సూపర్ టీజర్..
కన్నడలో పునీత్ రాజ్ కుమార్ ఎంత ఫేమస్ అనేది మనలో చాలామందికి తెలుసు. ఇతడి అన్న శివరాజ్ కుమార్ కూడా శాండల్ వుడ్ లో వన్ ఆఫ్ ది స్టార్ హీరో. ఆయన నటించిన సినిమానే ‘GHOST(ఘోస్ట్)’. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ కథతో తెరకెక్కనున్న ఈ చిత్ర టీజర్ ని శివన్న పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఆ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది . టీజర్ నెక్స్ట్ లెవల్లో ఉండగా.. బ్యాగ్రౌండ్ అదిరిపోయింది. ఈ టీజర్ తో సినిమాపై అంచనాల ను భారీ గ పెంచేససింది .
టీజర్లో ఎం ఉందంటే..?
ఓ పాడుబడిన భవనం లో ఓ వ్యక్తి ఉంటాడు . అతడు ప్రాణాలతో కావాలని వాయిస్ ఓవర్లో ఓ వ్యక్తి ఆర్డర్. అతడితో జాగ్రత్త అని గన్స్ తో ఉన్నవాళ్లకు హెచ్చరిక. అప్పుడు శివరాజ్ కుమార్ ఎంట్రీ. ఆయుధాలతో ఉన్న వాళ్లు తనని చుట్టుముట్టినా సరే స్టైల్ విస్కీతో పానిపూరీ తింటాడు. ఓ కర్రకి నిప్పి అంటించి దాంతో సిగరెట్ వెలిగిస్తాడు. దాన్ని వెనక్కి విసిరితే కవర్ కాలిపోయి వార్ ట్యాంకర్ బయటపడుతుంది. ‘మీరు గన్నుతో ఎంత మందిని భయపెట్టారో అంతకంటే ఎక్కువ మందిని నేను నా కళ్లతో భయపెట్టాను. దే కాల్ మీ ఓజీ… ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ అనే డైలాగ్ కూడా బాగుంది.
వేరే హీరో ఉంటే మాత్రం
టీజర్ లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని చాలా బాగున్నాయి . కాకపోతే హీరో శివరాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని హీరో అనే చెప్పవచ్చు . ఇలాంటి టీజర్ లో ప్రభాస్, అల్లు అర్జున్, యష్ లాంటి స్టార్ హీరోలు ఎవరైనా ఉండుంటే మాత్రం తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా కి బాగా ఆకర్షితులు అయ్యేవారు . థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీని దర్శకత్వం వహిస్తుండగా.. పొలిటికల్ లీడర్ సందేశ్ నాగరాజ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ దసరాకి థియేటర్లలోకి రాబోతుంది అంతే కాదు త్వరలో నే విడుదల డేట్‌ని ప్రకటించనుంది మూవీ టీం.