Gift
మెగా అభిమానులకు ఇక పూనకాలే. తన 68వ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ ల ను గిఫ్ట్ గా ఇచ్చారు. చిరు కొత్త సినిమా అప్ డేట్స్ తో పాటు.. తన ముద్దుల మనవరాలిని ఎత్తుకుని ఉన్న ఫోటో రిలీజ్ అయ్యాయి.. చిరు 156వ సినిమా పెద్ద కుమార్తె సుస్మిత ప్రొడ్యూసర్ గా చేస్తుండగా,డైరక్టర్ గా కల్యాణ్ కృష్ణ వ్యవహరిస్తారని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై బింబిసార డైరక్టర్ వశిష్ఠతో చిరంజీవి 157 వ సినిమా ఉండబోతోంది. చిరంజీవి కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్ పోస్టర్ మెగా అభిమానులలో ఆసక్తి పెంచుతోంది. పోస్టర్ లో భూమి, నీరు, అగ్ని,గాలి,ఆకాశం వంటి పంచభూతాలు,నక్షత్ర ఆకారపు మూలకంగా త్రిశూలాన్ని చూపించారు.
ఫాంటసీ మూవీ…
పోస్టర్ ని బట్టి అది సోషియో ఫాంటసీ మూవీనా అనే సందేహాలు రేగుతున్నాయి. 2003 లో తీసిన అంజి అనే సోషియో ఫాంటసీ మూవీ తర్వాత చిరు చేస్తున్న సోషియా ఫాంటసీ మూవీ ఇదే అవుతుంది.అంజి మూవీని ఎక్కువ టైమ్ తీసుకుని అత్యద్భుతమైన గ్రాఫిక్ వర్క్ తో తీసినా ఎందుకో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మరి ఈసారి తీసే సినిమా అయినా క్లిక్ అవుతుందా అన్నది చూడాలి.. చిరు సినిమా అంటేనే సినిమా హిట్, ఫ్లాప్ తో అభిమానులకు పని ఉండదు. మెగా స్టార్ బర్త్ డే రోజయిన ఈరోజే కొత్త సినిమాల అనౌన్స్ మెంట్ విని అభిమానులు ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు.
వేడుకగా… Gift
చిరు బర్త్ డే అంటేనే ఒక వేడుక.. అందుకే అభిమానులు ఆయన బర్త్ డే రోజునా రక్తదాన శిబిరాలు ఏర్పాటు, సేవా కార్యక్రమాలుకు పూనుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా సిల్వర్ స్క్రీన్ ను ఏలుతున్న చిరు ఇప్పటికీ యువ హీరోలకు పోటీనిస్తుండటం విశేషం. ఇక చిరు అభిమానులను మరింతగా సంతోషాన్నిచ్చింది చిరు మనవరాలు క్లీంకార తొలి ఫొటోను విడుదల చేయడం. తన పుట్టిన రోజు సందర్బంగా మనవరాలు క్లిన్ కారా కొణిదెలను పట్టుకొని ఉన్నలవ్ లీ పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ ఫీలయ్యారు. చిరంజీవి క్లీంకార కొణిదెలని తన చేతుల్లో పట్టుకున్నట్లుగా ఉన్న ఆ ఫొటోలో చిన్నారి ముఖాన్ని మాత్రం మాస్క్ చేశారు.
మనవరాలి విషెస్ …
చిరుతాతకు బర్త్ డే విషెస్ అంటూ ట్వీట్ తో కూడిన ఈ చిత్రాన్ని రామ్,ఉపాసన వాళ్ల ఇస్టాగ్రామ్ లో షేర్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా చిరంజీవికి బర్త్ డే విషెస్ చెబుతూ ఓ రేర్ పిక్ ను షేర్ చేశారు. చిరంజీవి కేక్ కోస్తుండగా, పక్కన చిన్నప్పటి పవన్ కల్యాణ్ ఫోటో అది.. ఇది కూడా మెగా అభిమానులు హ్యాపీ ఫీలయ్యేదే. ఇక వివాద రహితుడుగా పేరు పడటంతో రాజకీయ ప్రముఖులందరూ పార్టీలకతీతంగా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో నే అతి పెద్ద డిజాస్టర్ గా భోళా శంకర్ నిలిచింది. విడుదలైన మొదటిరోజు మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ రావడంతో సినిమా వస్తూళ్లు మందగించాయి. భోళాశంకర్ బడ్జెట్ రూ.90 కోట్లు కాగా అందులో చిరంజీవి ఒక్కడికే రెమ్యునరేషన్ కింద రూ.55 కోట్లు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. Gift