బంగారం ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయాలి. లేకుంటే అవి అందుబాటులో ఉండకుండా పోతాయి. అందుకే గోల్డ్ లవర్స్ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా? అంటూ వెయిట్ చేస్తుంటారు. బంగారం అంటే మగువలకు అంత పిచ్చి. తమ వద్ద దాచిపెట్టుకున్న కొద్దోగొప్పో సొమ్మును బంగారం కొనుగోలు చేయడానికే వినియోగిస్తారు. అందుకే బంగారం షాపులు నిత్యం సీజన్ తో సంబంధం లేకుండా కళకళ లాడిపోతుంటాయి.
వెండి భారీగా…
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై వంద రూపాయలు తగ్గింది. వెండి ధర అయితే భారీగా తగ్గింది. కిలో వెండి ధరపై వెయ్యి రూపాయల వరకూ తగ్గింది. దీంతో పసిడి ప్రియుల ఆనందం అంతా ఇంతా కాదు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,150 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,070 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 75,7000 రూపాయలుగా నమోదయింది.