గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు సమీక్షించి ధరలు పెంచాలా? తగ్గించాలా? అన్న నిర్ణయాన్ని తీసుకుంటాయి. ఆగస్టు 1వ తేదీ కావడంతో చమురు సంస్థలు జరిపిన సమీక్షలో గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని నిర్ణయించాయి. దీంతో చమురు సంస్థలు గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పినట్లయింది.
కమర్షియల్ సిలిండర్ ….
అయితే వాణిజ్య సిలిండర్ ధరను మాత్రమే తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకన్నాయి. 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరపై దాదాపు వంద రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గాయి. దీనివల్ల వినియోగదారులకు కూడా ఉపయోగం కూడా ఉంటుందంటున్నారు. ప్రస్తుతం 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర 1,680 రూపాయలకు చేరుకుంది. గృహవినియోగానికి వాడే సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు ప్రకటించాయి.