్ కు చెందిన 19 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆయువకుడే తొలిసారిగా ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడని తెలిసింది. Deep Fake