Dry Ginger
శొంఠి.. దీని గురించి తెలియనివారుండరు. ఈ భూమి మీద అతి విలువైన, అనేక రోగాలను నియంత్రించగల మహా మూలికలలో శొంఠి అనేది ఒకటి. ఎటువంటి అనారోగ్య సమస్యనైనా ఈజీగా నయం చేయడంలో ఎంతగానో సహయపడుతుంది. పురాతన కాలం ఆయుర్వేదంలో శొంఠిని విరివిగా వాడేవారు. దీనిని విశ్వభేజనం అని కూడా అంటారు. దీనిలోని అపూర్వమైన గుణాలను తెలుసుకున్న మన మహర్షులు దీని శక్తికి ఆశ్చర్యపోయి దీనికి మహా ఓషధి అని అర్థం వచ్చేటట్లుగా విశ్వభేజనం అని నామకరణం చేశారు. పచ్చి అల్లంను పాలల్లో కాని, సున్నపు నీళ్లల్లో కాని ఉడక బెట్టి ఆ తరువాత ఎండబెడతారు. దాంతో శొంఠి కొమ్ములు తయారవుతాయి.
ఎటువంటి అనారోగ్య సమస్యయినా క్షణాల్లో మటుమాయం.. Dry Ginger
చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఈ శొంఠి ఎంతో ఉపయోగపడుతుంది. పాలలో శొంఠి పొడి వేసుకుని మరిగించి తీసుకుంటే జలుబు, ముక్కు పట్టడం, దగ్గు అంతేకాకుండా గొంతు నొప్పి, కఫ వాతం పైత్యం వంటి వాటిని చక్కగా తగ్గిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని వృద్ధి చేయడానికి ఎంతగానో సహయపడుతుంది. పరగడుపున నీళ్లల్లో శొంఠి పొడి కలిపి మరగించి అర స్పూన్ తేనె కలిపి తాగితే అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. మరియు ఆకలి కూడా పెరుగుతుంది. మూత్రపిండ సమస్యలను కూడా తగ్గిస్తుంది. పురుషులకు వీర్యవృద్ధి చేస్తుంది.
చర్మ సమస్యలకు కూడా చెక్ పెట్టోచ్చు..
శొంఠిపొడిని పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల శరీరంపై వచ్చే ఎలర్జీలు వాటి వల్ల వచ్చే దద్దురులు, బెందులు ,దురద తగ్గుతాయి. ఈ పొడిని నీళ్లతో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లు కూడా వెంటనే తగ్గిపోతాయి. అంతే కాకుండా క్యాన్సర్ రాకుండా మన శరీరాన్ని రక్షించడానికి ఎంతగానో సహాయపడుతుంది. అండాశయ పేగుల్లో వచ్చే క్యాన్సర్ ను తగ్గించే లక్షణాలు శొంఠి లో ఎక్కువగా ఉన్నాయి. శొంఠి శరీరంలో క్యాన్సర్ కణాలను వృద్ధిని నిరోధిస్తుంది. దీనితో కండరాల నొప్పులు వంటి సమస్యలను తగ్గిస్తుంది. నీళ్లలో అరగదీసి కణతలకు, తలకు పట్టించడం వల్ల భరించలేని తలనొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. అలాగే మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు శొంఠి పొడిని తాటి బెల్లం కలిపి తీసుకుంటే ఉపశమనం పొందడానికి ఎంతో మేలు చేస్తుంది. Dry Ginger
ప్రతిరోజు అర టీ స్ఫూన్.. అన్ని సమస్యలు దూరం.. Dry Ginger
ఉదయాన్నే ఒక గ్లాస్ నీళ్లలో అర టీ స్పూన్ శొంఠిపొడి, తేనె కలిపి మరిగించి పరగడుపున తాగడం వల్ల అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంచుకోవచ్చు. కడుపులో గ్యాస్ ఎక్కువైనపుడు గుండెలో నొప్పి వస్తుంది. ఈ సమస్య కోసం అర చెంచా శొంఠిపొడిని ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే గ్యాస్ తగ్గిపోయి గుండెనొప్పి నుండి ఉపశమనం దొరుకుతుంది. జాయింట్లలో వాపు వచ్చి విపరీతమైన నొప్పితో బాధపడేవారు దోరగా వేయించిన శొంఠి పొడి అర చెంచా మోతాదులో తీసుకుని చెరకు రసంలో కలిపి సేవిస్తూ ఉంటే ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది. అలాంటి వారు దోరగా వేయించిన శొంఠి 50గ్రా, పాతబెల్లం 100గ్రా కలిపి మెత్తగా దంచి నిలువ ఉంచుకుని రోజూ రెండు పూటలా 5గ్రా మోతాదుతో సేవిస్తూ వస్తే కడుపులో మందాన్ని హరించివేసి మంచిగా ఆకలి పుట్టేలా చేస్తుంది. నడుం నొప్పి ఉన్నవాళ్లు రోజు రాత్రిపూట నిద్రపోయేముందు చిటికెడు శొంఠిని ఒక చెంచా వంట ఆముదంతో కలిపి తీసుకుంటే నడుము నొప్పులు, పక్కటెముకల నొప్పులు తగ్గిపోతాయి. ఇంటువంటి ఎన్నో సమస్యలకు శొంఠి దివ్యఔషధంగా పనిచేస్తుంది. Dry Ginger