మెగాస్టార్ చిరంజీవికి మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు కౌంటర్ ఇచ్చారు. చిత్రసీమలో చాలా మంది పకోడిగాళ్లున్నారని, వారితో పాటు తమ్ముడికి కూడా సలహాలు ఇవ్వొచ్చు కదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం సంగతి మీకెందుకు అని ఆయన నిలదీశారు. వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో చిరంజీవి ఏపీ ప్రభుత్వం చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ప్రభుత్వం ఎలా ఉండాలో వారు సలహాలిస్తున్నారంటూ మండిపడ్డారు. పకోడి గాళ్లు సలహాలు తన వాళ్లకు ఇవ్వొచ్చు కదా? అని అన్నారు.
తమ వాళ్లకు సలహాలు…
తమ వాళ్లకు రాజకీయాలు ఎందుకు ఫైట్లు, డ్యాన్స్‌లు మనం చూసుకుందామని చెప్పొచ్చు కదా? అని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ప్రతి ఒక్కరూ హైదరాబాద్‌లో ఉంటూ అక్కడ పన్నులు కడుతూ ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించేవారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మరో మాజీ మంత్రి పేర్ని నాని కూడా చిరంజీవి వ్యాఖ్యలను తప్పుపట్టారు. తాను చిరంజీవి అభిమానినేనని, కానీ తమ ప్రభుత్వం నెగిటివ్ కామెంట్స్ చేస్తే ఊరుకుంటామా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉంటూ ఏపీపై ప్రేమ ఎందుకు చూపించడం అంటూ ఆయన అన్నారు.