ప్రస్తుత రోజుల్లో అందరినీ కలవర పెట్టే సమస్య స్థూలకాయం, స్థూలకాయం వల్ల వచ్చే సమస్యలు అన్ని ఇన్ని కావు మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లిన ముందుగా వారు ఇచ్చే సలహా బరువు తగ్గమని, స్థూలకాయానికి దూరంగా ఉండమని. అందుకోసం చాలా మంది డైటింగ్ లని, ఎక్సర్సైజ్లని, చాలానే చేస్తుంటారు. బరువు తగ్గడానికి ఏవేవో చిట్కాలు పాటిస్తుంటారు.
అలాంటి వారి కోసం ఈ “వాటర్ ఫాస్టింగ్” ఎంతో ఉపయోగపడుతుంది. రోజుల తరబడి తిండి తినకుండా కేవలం నీళ్లు మాత్రమే తాగుతూ మనం జీవించగలమా? ఫుడ్ లవర్స్ కు ఇది అసాధ్యం అని చెప్పాలి కానీ ప్రెసెంట్ ట్రెండ్ గా మారుతుంది “వాటర్ ఫాస్టింగ్”. వాటర్ ఫాస్టింగ్ గురించి మీది వరకు ఎప్పుడైనా విన్నారా? కష్టమైన ఎక్ససైజులు , గంటలు తరబడి వాకింగ్ లు జాగింగ్ లు, వెయిట్ లిఫ్టింగ్ లు, రుచి పచీ లేని వంటలు డైటింగ్ పేరుతో తినడాలు వీటన్నిటికంటే ఈ వాటర్ ఫాస్టింగ్ బరువు తగ్గడానికి సులభమైన మార్గమని నిపుణులు చెప్తున్నారు.
చికాగో లోని యూనివర్సిటీ ఆఫ్ ఇలినోయిస్ నుండి న్యూట్రిషన్ రివ్యూస్ లో ప్రచురించబడిన తాజా అధ్యయనం కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తోంది. అయితే ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో దుష్ప్రభావాలు కూడా అన్నీ ఉన్నాయని చెప్తున్నారు. ఇంతకీ వాటర్ ఫాస్టింగ్ అంటే ఏంటి ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందం
ఈ మధ్యకాలంలో ఉపవాసం చేస్తున్న వారి సంఖ్య చాలానే పెరిగింది ఉపవాసం. మన అందరికీ తెలిసిన ఉపవాసం ఏంటంటే పొద్దున ఫోటో బ్రేక్ ఫాస్ట్ తినకుండా ఆ మధ్యాహ్నం భోజనం రాత్రి ఏదైనా అల్పాహారం. ఇదే కాకుండా ఇంటర్ మినిట్ ఫాస్టింగ్ అని కూడా కొంతమంది ఈ మధ్యకాలంలో మొదలుపెట్టారు. ఫాస్టింగ్ లో ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి కీటోజ్ ఎందుకు డైట్ అని క్యాలరీస్ రెస్ట్రిక్షన్ డైట్ అని వాటర్ ఫాస్టింగ్ అని అనేక రకాల డైట్ ఇప్పుడు వచ్చేసాయి ఉపవాసం అంటే కొన్ని ఆహారాలు తినకూడదని లేదా తాగకూడదని ఎంచుకోవడం లేదా అన్ని ఆహార పానీయాలకు దూరంగా ఉండటం ఈ వాటర్ ఫాస్టింగ్ అనేది ముఖ్యంగా ఆహారం తీసుకోకుండా ఉండటాన్ని నిర్ణిత రోజులపాటు నీటిని మాత్రమే ఉపయోగించడాన్ని సూచిస్తుంది
వాటర్ ఫాస్టింగ్ ప్రయోజనాలు
ఉపవాసం లేదా ఫాస్టింగ్ చేసే వాళ్లలో మనం గమనించే మార్పు బరువు తగ్గడం మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం నిర్దిష్ట సమయం వరకు ఆహారం తీసుకోకుండా ఉండటం వలన సహజంగా తక్కువ క్యాలరీలను తీసుకోవడం ద్వారా బరువు తగ్గడం జరుగుతుంది. శరీరానికి మనం బయట నుంచి ఎటువంటి ఆహారం తీసుకోము కాబట్టి మన శరీరానికి కావలసిన శక్తిని మన శరీరంలోని నిలువ చేయబడిన కాయబోహైడ్రేట్లను కొవ్వు వంటి