ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహ దేశంలో అనేక రాష్ట్రాలలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలంలో సాధారణంగా సీజనల్ వ్యాధులు రావడం సహజం. జలుబు, గొంతు నొప్పి, జ్వరాలు ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ఇవే పెద్ద సమస్య అనుకుంటే కళ్ళకలక కూడా మరో పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది వర్షాకాలంలో గాలిలోని తేమ ఎక్కువగా ఉండడంతో ఈ బ్యాక్టీరియా కళ్ళను ప్రభావితం చేస్తుంది. దీనిని “ఐ ఫ్లూ”అంటారు వైద్య భాషలో కంజక్టివైటిస్ అని కూడా ఈ ఐ ఫ్లూ సోకిన వారి కళ్ళు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతాయి కళ్ళు గులాబీ రంగులోకి మారడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ ని “పింక్ ఐ” అని కూడా అంటారు.
కళ్ళ కలక లక్షణాలు
- కళ్ళలో మంట
- కంటి నుంచి నీరు కారడం
- నిద్రలేచేసరికి రెప్పలు అతుక్కుపోవడం
- కళ్ళు ఎర్రబడటం
- కళ్ళు దురదగా ఉండటం
- కన్ను రెప్పల్లో వాపు
- కంటి నుంచి నీరు కారడం
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తపడాలి. ఎందుకంటే ఇది చిన్నపాటి ఇన్ఫెక్షన్ అనిపిస్తుందే కానీ ఇది రోజువారి జీవితాన్ని తీవ్రంగా ప్రభావం చేస్తుంది, ఏ పని చేసుకోనివ్వదు.
కళ్ళ కలకలు ఎందుకు వస్తాయి?
అసలు కళ్ళ కలకలు ఎందుకు వస్తాయంటే గాలి ద్వారా సోకే ఈ బ్యాక్టీరియా వర్షాకాల వాతావరణంలో మురికి కాలుష్య కాలు పెరగడం వల్ల వస్తుంది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో ప్రజలు కళ్ల కళకళతో బాధపడుతున్నారు ఈ సమస్య మందులు వాడకపోయినా కొంతమందికి తగ్గిపోతుంది. ఇది ఇతరులకు త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న కారణంగా ఈ ఐ ఫ్లూ వచ్చిన వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా దీని నుండి ఉపశమనం లభిస్తుంది.
ఎలా వ్యాపిస్తుంది?
ఈ పింక్ అయి వచ్చినవారు సాధారణంగానే కళ్ళలో మంటతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ కళ్ళతో మంట వల్ల కళ్ళ నుంచి నీళ్లు కారడం ఆ నీటిని తుడుచుకొని అదే చేతులతో ఏదైనా వస్తువులను పట్టుకుంటే వాటిని మళ్లీ పట్టుకున్న వారికి ఈ వైరస్ కచ్చితంగా వ్యాపిస్తుంది అలాగే ఐ ఫ్లూ ఉన్నవారికి అత్యంత సమీపంలో ఉన్నప్పుడు కూడా ఈ వైరస్ ఒకే అవకాశం ఉంటుంది ఐ ఫ్లూ సోకిన వారు ఉపయోగించిన టవళ్లను ఇతరులు వాడిన వైరస్ వారికి వ్యాపిస్తుంది.
జాగ్రత్తలు
సాధారణంగా కొంతమందికి ఇవి రెండు వారాలలో వాటంత అవే పూర్తిగా తగ్గిపోతాయి. ఈ ఐఫ్లు కి వైద్యులు చుక్కల మందులు కూడా ఇస్తారు అదే కాకుండా మన ఇంటిలోని వస్తువులతోనే మనం ఈ ఫ్లూ ని ఈ ఇన్ఫెక్షన్ ని తగ్గించుకోవచ్చు . అది ఎలా అంటే..
- ఈ ఐఫ్లు వచ్చినవారు కంటిని తరచూ మంచినీళ్ల తో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది.
- ఈ ఫ్లూ వచ్చిన వారు మిగతా వారికి దూరంగా ఉండాలి వాళ్ళు వాడే వస్తువులు కూడా ఇతరులు వాడకూడదు.
- చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే కళ్ళను తాకాలి సబ్బు నీటితో తరచూ చేతులు కడుక్కోవాలి.
- కళ్ళు ఎక్కువగా దురదగా అనిపిస్తే పదేపదే నులమకూడదు.
- నీళ్లను కాచి చల్లార్చి అందులో ఒక కర్చీఫ్ ని గాని దూదిని గాని ఆ నీటిలో ముంచి కళ్ళను వీలైనంత నెమ్మదిగా సున్నితంగా శుభ్రం చేసుకోవాలి.
- ఈ ఐ ఫ్లూ త్వరగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి కనుక తగ్గేవరకు కళ్ళు జోడు ఉపయోగించాలి
ఇవన్నీ చేసినా ఇబ్బంది తగ్గకపోతే కచ్చితంగా డాక్టర్ను సంప్రదించాలి