పాకిస్థాన్ లో శక్తీ పీఠం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..! గోపీచంద్ కథానాయకుడిగా వచ్చిన సాహసం అనే సినిమా అందరూ చూసే ఉంటారు అందులో హీరోయిన్ (తాప్సీ) దైవ భక్తురాలు. ఎన్ని అవరోధాలు ఎదురైనా పాకిస్తాన్ లో ని “హింజ్ లాజ్ మాత ” (Hinglaj matha) ఆలయాన్ని చేరుకోవాలని ఆశయం తో కధ ఉంటుంది. హీరో మాత్రం వేరే ఆశయం తో బయల్దేరుతాడు. ఇంతకీ హింగ్ లాజ్ మాత కూడా విన్నారా, అసలు ఇలాంటి ఓ శక్తిపీఠం పాకిస్థాన్ లో ఉందని తెలుసా..?
అసలు శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయంటే సతీదేవి శరీరభాగాలు 18 ప్రదేశాలలో పడటం వలన అని చెప్తారు. అయితే ఈ సంఖ్య ఒకో గ్రంధం లో ఒక్కోలా ఉందట. 4,51,55,108 ఇలా ఉందట. వాటిలో “హింగ్లాదేవి”ని శక్తిపీఠంగా కూడా పేర్కొనడం గమనించవచ్చు. ఈ హింగ్లాజ్ దేవి (Hinglaj matha) ఆలయం పాకిస్థాన్‌లోని కరాచీ నుంచి 300 కిలోమీటర్ల దూరంలోని బలూచిస్థాన్‌లో ఉంది.
స్థల పురాణం..
స్థలపురాణం ప్రకారం అమ్మవారి తల భాగం ఇక్కడ పడింది. అందువల్ల, ఇక్కడ విగ్రహం కు ఆకారం ఉండదు. భక్తులు ఒక చిన్న గుహలో మట్టితో చేసిన సింధురపు రాయిని మాత్రమే చూడగలరు. సింధూరాన్ని సంస్కృతంలో “హింగళము” అంటారట అందువలనే ఆ దేవతకి హింగ్లేమాత (Hinglaj matha) అనే పేరు వచ్చిందని చెబుతారు. మరొక పురాణం ప్రకారం, ప్రజలు ఒకప్పుడు హింగులా అనే రాక్షసుడి చే హింసించబడ్డారట. అతడిని నుంచి తప్పించుకోవడానికి హింగులు ఓ గుహ లో కి వెళ్లి దాకున్నారట ఆ రాక్షసుడిని అనుసరించి గుహలోకి వెళ్లిన అమ్మవారు హింగుళుడిని సంహరించారట . అందుకే అమ్మవారికి హింగ్ లాజ్ దేవి అనే పేరు వచ్చిందట .
హింగ్లాదేవి (Hingla Devi) ఆలయం ఇరుకైన లోయలో ఉంటుంది . పూర్వం ఈ ఆలయానికి చేరుకోవడం చాలా కష్టంగా ఉండేదట. అయితే, ఇప్పుడు సౌకర్యాల దృష్ట్యా ఇప్పుడు అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదట. అందువలన ఇప్పుడు ఈ ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతుందట.ఏప్రిల్‌లో నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందట . ఎలాంటి ఆపదైన , అనారోగ్యమైన తల్లి హింగ్ లాజ్ మాత (Hinglaj matha) ఆశీర్వాదంతో ఆ ప్రమాదం తొలగిపోతుందని భకత్తుల విశ్వాసం. అందుకే ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారట. కొన్ని క్షత్రియ శాఖలకు, ఈ తల్లి కులదైవమట. పరశురాముడు క్షత్రియులందరినీ సంహరిస్తున్నప్పుడు హింగ్ లాజ్ దేవి కొంతమంది క్షత్రియులను రక్షించిందట. అందుకే వారి తరువాతి తరం వారు ఇప్పటికీ ఆ తల్లి ని కొలుస్తుంటారు.
హిందువులు హింగ్లాదేవిని (Hingla Devi) పూజిస్తారు అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు కానీ ఇక్కడ ముస్లింలు కూడా ఈ తల్లిని పూజిస్తారట. అక్కడి వారంతా ఈ ఆలయాన్ని “నాని కి మందిర్” అని పిలుస్తార. ఈ అమ్మవారిని కుంకుమపువ్వుతో, అగరొత్తులతో తయారుచేస్తారు. స్థానికుల ఈ నమ్మకానికి ధన్యవాదాలు… పాకిస్తాన్లో, కాలక్రమేణా, అన్ని ఇతర దేవాలయాలు ఏకీకృతం చేయబడ్డాయి, కానీ “హింగ్రాజ్ మాత” ఆలయం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.