Clapping Therapy
చిన్నప్పుడు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్లకు చప్పట్లు కొట్టే ఉంటారు. ఏదైనా పోటీల్లో మనవారిని ఎంకరేజ్ చేయడానికీ చప్పట్లు కొడుతూ ఉంటాం. ఇతరులను అభినందించడానకి, ఎదైనా ప్రసంగం నచ్చినా, చప్పట్లు కొట్టాల్సిందే. చప్పట్లు ఎదుట వ్యక్తిని సంతోష పరచడమే కాదు మన ఆరోగ్యానికీ మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కానీ చప్పట్లు కొట్టడం వెనుక చాలామందికి తెలియని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చప్పట్లు కొట్టడానికి శారీరక శ్రమ అవసరం లేదు. రోజుకు 10 నిమిషాలు చప్పట్లు కొట్టడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మీ మార్నింగ్ ఎక్సర్సైజ్ రొటీన్లో క్లాపింగ్ థెరపీని పాలో అవ్వాలని సూచిస్తున్నారు. లాఫింగ్ థెరపీ మాదిరిగానే క్లాపింగ్ థెరపీ కూడా ఇప్పుడు ఫేమస్ అయ్యింది.
క్లాపింగ్ థెరపీ వల్ల ఉపయోగాలు… Clapping Therapy
మనిషి శరీరంలో ప్రతి అవయవం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. అరచేతులు రక్తనాళాలను కలిగి ఉంటాయి. చప్పట్లు కొట్టడం ఆందోళనను నియంత్రించడానికి సులభమైన మార్గం. చప్పట్లు కొట్టడం వల్ల ఒత్తిడి తగ్గుతుందట. చప్పట్లు కొట్టడం ప్రారంభించగానే మెదడుకి సానుకూల సంకేతాలు వెళ్తాయి. సంతోషకరమైన హార్మోన్లను పెంచడానికి రోజువారి వ్యాయామంలో చప్పట్లు కొట్టడం ఎంతో మంచిది. దీన్ని వల్ల రక్తపోటు స్ధాయిలు నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యం బాగుంటుంది. చప్పట్లు కొట్టినపుడు శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అనేక గుండె సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు చప్పట్లు కొట్టడంతో శ్వాస సమస్యలు కూడా తగ్గుతాయట. పిల్లలు క్రమం తప్పకుండా చప్పట్లు కొట్టడం వల్ల వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుందట.
క్లాప్ థెరపీ వెనుక ఉన్న సైన్స్ ఏమిటి… Clapping Therapy
మానవ శరీరం ఒక సంక్లిష్టమైన వ్యవస్థ. ప్రతి అవయవాన్ని ఒకదానితో ఒకటి అనుసంధానించే నరాలు, రక్త నాళాలు. శరీరం అంతటా వ్యాపించి ఉంటాయి. శరరంలోని అవయవాలు ఒకదానితో ఒకటి లింక్ అవ్వడం వల్ల ఒకదాని ప్రభావం మరొకదానిపై ఉంటుంది. మన శరీరంలోని 300 కంటే ఎక్కువ ఆక్యుప్రెషర్ పాయింట్లలో, 30 కంటే ఎక్కువ చేతులపైనే ఉన్నాయి. ఈ ఆక్యుప్రెషర్ పాయింట్లకు మన గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్, జీర్ణవ్యవస్థతో సంబంధం ఉంటుంది. ఈ పాయింట్లను యాక్టివేట్ చేయడం వల్ల ఆ భాగాలను ఆరోగ్యంగా ఉంచవచ్చు. ఆయుర్వేదం ప్రకారం రోజూ 10 నుంచి15 నిమిషాలు చప్పట్లు కొడితే శరీరంలో ఉన్న ఏడు చక్రాలు యాక్టివేట్ అవుతాయి. ఈ చక్రాలు ఉత్తేజితమైతే ఆ వ్యక్తి ఏకాగ్రత, సామర్థ్యం పెరుగుతాయి. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.
గుండె, జ్ఞాపకశక్తి కి మేలు చేస్తుంది…
చప్పట్లు కొట్టడం వల్ల రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మనం చప్పట్లు కొడితే అరచేతులు వేడెక్కుతాయి, శరీరమంతా రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండె కండరాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది, గుండె సమస్యలను నివారిస్తుంది. చప్పట్లు శ్వాసకో సమస్యలను దూరం చేస్తాయి. ఈ క్లాపింగ్ థెరపీని పెద్దలు మాత్రమే కాకుండా పిల్లలు కూడా ఫాలో అవ్వచ్చు. చప్పట్లు కొట్టడం వల్ల పిల్లల్లో జ్ఞాన సామర్థ్యాలు పెరగడంతో పాటు జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
నడుము నొప్పి, జుట్టు రాలడం తగ్గుతుంది…
ఈ సమస్యతో బాధపడేవారికి క్లాపింగ్ థెరపీ మంచి రిజల్ట్స్ ఇస్తుంది. మనం చప్పట్లు కొట్టినప్పుడు తుంటి కండరాలకు అనుసంధానంగా ఉన్న ఆక్యుప్రెషర్ పాయింట్లను స్టిమ్యూలేట్ చేస్తుంది. ఇది నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది. ఎముక సంబంధిత సమస్యలకు మంచి పరిష్కారం అందిస్తుంది. చప్పట్లు కొడితే జుట్టు సంబంధిత సమస్యలూ నయం అవుతాయి. చప్పట్లు మన శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇది జుట్టు కుదుళ్లలో రక్త ప్రవాహాన్ని కూడా ప్రేరేపిస్తుంది. జుట్టు రాలే సమస్యను దూరం చేసి హెయిర్ గ్రోత్‌ను ప్రేరేపిస్తుంది.
చప్పట్లు ఇలా కొట్టండి… Clapping Therapy
సింపుల్ గా చప్పట్లు కొట్టినా మంచిదే కానీ అదనపు ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి క్లాపింగ్ థెరపీని సరిగ్గా చేయడం మంచిది. ముందుగా మీ అరచేతులకి కొద్దిగా కొబ్బరి నూనె అప్లై చేసుకోండి. ఇది చప్పట్లు కొట్టేప్పుడు వేడిని పూల్చుకుంటుంది. శక్తి తరంగాలు శరీరం నుంచి బయటకు వెళ్లకుండా నిరోధించడానికి పాదాలకు సాక్స్ , మృదువైన బూట్లు ధరించండి.పద్మాసనం, వజ్రాసనంలో కూర్చోండి. రెండు చేతులను రిలాక్స్ డ్ గా , నిటారుగా ఉంచి చేతులు కొట్టండి. మంచి రిజల్ట్స్ కోసం మీరు ప్రతి రోజూ ఉదయం 20-30 నిమిషాల పాటు క్లాపింగ్ థెరపీ ప్రాక్సిస్ చేయవచ్చు.