(cost)
బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేం. బంగారం పెరగడమే తప్పించి తగ్గడం తక్కువ సార్లు. ఇటీవల ఆ రికార్డును అధిగమిస్తూ బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. దాదాపు ఐదు రోజుల పాటు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ రెండు రోజుల నుంచి పెరుగుతున్నాయి. స్వల్పంగా పెరిగినా రానున్న కాలంలో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి స్వల్పంగా తగ్గినా రానున్న రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని జ్యుయలరీ దుకాణ యజమానులు కూడా చెబుతున్నారు. త్వరపడి కొనుగోలు చేయమని ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి.
ఎప్పుడూ డిమాండ్…
బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. దాని పేరే బంగారం. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులతో పాటు ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా -ఉక్రెయిన్ యుద్ధం, కేంద్ర ప్రభుత్వం దిగుమతులు తగ్గించడంతో బంగారం ధరలు పెరుగుతాయన్న అంచనాలు వినపడుతున్నాయి. దాదాపు వారం రోజుల పాటు స్థిరంగా కొనసాగిన పసిడి ధరలు గత రెండు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్నాయి. శ్రావణ మాసం కావడం, పెళ్లిళ్ల సీజన్ కూడా వస్తుండటంతో ధరలు మరింత పెరిగే అవకాశముందన్న నిపుణుల సూచనలతో కొనుగోళ్లు బాగా పెరిగాయి. వ్యాపారాలు కూడా గత కొద్ది రో్జుల నుంచి ఊపందుకున్నాయి.
శ్రావణమాసం కావడంతో… (cost)
ప్రస్తుతం శ్రావణమాసం నడుస్తుండటంతో కొనుగోళ్లు కూడా బాగా జరుగుతున్నాయి. వ్యాపారం కూడా గతం కంటే ఎక్కువగా జరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మహిళలు కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తుండటంతో బంగారం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. వ్యాపారులు కూడా సరికొత్త డిజైన్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. బంగారంతో పాటు వెండికి కూడా ఈ సీజన్ లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే జ్యుయలరీ దుకాణాల యాజమాన్యాలు ఆఫర్లు ఎక్కువగా ప్రకటిస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఈఎంఐల ద్వారా కూడా కొనుగోళ్లకు వెసులుబాటు ఉండటంతో కొనుగోళ్లు మరింత ఎక్కువయ్యాయి.
ధరలు పెరిగాయ్…
తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. పది గ్రాముల బంగారం పై అరవై రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై పదిహేను వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,200 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,130 రూపాయలుగా కొనసాగుతుంది. రానున్న కాలంలో ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. శుభకార్యాలు కూడా ఎక్కువగా ఉండటంతో బంగారం కొనుగోళ్లు కూడా మరింత పెరిగే అవకాశముంది. (cost)