Cold Bath
శీతాకాలం వచ్చేసింది. అన్ని కాలాలు వేరు..శీతాకాలం వేరు.. ఎండాకాలం, వర్షకాలంలో ఎలా ఉన్నా కానీ శీతాకాలంలో మాత్రం చర్మం పరంగా, ఆరోగ్యం పరంగా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సాధారణంగా చాలా వరకు శీతాకాలంలో స్నానం చేయడానికి మోగ్గుచూపరు. ఈ సీజన్ లో స్నానం చేయడానికి ఎక్కువ మంది వేడి నీటిని ఉపయోగిస్తారు. అదే విధంగా చల్లటి నీటితో స్నానం చేసేవారు కూడా చాలా మందే ఉన్నారు. స్నానం చేస్తే మంచి రిలాక్సేషన్ దొరుకుతుంది. చిరాకు పోయి మనసుకి హాయిగా ఉంటుంది. అయితే చలికాలంలో చన్నీటి స్నానం మంచిదా! లేక వేడి నీటి స్నానం మంచిదా! అనే డౌట్ అందరిలోనూ ఉంటుంది. శీతాకాలంలో ఏ నీటితో స్నానం చేయడం మంచిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం…
చలికాలంలో చల్లని నీటితో స్నానం చేస్తే… Cold Bath
చన్నీటితో స్నానం చేయడం వల్ల నరాలు ఉత్తేజమవుతాయి. మన శరీరానికి కూడా శక్తిని అందిస్తుంది. డిప్రెషన్ నుండి బయటపడటానికి కూడా చల్లటి నీరు ఎంతో సహయపడుతుంది. ఊపిరితిత్తుల పనితీరుని మెరుగుపరచడంలో కూడా సహయపడుతుంది. చనిల్ల స్నానంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ పోరాట కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. శీతాకాలంలో చన్నీటితో స్నానం చేయడం వల్ల బాడీలో వాతన అనేది పెరుగుతుంది. దీని వల్ల శరీర నోప్పులు, కండరాల నోప్పులు, చర్మం పొడి బారడం,బలహీనమైన జీర్ణక్రియ వంటి సమస్యలు ఎదురవుతాయి. కానీ క్రమం తప్పకుండా చన్నిటి స్నానం చేసేవారు శీతాకాలంలో కూడా చన్నీటి స్నానం మంచిదే అని వైధ్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరానికి ఎటువంటి భంగం కలిగించదు. చన్నీటి స్నానం చేయడం వల్ల బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది. మరియు తెల్ల రక్త కణాలు అధిక శాతం ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
చలికాలంలో వేడి నీటితో స్నానం చేస్తే…
వేడి నీటితో స్నానం చేయడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. వీటిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల చర్మంపై క్రిములను చంపుతుంది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. అంతేకాకుండా ఒళ్లు నోప్పులు మరియు కండరాల నోప్పులు, ఒత్తిడిని తగ్గిస్తాయి. గొంతు కండారాలను సడలించడం ద్వారా జలుబు, శ్వాశకోశ వ్యాధులు తగ్గుతాయి. గొంతు, ముక్కు తెరవడంలో సహయపడుతుంది. అంతేకాకుండా వేడి నీటి స్నానం మధుమేహం ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ సీజన్ లో వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీర వాతాన్ని తగ్గిస్తుంది. మరియు చలి తీవ్రతను కూడా తగ్గిస్తుంది.
శీతాకాలంలో ఏ నీటితో స్నానం ఉత్తమం…
ఎక్కువ శాతం శీతాకాలంలో వేడి నీటితో స్నానం చేయడం ఉత్తమం. చలికాలంలో యువత చల్లని నీటితోనూ, వృద్ధులు వేడి నీటితోనూ స్నానం చేయాలని ఆయుర్వేదం సూచిస్తుంది. మన శరీరాన్ని బట్టి స్నానం చేయడానికి చల్లటి నీటిని ఉపమోగించడం మంచిది. శరీరం చల్లటి నీటితో స్నానం చేస్తే ఆయాసం, ఉబ్బరం వంటివి కలిగిపనప్పుడు వేడి నీటిని ఉపయోగించడం మంచిది. అజీర్ణం మరియు కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు చల్లటి నీటితో స్నానం చేయకండి. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు వేడి నీటి స్నానం చేయడం మంచిది. అయితే ఏ కాలంలో అయినా చల్లనీరు వేడినీరు కన్నా కూడా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిదని వైధ్య నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా శరీర ఉష్ణోగ్రతని కూడా కాపాడుకోవచ్చని చెబుతున్నారు.