సినీ ఫైనాన్షియర్ అరెస్టుతో కలకలం
హైదరాబాద్ నగరంలో మళ్లీ డ్రగ్స్ (Drugs) కలకలం రేగుతోంది. అది సినిమా ఇండస్ట్రీకి లింకయి ఉండటం వల్ల మరోసారి సంచలనంగా మారింది. రెండు రోజుల క్రితం సినీరంగంలో నిర్మాతగా చెబుతున్న ఫైనాన్షియర్ వెంకటరత్నా రెడ్డిని ఈ కేసులో అరెస్టు చేయడంతో మళ్లీ సినిమా ఇండస్ట్రీతో డ్రగ్స్ లింకుల వ్యవహారం బయటపడింది.
వెంకట రత్నా రెడ్డి బయటనుంచి డ్రగ్స్ కొనుగోలు చేయడం ,పార్టీలు నిర్వహించి వాటిని విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతగాడితో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసకున్నారు.వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితుల ఫోన్లను పరిశీలించగా బెంగళూరు కేంద్రంగా ఈ నెట్ వర్క్ సాగుతోందని వీరికి నైజీరియన్లతో లింకులున్నాయనీ తేలింది.
మరో నిందితుడు బాలాజీ నేరుగా సినీమా ఇండస్ట్రీలోనే పలువురికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది.
ఈ ఏడాది జూన్ లోనే కబాలి తెలుగు సినిమా నిర్మాత కే.పీచౌదరి అరెస్టవడం,అతనితో ఇండస్ట్రీకి ఉన్న లింకుల రీత్యా మళ్లీ ఇండస్ట్రీపై అందరి ద్రుష్టి పడింది.
గుట్టుగా సాగుతున్న సరఫరా (Drugs)
డ్రగ్స్ కేసులో నిందితుడు బాలాజీ చాలాకాలంగా పరిశ్రమలో ముఖ్యమైన వారికి సరఫరాచేస్తున్నాడని దర్యాప్తు లో తేలింది.
ఎవరెవరికి ఈ డ్రగ్స్ అందుతున్నాయన్న దానిపై ఒక జాబితా కూడా తయారు చేశారు. నిందితుల కాల్ డేటాను విశ్లేషిస్తే మరింత మంది కొత్తవారి పేర్లు బయటకు వచ్చే అవకాశముంది.
డ్రగ్స్ తో పాటు వ్యభిచారం కూడా.. (Drugs)
ఇక నిర్మాత వెంకటరత్నారెడ్డి డ్రగ్స్ (Drugs) మాత్రమే కాకుండా వ్యభిచార ముఠాలను కూడా నిర్వహించి రేవ్ పార్టీలకు యువతులను రప్పించే వాడని తెలుస్తోంది.సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూసే అమాయక యువతులను నగరానికి రప్పించి వారికి డ్రగ్స్ అలవాటు చేశాడని తెలుస్తోంది.
అంతేకాదు వారిని సరఫరా దారులుగా మార్చడం, వ్యభిచార కూపంలోకి దింపడం లాంటివి చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది.
వెంకట రత్నా రెడ్డి అరెస్టు తో చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులు ఉలిక్కి పడినట్లు సమాచారం.
రేవ్ పార్టీ సమాచారంతోనే..
హైదరాబాద్ మాదాపూర్ లోని విఠల్ రావ్ నగర్ లోని ఫ్రెష్ లివింగ్ అపార్టుమెంటులో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆ అపార్టు మెంటుపై దాడులు జరపడంతో మొత్తం వ్యవహారం బయట పడింది.
ఢిల్లీ, రాజస్థాన్ లకు చెందిన కొందరు యువతులను పోలీసులు ఈపార్టీ లో గుర్తించారు.
తెలుగులో అనేక సినిమాలకు పెట్టుబడులు పెట్టిన వెంకటరత్నారెడ్డి రేవ్ పార్టీ పేరుతో వ్యభిచారాన్ని,డ్రగ్స్ అమ్మకాన్ని కొనసాగిస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు గుర్తించారు.
డ్రగ్స్ మాఫియాతో వెంకట రత్నా రెడ్డికి సంబంధాలున్నాయని గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ ను గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నాడనీ తేలింది.
కేవలం డ్రగ్స్ మాత్రమే కాకుండా గంజాయితోపాటు మరిన్ని వేర్వేరు మాదక ద్రవ్యాలను సినీ రంగ ప్రముఖులు, వాణిజ్యరంగానికి చెందిన వారికీ పార్టీల ద్వారా సరఫరా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
మాదాపూర్ దాడిలో 15 గ్రాముల ఎండిఎంఏ, 30 ఎల్ ఎస్టీ పిల్స్ తో పాటుగా గంజాయి ప్యాకెట్లు కూడా రేవ్ పార్టీ ప్రదేశంలో దొరికాయి.
గతంలో డ్రగ్స్ (Drugs) విక్రయదారుడు కెల్విన్ అరెస్టుతో సినీ ఇండస్ట్రీ తో డ్రగ్ మాఫియాలింకులు బయటపడ్డాయి.
నెలల తరబడి జరిగిన విచారణ ఆ తర్వాత కేసు మూసివేసేందుకు దారితీసింది. ఇండస్ట్రీ ప్రముఖులను విచారించడం మినహా మరే చర్యలూ తీసుకోలేదు.
ఈ కేసును విచారించిన అకున్ సబర్వాల్ ఆ తర్వాత మరో పదవిలోకి మారిపోయారు.
అక్కడితో డ్రగ్స్ విచారణ ముగిసినట్లే అనుకున్నారంతా.. కానీ ఇప్పుడు ఫైనాన్షియర్ వెంకట రత్నా రెడ్డి అరెస్టుతో మళ్లీ టాలీవుడ్ లో కలకలం రేగుతోంది.