నిలువ చేయబడిన శక్తిని ఉపయోగించుకోవడం ప్రారంభిస్తుంది అలా వాటర్ ఫాస్టింగ్ టైం లో బరువు తగ్గడానికి దారితీస్తుంది. శరీరంలోని ఈ కార్బోహైడ్రేడ్లన్నీ అయిపోయినప్పుడు మన శరీరం కొవ్వు కణాలను విచ్చిన్నం చేసే ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఇవి శరీరానికి ఇంద్రంగా పనిచేసే శక్తిగా పనిచేస్తాయి తద్వారా వాటర్ ఫాస్టింగ్ బరువు తగ్గడానికి దోహదపడతాయి
వాటర్ ఫాస్టింగ్ దుష్ప్రభావాలు
ఫాస్టింగ్ సమయం లో చాలా కాలం పాటు తగినంత మొత్తంలో నీటిని తీసుకోకపోవడం వలన శరీరం డిహైడ్రేషన్కు గురవుతుంది జీర్ణ ప్రక్రియ ప్రసరణ ఉష్ణోగ్రత నియంత్రణలతో సహా వివిధ శారీరక వ్యవస్థల పనితీరుకు సరైన హైడ్రేషన్ చాలా ముఖ్యం కాబట్టి ప్రతిరోజు రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగాలి ఇలా బాడీని హైడ్రేటెడ్ గా ఉండడం ద్వారా ఆకలి తీవ్రతను తగ్గిస్తుంది అలాగే ఉపవాసానికి కట్టుబడి ఉండడం కూడా సులభం అవుతుంది.
1. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత
వాటర్ ఫాస్టింగ్ చేయడం వలన మన శరీరంలోని పొటాషియం సోడియం తగ్గుముఖం పడతాయి ఇవి శరీరంలోని వివిధ సమస్యలకు దారితీస్తుంది అందుకే వైద్య నిపుణుల సూచనలు చాలా అవసరం
2. హైపోవోలేమియా
సుదీర్ఘ వాటర్ ఫాస్టింగ్ వలన ఎదురయ్యే మరో సమస్య హైపోవలేమియా. ఇది రక్తప్రసరణ మీద ప్రభావం చూపుతుంది దాని వలన అవయవాలకు ఆక్సిజన్ పోషకాల పంపిణీలో శరీర సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది బలహీనమైన పనితీరుకు దారితీస్తుంది దీంతో మైకం కూడా అనిపించవచ్చు.
ఇలా సులభమైన మార్గంలో బరువు తగ్గాలని ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రయత్నాలు మానుకోమని చెప్తున్నారు వైద్యులు బరువు తగ్గడం అనేది ఒకరోజు రెండు రోజులు లేదా వారంలోను జరిగే ప్రక్రియ కాదని అందుకు సుదీర్ఘంగా ప్రయత్నించాలని వాటికి కొన్ని నియమాలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
బరువు తగ్గడం ఎలా?
1.పౌష్టికాహారం
పౌష్టికాహారం తీసుకోవాలి అంటే పండ్లు కూరగాయలు ప్రోటీన్లు ఆరోగ్యకరమైన కొవ్వు వంటి హెల్తీ అండ్ అన్ ప్రాసెస్డ్ ఫుడ్ తో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి.
2. వ్యాయామం
మనం తిన్న ఆహారం మన శరీరంలోకి క్యాలరీల రూపంలో మనకు శక్తిని ఇస్తుంది ఈ క్యాలరీని బర్న్ చేయడానికి జీవన క్రియను పెంచడానికి నడక జాగింగ్ స్విమ్మింగ్ జిమ్ వంటి వ్యాయామాలు చేయాలి
3. లైఫ్ స్టైల్
పైవన్నీటితో పాటు లైఫ్ స్టైల్ మార్పులు కూడా చాలా ముఖ్యం క్యాలరీల ప్రకారం తినడం , ఒత్తిడి నియంత్రించుకోవడం తగినంత నిద్రపోవడం తో ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం తద్వారా బరువు తగ్గడానికి దీర్ఘకాలం ప్రయోజనాలు పొందడానికి సహాయపడతాయి