Marriage wibes
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట త్వరలో పెళ్లి వేడుకలు జరగబోతున్నాయి. నవంబర్ 30న దిల్ రాజ్ ఇంట నిశ్చితార్థం వేడుక జరిగింది. దిల్ రాజ్ సోదరుడు ప్రొడ్యూసర్ శిరీష్ కొడుకు హీరో ఆశిష్ రెడ్డి నిశ్చితార్థం హైదరాబాద్ లోని వారి నివాసంలో అంగరంగ వైభవంగా జరిగింది.
దిల్ రాజ్ కోడలిగా అద్విత రెడ్డి
ఆశీష్ రెడ్డి త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఏపికి చెందిన అద్విత రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు ఈ యువ హీరో. ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. అద్విత రెడ్డి ఒక బిజినెస్ మేన్ కుతూరు అని సమాచారం. లైట్ గ్రీన్ కలర్ షేర్వాణీలో ఆశిష్, లైట్ గ్రీన్ కలర్ లెహంగాలో అద్విత ఎంతో అందంగా చూడ చక్కగా కనిపించారు. వీరి ఎంగేజ్ మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు ఒకే కలర్ దుస్తులలో అందరిని ఆకట్టుకున్నారు. ఇక ఈ కొత్త జంటకి ఇండస్ట్రీ వాళ్లు, ప్రేక్షకులు అభినందనలు చెబుతున్నారు.
సడన్ గా నిశ్చితార్థం చేసుకున్న ఆశీష్Marriage wibes
ఈ మధ్యకాలంలోనే దిల్ రాజ్ ఇంట పెళ్లి బజాలు మోగబోతున్నాయని వార్తలు వచ్చాయి…. కానీ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. ఫ్యాన్స్ మాత్రం ఆశిష్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు అని అతృతగా ఎదురు చూశారు. కానీ నవంబర్ 30న సడన్ గా ఆశిష్ ఎంగేజ్ మెంట్ చేసుకొని ఫోటోలను షేర్ చేశారు. సడన్ గా డేట్ కూడా బయటకు రివీల్ చేయకుండా దిల్ రాజ్ ఏర్పాటు చేసి అందిరికి ఆశ్చర్యనికి గురిచేశాడు
ఆశిష్ రెడ్డి మూవీస్
దిల్ రాజ్ వారసుడిగా సిని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆశిష్ రెడ్డి. రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. హీరోగా మొదటి సినిమా నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నాడు ఈ యువ హీరో. ఇక ముందుకు సెల్ఫిష్ అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ లో ఆశిష్ సరికొత్త లుక్ లో కనిపించాడు. రౌడి లుక్ తో అందరిని ఆకట్టుకుంటున్నాడు. కాశీ విశాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
మూడో సినిమాతో మన ముందుకు Marriage wibes
ఆశిష్ మూడో సినిమాకు అరుణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిచనున్నాడట.పీ సీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫీ చేయబోతున్నాడట. హార్రర్, కామెడీ, లవ్ జానర్ లో ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందట.
సిని ఇండస్ట్రీలో దిల్ రాజ్ వారసుడిగా ఆశిష్ కొనసాగుతాడా?
దిల్ రాజ్ రెండు పెళ్లిలు చేసుకున్నారు.. మొదట భార్యకు ఒక కుమారై హర్షిత రెడ్డి పుట్టింది. తనకి 2014 లో దిల్ రాజ్ పెళ్లి చేశాడు. మొదటి భార్య చనిపోవడంతో ఈ మధ్యనే రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అన్విరెడ్డి అనే చిన్నారి సంతానం. నటన పరంగా శిరీష్ కొడుకు ఆశిష్ దిల్ రాజు వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. సొంత కొడుకు అన్విరెడ్డి పెద్దయి హీరోగా అడుగు పెడితే సోదరుడి కొడుకు ఆశిష్ వారసుడుగా కొనసాగుతాడా లేదా చూడాలి.